Samsung Galaxy Z Fold 8, Z Fold 8 Ultra and Z Flip 8 Leaks: శామ్‌సంగ్ వైడ్ ఫోల్డ్ మొబైల్‌లో ఏకంగా 60 మైక్రోమీటర్ల థిక్‌నెస్ కలిగిన అల్ట్రా థిన్ గ్లాస్ లేయర్‌ను కంపెనీ వాడబోతోంది
Samsung
Samsung Galaxy Z Fold 8, Z Fold 8 Ultra and Z Flip 8 Leaks: ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో తిరుగులేని రారాజుగా వెలుగుగొందుతున్న దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్, తన అప్‌కమింగ్ ఫోల్డబుల్ మొబైల్స్ కోసం ఒక భారీ అప్‌గ్రేడ్‌ను సిద్ధం చేస్తోంది. ఫోల్డబుల్ ఫోన్లు ఉపయోగించే చాలా మంది కస్టమర్లు.. స్క్రీన్ మధ్యలో వచ్చే మడత వల్ల కాస్త అసంతృప్తిగా ఉంటారు. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తూ.. కంపెనీ తన రాబోయే శామ్‌సంగ్ వైడ్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లో మునుపటి కంటే ఎక్కువ థిక్‌నెస్ కలిగిన గ్లాస్ లేయర్‌ను ఉపయోగించబోతోంది. దీనివల్ల స్క్రీన్ ప్యానెల్ మరింత మన్నికగా మారడమే కాకుండా, క్రీజ్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది.
లీకైన తాజా మీడియా నివేదికల ప్రకారం.. శామ్‌సంగ్ వైడ్ ఫోల్డ్ మొబైల్‌లో ఏకంగా 60 మైక్రోమీటర్ల థిక్‌నెస్ కలిగిన అల్ట్రా థిన్ గ్లాస్ లేయర్‌ను కంపెనీ వాడబోతోంది. సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో గ్లాస్ మందం తక్కువగా ఉంటేనే మడచడం సులభం అవుతుంది కానీ, దానివల్ల స్క్రీన్‌పై మడత గీత స్పష్టంగా కనిపిస్తుంది. పైగా బయటి నుంచి వచ్చే ఒత్తిడి లేదా ఫోన్ కింద పడినప్పుడు డిస్‌ప్లే సులభంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శామ్‌సంగ్ ఈ గ్లాస్ మందాన్ని 60 మైక్రోమీటర్లకు పెంచడం వల్ల స్క్రీన్ చాలా ఫ్లాట్ గా కనిపిస్తుంది. బాహ్య ఒత్తిడి నుంచి అద్భుతమైన రక్షణ లభిస్తుంది.
మరోవైపు శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 మోడల్‌లో మాత్రం ప్రస్తుతం వాడుతున్న 45 మైక్రోమీటర్ల అల్ట్రా థిన్ గ్లాస్ లేయర్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 50 లక్షల నుంచి 60 లక్షల యూనిట్ల కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా షిప్‌మెంట్ చేయాలని శామ్‌సంగ్ టార్గెట్‌గా పెట్టుకుంది. వచ్చే నెలలో జరగబోయే ప్రతిష్టాత్మక గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 వైడ్, శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 ఫోన్లను అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.
Amazon : జూన్ 18 వరకే ఛాన్స్.. అమెజాన్లో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై భారీ డిస్కౌంట్లు
ఈ కొత్త ఫోన్ల లాంచ్‌కు బలాన్ని చేకూరుస్తూ.. ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌లో శామ్‌సంగ్‌కు చెందిన మూడు సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు లిస్ట్ అయ్యాయి. ఈ లిస్టింగ్ లో ప్రత్యేకంగా స్పెసిఫికేషన్లు వెల్లడించనప్పటికీ.. మోడల్ నంబర్ల వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో SM-A857B, SM-F776B మోడల్ నంబర్లతో గెలాక్సీ Z ఫ్లిప్ 8 ఫోన్, అలాగే SM-D642B, SM-F971B మోడల్ నంబర్లతో గెలాక్సీ Z ఫోల్డ్ 8 వైడ్ స్మార్ట్‌ఫోన్ ఉండబోతున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లిస్టింగ్ ను బట్టి చూస్తే.. గ్లోబల్ లాంచ్ అయిన వెంటనే ఈ ఫోన్లు ఇండియాలో కూడా కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి.
ఇదే బీఐఎస్ వెబ్‌సైట్‌లో SM-D647B, SM-F976B అనే మరో మోడల్ నంబర్ కూడా కనిపించింది. ఇది మరేదో కాదు.. శామ్‌సంగ్ మోస్ట్ ప్రీమియం మోడల్ శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా అయ్యే అవకాశం ఉంది. ఈ అల్ట్రా ఫోన్‌కు సంబంధించిన కొన్ని క్రేజీ లీక్స్ కూడా ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి. దీని ప్రకారం.. గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రాలో బయటి వైపు 6.5 ఇంచుల భారీ కవర్ డిస్‌ప్లే, ఫోన్ విప్పినప్పుడు లోపల ఏకంగా 8 ఇంచుల అల్ట్రా లార్జ్ ఇన్ స్క్రీన్ ఉండబోతున్నాయి. ఈ రెండు డిస్‌ప్లేలు కూడా గేమింగ్, వీడియోల కోసం సూపర్ స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం విశేషం.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know