ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రాతిపదికన విద్యార్థులు 6,100 కంటే ఎక్కువ సరికొత్త, వైవిధ్యమైన ప్రాజెక్ట్ ఐడియాలను సమర్పించారు.
Photo Credit: Vivo India
Vivo Ignite 2026
Vivo Ignite 2026 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఇండియా తమ ప్రతిష్టాత్మక వివో ఇగ్నైట్ 2026లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ సంవత్సరం నిర్వహించిన ఆవిష్కరణల పోటీలో దేశవ్యాప్తంగా 38,000 మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుంచి ఇదే అత్యధిక భాగస్వామ్య సంఖ్య కావడం విశేషం. 8వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులలో దాగి ఉన్న క్రియేటివిటీని వెలికితీసి, మోడ్రన్ టెక్నాలజీ ద్వారా సమాజం, పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమే ఈ వివో ఇగ్నైట్ ప్రధాన లక్ష్యం.
దేశం నలుమూలల నుంచి వెల్లువెత్తిన అప్లికేషన్లు
ఈ ఏడాది పోటీలలో దేశవ్యాప్తంగా విపరీతమైన స్పందన లభించింది. ఏకంగా 12,000 కంటే ఎక్కువ పాఠశాలలు, 705 జిల్లాలు, 4,500 పైగా నగరాలు, పట్టణాల నుంచి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతదేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ పోటీలో భాగమయ్యారు. అంతేకాకుండా వెనుకబడిన లేదా అభివృద్ధి చెందుతున్న 92 ఆకాంక్షాత్మక జిల్లాల నుంచి కూడా భారీగా విద్యార్థులు తమ ప్రాజెక్ట్ ఐడియాలను పంపించడం ఈ ఈవెంట్ గొప్పదనానికి అద్దం పడుతోంది.
సామాజిక సమస్యలపై క్రియేటివిటీ ఆలోచనల వర్షం
వివో ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రాతిపదికన విద్యార్థులు 6,100 కంటే ఎక్కువ సరికొత్త, వైవిధ్యమైన ప్రాజెక్ట్ ఐడియాలను సమర్పించారు. వీటిలో ముఖ్యంగా టెక్నాలజీ, వ్యవసాయం, వాతావరణ మార్పుల అంశాలపైనే అత్యధికంగా ప్రాజెక్టులు వచ్చాయి. మొత్తం సబ్మిషన్లలో ఈ రంగానికి చెందినవే దాదాపు 35 శాతం ఉండటం విశేషం. ప్రాంతాల వారీగా చూస్తే, ఉత్తర భారతదేశం నుంచి అత్యధికంగా 38 శాతం ప్రాజెక్ట్ ఐడియాలు నమోదయ్యాయి.
Samsung Galaxy : శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8, ఫోల్డ్ 8 సిరీస్ సంచలనం.. ప్రీ-బుకింగ్స్‌లో మైండ్ బ్లోయింగ్ రికార్డు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంచలన ప్రగతి
ఈ సంవత్సరం వివో ఇగ్నైట్‌లో మరో ముఖ్యమైన అడుగు పడింది. గత ఎడిషన్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భాగస్వామ్యం కేవలం 5 శాతంగా మాత్రమే ఉండగా, ఈసారి అది ఏకంగా 14 శాతానికి పెరిగింది. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు కూడా అత్యాధునిక ఆలోచనలతో సాంకేతిక పరిష్కారాలను రూపొందించడంలో ముందు వరుసలో నిలిచారు. సమర్పించిన అన్ని ప్రాజెక్టులను నిపుణుల బృందం వివిధ దశల్లో మూల్యాంకనం చేస్తుంది. ఎంపిక చేసిన విద్యార్థులకు నిపుణుల మార్గదర్శకత్వం అందించి, వారి ఐడియాలను వర్కింగ్ ప్రొటోటైప్‌లుగా మార్చడానికి సహాయపడతారు.
35 లక్షల స్కాలర్‌షిప్‌లు
ఈ ఆవిష్కరణల పోటీలో గెలుపొందిన, ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం వివో ఏకంగా రూ. 35 లక్షల విలువైన ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్‌లను, అలాగే ఇతర బహుమతులను ప్రకటించింది. విద్యార్థులతో పాటు వారిలో క్రియేటివిటీని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించేందుకు టీచర్ ఇన్నోవేషన్ ఫెలోషిప్‌ను కూడా ప్రారంభించారు. వివో ఇగ్నైట్ 2026 గ్రాండ్ నేషనల్ ఫినాలే అక్టోబర్ 2026లో న్యూఢిల్లీ వేదికగా ఘనంగా జరగనుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale