Tecno Pova 8 Vs Realme 16 5G Vs Vivo V60e comparison: టెక్నో పోవా 8 బేస్ వేరియంట్ 6GB/128GB ధర రూ.29,999 కాగా, 8GB/128GB వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది
Photo Credit: Tecno/Realme/Vivo
Tecno Pova 8 vs Realme 16 5G vs Vivo V60e
Tecno Pova 8 Vs Realme 16 5G Vs Vivo V60e Comparison: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిడ్-రేంజ్ బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా టెక్నో సంస్థ తన పవర్‌ఫుల్ మొబైల్ టెక్నో పోవా 8ను లాంచ్ చేసి మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ ఫోన్‌కు మార్కెట్లో గట్టి పోటీగా నిలిచాయి రియల్‌మీ 16 5G, వివో వీ60ఈ మోడల్స్. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు కూడా వాటికవే ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. కస్టమర్లను ఎంతగానో ఆకర్షిస్తున్న ఈ మూడు మొబైల్స్ రేట్లు, స్పెసిఫికేషన్లను పరిశీలిద్దాం.
ధర, స్టోరేజ్ వేరియంట్ల వివరాలు..
మొదటగా రేట్ల విషయానికి వస్తే.. టెక్నో పోవా 8 బేస్ వేరియంట్ 6GB/128GB ధర రూ.29,999 కాగా, 8GB/128GB వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది. ఇక రియల్‌మీ 16 5G విషయానికి వస్తే.. దీని 8GB/128GB మోడల్ ధర రూ.31,999, 8GB/256GB మోడల్ ధర రూ.33,999గా నిర్ణయించారు. వీటికి పోటీగా ఉన్న వివో వీ60ఈ కూడా సరిగ్గా ఇదే ధరలతో వస్తోంది.. దీని 8GB/128GB వేరియంట్ రూ.31,999కి లభిస్తుండగా, 8GB/256GB హై-ఎండ్ వేరియంట్ రూ.33,999 ధరతో అందుబాటులో ఉంది. బడ్జెట్ పరంగా చూస్తే టెక్నో ఫోన్ కొద్దిగా తక్కువ ధరకే లభిస్తోంది.
డిస్‌ప్లే, విజువల్ క్వాలిటీ..
డిస్‌ప్లే పరంగా చూస్తే ఈ మూడింటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. టెక్నో పోవా 8లో 6.76 ఇంచుల ఫుల్ HD+ IPS స్క్రీన్ ఇచ్చారు, ఇది సూపర్ ఫాస్ట్ 144Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అదే సమయంలో రియల్‌మీ 16 5Gలో 6.5 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఏకంగా 4,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది, అంటే ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వివో వీ60ఈ విషయానికి వస్తే.. ఇందులో అల్ట్రా ప్రీమియం లుక్ ఇచ్చేలా 6.77 ఇంచుల క్వాడ్ కర్వ్‌డ్ అమోలెడ్ స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అందించారు. డిస్‌ప్లే లుక్ వైజ్ వివో, బ్రైట్‌నెస్ వైజ్ రియల్‌మీ మెరుగ్గా ఉన్నాయి.
ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్..
మొబైల్ స్పీడ్, పర్ఫార్మెన్స్ నిర్ణయించే ప్రాసెసర్ విషయానికి వస్తే.. టెక్నో పోవా 8లో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్ ఉంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైఓఎస్ 16 పై పనిచేస్తుంది. రియల్‌మీ 16 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్ అందించారు, ఇది కూడా ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 తో రన్ అవుతుంది. కాగా, వివో వీ60ఈ లో మరింత పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ను ఉపయోగించారు.. కానీ ఇది పాత ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 పై పనిచేయడం కొసమెరుపు.
Samsung : ఫోల్డబుల్ మొబైల్స్ లో శామ్‌సంగ్ సరికొత్త విప్లవం.. స్క్రీన్‌పై క్రీజ్ సమస్యకు శాశ్వతంగా చెక్
కెమెరా సెటప్ లో వివో దే పైచేయి..
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే వివో అందరికంటే చాలా ముందుంది. వివో వీ60ఈ వెనుక భాగంలో ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఇచ్చారు, సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక రియల్‌మీ 16 5Gలో 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. టెక్నో పోవా 8 ఈ విభాగంలో కొద్దిగా వెనుకబడింది.. దీని వెనుక కేవలం 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా, ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మాత్రమే ఉన్నాయి. కెమెరానే ముఖ్యమనుకునే వారికి వివో బెస్ట్ ఛాయిస్.
బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్..
బ్యాటరీ విషయానికి వస్తే టెక్నో పోవా 8 సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక రియల్‌మీ 16 5Gలో 7,000mAh బ్యాటరీతో పాటు 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వివో వీ60ఈ లో 6,500mAh బ్యాటరీ ఉన్నప్పటికీ, ఇది సూపర్ ఫాస్ట్ 90W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఎక్కువ రోజులు బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి టెక్నో, రియల్‌మీ బెస్ట్ ఆప్షన్లు కాగా, త్వరగా ఛార్జింగ్ అవ్వాలనుకునే వారికి వివో బాగుంటుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999