గతేడాది విడుదలైన గెలాక్సీ Z ఫోల్డ్ 7, Z ఫ్లిప్ 7 సిరీస్ ఫోన్లకు ఈ స్థాయి ప్రీ-బుకింగ్స్ సాధించడానికి ఏకంగా 15 రోజుల సమయం పట్టింది.
Photo Credit: Samsung
Galaxy Z Fold 8 Ultra, Galaxy Z Fold8, Galaxy Z Flip8
Samsung Galaxy : ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన తన 8 జనరేషన్‌కు చెందిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. కంపెనీ తీసుకొచ్చిన గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్ 8 . గెలాక్సీ Z ఫ్లిప్ 8 మోడళ్లు భారత్‌లో విడుదలైనప్పటి నుంచి సంచలనాలు నమోదు చేస్తున్నాయి. జూలై 22న ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవ్వగా కేవలం ఒక్క వారంలోనే వీటికి కస్టమర్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ మేరకు కంపెనీ అధికారిక లెక్కలను వెల్లడిస్తూ, ఈ కొత్త డివైజ్ లు ప్రీ-బుకింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాయని ప్రకటించింది.
72 గంటల్లోనే 2.71 లక్షల బుకింగ్స్
కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జూలై 22న బుకింగ్స్ ప్రారంభమైన మొదటి 72 గంటల్లోనే ఏకంగా 2.71 లక్షల ప్రీ-ఆర్డర్లు నమోదయ్యాయి. గతేడాది విడుదలైన గెలాక్సీ Z ఫోల్డ్ 7, Z ఫ్లిప్ 7 సిరీస్ ఫోన్లకు ఈ స్థాయి ప్రీ-బుకింగ్స్ సాధించడానికి ఏకంగా 15 రోజుల సమయం పట్టింది. కానీ ఈసారి కేవలం 3 రోజుల్లోనే ఆ రికార్డును కొత్త సిరీస్ దాటేసింది. దీన్ని బట్టి చూస్తే, పాత సిరీస్‌తో పోలిస్తే కొత్త ఫోల్డబుల్స్‌కు భారతీయ వినియోగదారుల నుంచి ఎంతటి భారీ స్పందన లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
టైర్ 2 నగరాల్లో పెరిగిన క్రేజ్
ఈ ప్రీ-బుకింగ్స్‌లో మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టెక్నాలజీ లవర్స్ కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాలేదు. మొత్తం ప్రీ-ఆర్డర్లలో ఏకంగా 45 శాతం బుకింగ్స్ టైర్-2 నగరాల నుంచే రావడం విశేషం. ప్రీమియం, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లకు చిన్న నగరాల్లో కూడా విపరీతమైన డిమాండ్ పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మోడ్రన్ టెక్నాలజీ, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఇప్పుడు చిన్న పట్టణాల ప్రజలను కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 మోడల్ లోపలి భాగంలో 7.6 ఇంచుల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇందులో 16GB వరకు RAM, 1TB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. కెమెరా విభాగంలో వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు మరొక 50 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ఫినిటీ స్క్రీన్ కింద 10 మెగాపిక్సెల్ కెమెరా, సెల్ఫీల కోసం మరొక 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 4,800mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది.
Samsung Galaxy Z Fold 6 5G : శామ్‌సంగ్ ఫోన్‌పై భారీ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో Z ఫోల్డ్ 6 పై ఏకంగా రూ. 19,000 తగ్గింపు
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా
ఇక టాప్-ఎండ్ మోడల్ అయిన గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రాలో 8 ఇంచుల పెద్ద AMOLED ఇంటర్నల్ డిస్‌ప్లే, బయట వాడటానికి 6.5 ఇంచుల AMOLED కవర్ డిస్‌ప్లేలను అందించారు. ఈ రెండు స్క్రీన్‌లు కూడా 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. ఫోటోగ్రఫీ లవర్స్ కోసం వెనుక భాగంలో ఏకంగా 200 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలను అమర్చారు. సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో పెద్దదైన 5,000mAh బ్యాటరీని ఇచ్చారు, ఇది కూడా 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale