boAt Sailor Nav : పిల్లలు ఎక్కడున్నా పేరెంట్స్ కనిపెట్టేస్తారు.. బోట్ తెచ్చిన కిలాడీ స్మార్ట్‌వాచ్

బోట్ సేలర్ నెవ్ స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధర రూ. 6,499 గా ఉంది.

boAt Sailor Nav : పిల్లలు ఎక్కడున్నా పేరెంట్స్ కనిపెట్టేస్తారు.. బోట్ తెచ్చిన కిలాడీ స్మార్ట్‌వాచ్

Photo Credit: boAt

boAt Sailor Nav

ముఖ్యాంశాలు
  • పిల్లల భద్రతలో సరికొత్త విప్లవం
  • గూగుల్ మ్యాప్స్, 4G కాలింగ్‌తో బోట్ సంచలన ప్రొడక్ట్స్
  • చెవులు పాడుకాకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు
ప్రకటన

boAt Sailor Nav : ప్రముఖ ఆడియో, లైఫ్‌స్టైల్ టెక్ బ్రాండ్ బోట్ డిజిటల్ యుగంలో పిల్లల అవసరాలు, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా కిడ్ సిరీస్‎ను భారత్‌లో ఆవిష్కరించింది. మారుతున్న పేరెంటింగ్ శైలికి తగినట్లుగా ఆన్‌లైన్ లర్నింగ్, వినోదం, పిల్లలతో నిరంతరం కనెక్ట్ అయి ఉండేందుకు ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా బోట్ సేలర్ నెవ్ కనెక్టెడ్ స్మార్ట్‌వాచ్, బోట్ సేలర్ ప్లే  వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు.

బోట్ సేలర్ నెవ్ ధర, సెక్యూరిటీ ఫీచర్లు
బోట్ సేలర్ నెవ్ స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధర రూ. 6,499 గా ఉంది. ఇది ఫెయిరీ పింక్, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.4-ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇన్-బిల్ట్ 4G సిమ్ సాయంతో ఈ వాచ్ ద్వారా టూ-వే వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్,  ఆడియో చాట్ చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో తల్లిదండ్రులకు సమాచారం అందించేందుకు ఎస్‌ఓఎస్ బటన్ ఫీచర్ కూడా ఉంది.

లైవ్ లొకేషన్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్
తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ వాచ్‌లో రియల్-టైమ్ గూగుల్ మ్యాప్స్ ట్రాకింగ్ సదుపాయం ఇచ్చారు. 5-పాయింట్ శాటిలైట్ పొజిషనింగ్, అడ్వాన్స్‌డ్ జియో-ఫెన్సింగ్ ఫీచర్ ద్వారా పిల్లలు ఎక్కువగా వెళ్లే పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు లేదా పార్కుల వద్ద సేఫ్ జోన్‌లను క్రియేట్ చేయవచ్చు. పిల్లలు స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే వారి సేఫ్టీని పేరెంట్స్ కంట్రోల్ చేయవచ్చు.

Viral Hack : వ్యాలెట్‌కి అల్యూమినియం పేపర్ చుడితే రూపాయి కూడా పోదు.. వైరల్ అవుతున్న విచిత్రమైన ట్రిక్

బోట్ సేలర్ ప్లే వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్
చిన్నారుల వినికిడి శక్తి సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో బోట్ సేలర్ ప్లే వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను తెచ్చింది. దీని ధర రూ. 1,499 కాగా బబుల్‌గమ్ పింక్, షార్క్ బ్లూ, కోరల్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఇందులో పిల్లల వినికిడికి హాని కలగకుండా 85 dB వాల్యూమ్ లిమిట్‌ను అందించారు. 40mm డైనమిక్ డ్రైవర్లు స్ఫుటమైన సౌండ్ క్వాలిటీని ఇస్తాయి. పెరిగే పిల్లల పరిమాణానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకునేలా సాఫ్ట్ ఈయర్‌కప్స్, హెడ్‌బ్యాండ్ డిజైన్ చేశారు.

అద్భుతమైన బ్యాటరీ లైఫ్
బోట్ సేలర్ ప్లే హెడ్‌ఫోన్స్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 60 గంటల లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తాయి. వీటిలో మల్టీఫంక్షన్ కంట్రోల్స్, ఇన్-బిల్ట్ మైక్రోఫోన్ ఉన్నాయి. వీటి సాయంతో పిల్లలు నేరుగా హెడ్‌ఫోన్స్ నుంచే మ్యూజిక్ ప్లే, పాజ్ చేయడం, వాల్యూమ్ మార్చడం,  ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి కాల్స్ మాట్లాడటం వంటివి సులువుగా చేయవచ్చు. ఈ ప్రొడక్ట్స్ బోట్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »