ప్రముఖ టెక్ వెబ్‌సైట్ స్మార్ట్‌ప్రిక్స్, ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అందించిన లీక్స్ ప్రకారం.. సరికొత్త రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో జూన్ 18వ తేదీన అధికారికంగా విడుదల కానుంది.
Photo Credit: Amazon/ Redmi
Redmi Turbo 5 features a 7,560mAh battery in China
Xiaomi : భారత మొబైల్ మార్కెట్లో బడ్జెట్, మిడ్-రేంజ్ విభాగంలో తిరుగులేని పాపులారిటీ ఉన్న షావోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి.. ఇండియన్ యూజర్ల కోసం ఒక సంచలన ప్రకటన చేసింది. చైనా మార్కెట్లో ఇప్పటికే సూపర్ హిట్ అయిన ఒక సరికొత్త ఫ్లాగ్‌షిప్ కిల్లర్ సిరీస్‌ను మొదటిసారిగా మన దేశంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టెక్ వర్గాల నుంచి లీకైన సమాచారం ప్రకారం.. వచ్చే నెలలోనే ఒకే వేదికపై రెండు సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి వదిలేందుకు కంపెనీ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్, అఫీషియల్ వెబ్‌సైట్లలో వీటికి సంబంధించిన మైక్రోసైట్లు కూడా అప్పుడే లైవ్ అయ్యాయి.
ప్రముఖ టెక్ వెబ్‌సైట్ స్మార్ట్‌ప్రిక్స్, ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అందించిన లీక్స్ ప్రకారం.. సరికొత్త రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో జూన్ 18వ తేదీన అధికారికంగా విడుదల కానుంది. విశేషం ఏంటంటే.. ఈ ఫోన్‌తో పాటే మోస్ట్ అవేటెడ్ బడ్జెట్ ఫోన్ రెడ్‌మి 17 5G కూడా అదే రోజున లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. ఇండియాలోకి అడుగుపెడుతున్న మొట్టమొదటి టర్బో సిరీస్ హ్యాండ్‌సెట్ ఇదే కావడం గమనార్హం.
കർവ്ഡ് ഡിസ്പ്ലേയുമായി മൊട്ടറോള എഡ്ജ് 70 പ്രോ പ്ലസ് വരുന്നു
ఈ ఏడాది జనవరిలో చైనాలో లాంచ్ అయిన రెడ్‌మి టర్బో 5 ధర అక్కడ దాదాపు రూ. 30,000 (CNY 2,299) గా ఉంది. ఇండియాలోనూ ఇదే ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్.. 6.59 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, కళ్ళు చెదిరే 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇవ్వడం విశేషం. పవర్‌ఫుల్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్.. 16జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.
ఫోటోగ్రఫీ పరంగా రెడ్‌మి టర్బో 5 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా అమర్చారు. సెల్ఫీల కోసం ముందు వైపు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. ఈ ఫోన్‌కు అత్యంత కఠినమైన IP66 + IP68 + IP69 రేటింగులు ఉన్నాయి. అంటే నీటిలో మునిగినా, హై-ప్రెజర్ వాటర్ స్ప్రే పడినా ఫోన్‌కు ఏమీ కాదు.
టర్బో 5 కి తోడుగా వస్తోన్న రెడ్‌మి 17 5G స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ప్రియులను టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ ఫోన్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 7,000mAh కంటే పెద్దదైన భారీ బ్యాటరీని ఆఫర్ చేస్తున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. ఇది హై-రిఫ్రెష్ రేట్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 సాఫ్ట్‌వేర్ ఉండనున్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
iOS 27 Update for iPhone Adds Impersonation Risk Detection Feature to Protect You Against Scams