ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రముఖ ఏగ్రిగేటర్ వేదికలపై ప్రయాణించే వారికి మెరుగైన, నమ్మకమైన సేవలు అందించేందుకు ఈ కొత్త విధానం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Photo Credit: Reuters
Aggregator Policy 2026
Aggregator Policy 2026 : యాప్ ఆధారిత క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ సేవలను వినియోగించుకునే ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రయాణికుల భద్రతను పెంపొందించడం, డ్రైవర్ల మనోభావాలు/ఉల్లంఘనలను అరికట్టడం లక్ష్యంగా మహారాష్ట్ర మోటార్ వెహికల్ ఏగ్రిగేటర్ నిబంధనలు 2026ను అధికారికంగా అమలులోకి తెచ్చింది. ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రముఖ ఏగ్రిగేటర్ వేదికలపై ప్రయాణించే వారికి మెరుగైన, నమ్మకమైన సేవలు అందించేందుకు ఈ కొత్త విధానం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అత్యవసర ప్రాంతాల రైడ్ క్యాన్సిలేషన్‌పై 5 రెట్ల జరిమానా
కొత్త నిబంధనల ప్రకారం, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్‌లు, ఆసుపత్రుల వంటి అత్యవసర ప్రాంతాలకు బుక్ చేసుకున్న ప్రయాణాలను డ్రైవర్లు తగిన కారణం లేకుండా రద్దు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఇటువంటి సున్నితమైన ప్రదేశాల బుకింగ్‌లను క్యాన్సిల్ చేసే డ్రైవర్లకు సాధారణ పెనాల్టీ కంటే 5 రెట్లు ఎక్కువ జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా, డ్రైవర్ల నుంచి వసూలు చేసిన ఈ జరిమానా మొత్తాన్ని నేరుగా ఆ నష్టపోయిన ప్రయాణికుడి యాప్ ఖాతాలోనే డిపాజిట్ చేయడం ప్రత్యేకత. సాధారణంగా డ్రైవర్ నిర్ణీత సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణికుడి వద్దకు చేరుకుంటే, దాన్ని కూడా డ్రైవర్ చేసిన రైడ్ క్యాన్సిలేషన్‌గానే పరిగణించి రూ.100 జరిమానా వేస్తారు. అదే ఎయిర్‌పోర్ట్, హాస్పిటల్ రైడ్ల విషయంలో ఈ ఫైన్ ఐదు రెట్లు పెరుగుతుంది.
ప్రయాణికులకు కూడా వర్తించే నిబంధనలు
కేవలం డ్రైవర్లకే కాకుండా ప్రయాణికుల బాధ్యతారాహిత్యాన్ని అరికట్టేందుకు కూడా ఈ విధానంలో నిబంధనలు ఉన్నాయి. ఏదైనా కారణం చేత ప్రయాణికుడు తగిన సమర్థన లేకుకుండా రైడ్‌ను రద్దు చేస్తే, సదరు ప్రయాణికుడికి మొత్తం ఛార్జీలో 5% లేదా గరిష్టంగా రూ.100 జరిమానా పడుతుంది. ఈ మొత్తాన్ని బాధిత డ్రైవర్‌కు పరిహారంగా జమ చేస్తారు. దీనివల్ల డ్రైవర్ సమయం, ఇంధనం వృథా కాకుండా రక్షణ లభిస్తుంది.
Xiaomi Mijia Wireless Floor Cleaner 5C : ఇంటి తుడవడంలో భార్యతో గొడవలు బంద్.. షియోమీ నుంచి ఇల్లు మెరిపించే కొత్త గాడ్జెట్
ఏగ్రిగేటర్ కంపెనీలకు కఠిన హెచ్చరికలు..
యాప్ ఆధారిత రవాణా సంస్థలు వినియోగదారుల భద్రతను నిర్లక్ష్యం చేసినా, పదే పదే నిబంధనలను ఉల్లంఘించినా లేదా ఛార్జీలకు సంబంధించి మోసాలకు పాల్పడినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు పాటించని కంపెనీల లైసెన్సులను రద్దు చేసే అధికారంతో పాటు రూ. 1 లక్ష నుంచి రూ. 1 కోటి వరకు భారీ ఆర్థిక జరిమానా విధించే నిబంధనలను రూపొందించారు. సమాచార ప్రకారం.. మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ మాట్లాడుతూ.. ముంబై వంటి నగరాల్లో డ్రైవర్లు తక్కువ దూరం లేదా తమకు సౌకర్యంగా లేని ప్రదేశాలకు వెళ్లే బుకింగ్‌లను చూసి వెంటనే క్యాన్సిల్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఈ కొత్త నిర్ణయం ద్వారా ఆఖరి నిమిషంలో రైడ్ క్యాన్సిల్ అయ్యే వైఖరికి అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999