ఈ సరికొత్త మొబైల్‌లో ముందెన్నడూ లేని విధంగా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను జోడించినట్లు టెక్నో స్పష్టం చేసింది.
Photo Credit: Tecno
Tecno Camon 50 Ultra 5G
Tecno : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో భారతీయ వినియోగదారుల కోసం మరో సరికొత్త మొబైల్‌ను పరిచయం చేయడానికి రెడీ అయ్యింది. తన పాపులర్ క్యామన్ సిరీస్‌లో భాగంగా టెక్నో క్యామన్ 50 అల్ట్రా 5జీని వచ్చే వారం దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 17న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సరికొత్త మొబైల్‌లో ముందెన్నడూ లేని విధంగా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను జోడించినట్లు టెక్నో స్పష్టం చేసింది. స్టైలిష్ లుక్, హై-ఎండ్ స్పెసిఫికేషన్లతో రాబోతున్న ఈ ఫోన్ ఇప్పటికే టెక్ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేసింది.
అమెజాన్‌లో మైక్రోసైట్ లైవ్
ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక మైక్రోసైట్ లైవ్ పేజీ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు అధికారికంగా బయటకు వచ్చాయి. ఈ ఫోన్ నెబ్యులా టైటానియం, సైప్రస్ గ్రీన్, మిస్టీ పర్పుల్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో లభించనుంది. డిజైన్ పరంగా చూస్తే, రౌండెడ్ కార్నర్స్‌తో కూడిన ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌ను ఇది కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో నిలువుగా అమర్చిన ట్రిపుల్ రేర్ కెమెరా మాడ్యూల్‌తో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లిమ్‌గా, చేతిలో పట్టుకోవడానికి ప్రీమియం లుక్‌తో ఉండబోతోంది.
144Hz రీఫ్రెష్ రేట్, 3D కర్వ్డ్ డిస్‌ప్లే
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లోనే ఈ ఫోన్‌ను మొదటిసారి ప్రదర్శించారు. డిస్‌ప్లే పరంగా ఈ ఫోన్ అద్భుతంగా ఉండబోతోంది. ఇందులో 6.78 ఇంచుల పెద్దదైన 1.5K (1,208 x 2,644 పిక్సెల్స్) 3D కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్‌ను అందించారు. గేమింగ్, స్క్రోలింగ్ స్మూత్‌గా సాగడం కోసం ఏకంగా 144Hz హై రీఫ్రెష్ రేట్‌ను ఇందులో వాడారు. అవుట్‌డోర్ బ్రైట్‌నెస్ కోసం ఇందులో 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్ ఉంది, దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, స్క్రీన్‌కు గట్టి రక్షణ కల్పించడం కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కూడా జోడించారు.
సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ ప్రాసెసర్
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టెక్నో క్యామన్ 50 అల్ట్రా 5జీ మోడల్‌లో 4 నానోమీటర్ ప్రాసెస్ ఆధారంగా తయారైన పవర్‌ఫుల్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Mali-G615 MC2 జీపీయూ గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్‌లో 12GB వరకు భారీ ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజ్ ఆప్షన్లు లభిస్తాయి. సాఫ్ట్‌వేర్ పరంగా, ఈ మొబైల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సరికొత్త సంచలనం.. జూలై 14న రెడ్‌మి నోట్ 17 సిరీస్ గ్రాండ్ లాంచ్
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 50MP సోనీ మెయిన్ కెమెరా
ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. పిల్ షేప్‌లో ఉన్న కెమెరా ఐలాండ్‌లో మూడు కెమెరాలను అమర్చారు. ఇందులో OIS సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ-700సి ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఈ వెనుక కెమెరా ద్వారా 30 fps వేగంతో 4K క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కేటాయించారు. ఏఐ ఫీచర్ల సాయంతో ఫోటోల క్వాలిటీ మరింత అద్భుతంగా రానుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains