ఈ పవర్ బ్యాంక్‌లో Qi2.2-సర్టిఫైడ్ 25W మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్, 35W USB-C పవర్ డెలివరీ, ప్రత్యేకంగా స్లైడ్-అవుట్ ఆపిల్ వాచ్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Photo Credit: Stuffcool
Stuffcool Omni Pro Powerbank : ప్రముఖ ఆక్సెసరీస్ తయారీ సంస్థ స్టఫ్‌కూల్ భారత మార్కెట్లోకి తమ సరికొత్త ఓమ్ని ప్రో పవర్ బ్యాంక్‌ను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ఇప్పటివరకు తమ బ్రాండ్ నుంచి వచ్చిన అత్యంత అడ్వాన్స్డ్ మ్యాగ్‌సేఫ్ కంప్యాటిబుల్ పవర్ బ్యాంక్ కావడం విశేషం. ఈ పవర్ బ్యాంక్‌లో Qi2.2-సర్టిఫైడ్ 25W మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్, 35W USB-C పవర్ డెలివరీ, ప్రత్యేకంగా స్లైడ్-అవుట్ ఆపిల్ వాచ్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఇందులో బిల్ట్-ఇన్ కిక్‌స్టాండ్, డిజిటల్ బ్యాటరీ డిస్ప్లే, శామ్సంగ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్
స్టఫ్‌కూల్ ఓమ్ని ప్రో పవర్ బ్యాంక్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్, అమెజాన్ ఇండియా ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. పూర్తిగా భారత్‌లోనే తయారైన ఈ పవర్ బ్యాంక్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ కాగా, ఇది బిఐఎస్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. భారత మార్కెట్లో దీని అధికారిక ధరను రూ.4,999 గా నిర్ణయించారు. అయితే అమెజాన్ ఆఫర్లలో భాగంగా ఇది ప్రస్తుతం రూ.4,750కే లిస్ట్ చేయబడింది. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
Aggregator Policy 2026 : ఆఖరి నిమిషంలో క్యాబ్ క్యాన్సిల్ చేస్తే డ్రైవర్లకు చుక్కలే.. ఏకంగా 5 రెట్ల భారీ జరిమానా
పవర్ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ
ఓమ్ని ప్రో పవర్ బ్యాంక్‌లో ఉన్న Qi2.2-సర్టిఫైడ్ 25W మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ ద్వారా కంప్యాటిబుల్ ఐఫోన్‌ను కేవలం 30 నిమిషాల్లో 50% వరకు వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయవచ్చు. అలాగే ఇందులో ఇచ్చిన 35W USB-C పవర్ డెలివరీ కేబుల్ కనెక్షన్ ద్వారా కూడా ఐఫోన్‌ను సుమారు 30 నిమిషాల్లోనే 50% వరకు ఛార్జ్ చేసే వెసులుబాటు ఉంది. ఆపిల్ ఫోన్లతో పాటు శామ్సంగ్ స్మార్ట్ఫోన్లను కూడా వేగంగా ఛార్జ్ చేయడానికి ఇది శామ్సంగ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్‌ను సపోర్ట్ చేస్తుంది.
స్లైడబుల్ ఆపిల్ వాచ్ ఛార్జర్
ఈ పవర్ బ్యాంక్ అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఇన్-బిల్ట్‌గా ఇచ్చిన స్లైడబుల్ ఆపిల్ వాచ్ ఛార్జింగ్ మోడ్యూల్. అవసరమైనప్పుడు ఈ మోడ్యూల్ బయటకు స్లైడ్ అవుతుంది, వాడకం లేనప్పుడు పవర్ బ్యాంక్ బాడీలోనే దాగి ఉంటుంది. దీని సహాయంతో వినియోగదారులు ఐఫోన్, ఆపిల్ వాచ్‌లను ఒకే సమయంలో ఛార్జ్ చేసుకోవచ్చు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో కోసం కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్‌ను పోర్ట్రెయిట్ లేదా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో పెట్టుకుని వీడియో కాల్స్, కంటెంట్ స్ట్రీమింగ్ లేదా స్టాండ్‌బై మోడ్ వాడటానికి ఇందులో కిక్‌స్టాండ్ కూడా ఇచ్చారు. ముందు భాగంలో ఉన్న డిజిటల్ డిస్ప్లే మిగిలి ఉన్న బ్యాటరీ శాతాన్ని రియల్ టైమ్‌లో చూపిస్తుంది. 11.1 × 7.1 × 2.06 సెంటీమీటర్ల సైజు, సుమారు 214 గ్రాముల బరువుతో ఇది జేబులో లేదా బ్యాగ్‌లో తేలికగా ఇమిడిపోతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999