ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన వివో X300 ఆల్ట్రా, వివో X300 ఎఫ్ఈ మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Photo Credit: Vivo
Vivo X300 FE
Vivo X300e : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతీయ మార్కెట్లోనూ వరుసగా కొత్త మొబైళ్లను లాంచ్ చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన వివో X300 ఆల్ట్రా, వివో X300 ఎఫ్ఈ మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న వివో సంస్థ, తాజాగా ఈ సిరీస్‌లో ఐదో మోడల్‌గా Vivo X300e అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకై హల్చల్ చేస్తున్నాయి.
పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్
ప్రముఖ చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వెయిబోలో ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసిన సమాచారం ప్రకారం.. సరికొత్త వివో X300e స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో రానుంది. ఇందులో 1.5K రిజల్యూషన్ సపోర్ట్ చేసే 6.59 ఇంచుల ఓఎల్ఈడీ ఫ్లాట్ డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడా తగ్గకుండా ఉండేందుకు క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. దీనివల్ల హెవీ గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది.
జైస్ బ్రాండెడ్ 50MP ట్రిపుల్ కెమెరా
ఫోటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం వివో ఈసారి మరింత ప్రత్యేకమైన కెమెరా సెటప్‌ను జోడించనుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ప్రసిద్ధ జైస్ బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉండనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ సామర్థ్యం గల Sony IMX8 సిరీస్ పెరిస్కోప్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ హై-క్వాలిటీ ఫ్రంట్ కెమెరాను అమర్చనున్నారు. భద్రత కోసం ఇందులో స్క్రీన్ కిందనే పనిచేసే అడ్వాన్స్‌డ్ ఆల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇస్తున్నారు.
లీకైన వివో కొత్త ఫోన్ ఫీచర్లు
ఈ సరికొత్త వివో X300e ఫోన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే ప్రధానమైన ఫీచర్ దీని బ్యాటరీ కెపాసిటీ. సాధారణంగా ఫోన్లలో 5,000 mAh బ్యాటరీలను చూస్తుంటాం, కానీ ఈ మోడల్లో ఏకంగా 7,015 mAh లేదా 7,100 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు లీకుల ద్వారా తెలిసింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నందున ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. అలాగే ఫోన్ బిల్డ్ క్వాలిటీ, లుక్ ప్రీమియంగా కనిపించేలా దీనికి చుట్టూ స్ట్రాంగ్ మెటల్ ఫ్రేమ్ ను ఉపయోగించనున్నారు.
iPhone : ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. సగం ధరకే అద్భుతమైన ఐఫోన్ మోడల్స్
ఇటీవలే లాంచైన Vivo X300 FE
రాబోయే Vivo X300e ఫీచర్లు దాదాపుగా మే నెలలో లాంచైన Vivo X300 FE మోడల్‌ను పోలి ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే X300 FE మోడల్లో 6.31 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 6,500 mAh కాగా, ఇది 90W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. మొబైల్ ఎక్కువగా హీట్ అవ్వకుండా ఉండేందుకు X300 FE మోడల్లో 4,005 చదరపు మిల్లీమీటర్ల విస్తీర్ణంలో వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా వివో ఏర్పాటు చేసింది.
ఈ X300 FE కెమెరా విభాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటోఫోకస్ సపోర్ట్‌తో కూడిన 50MP Sony IMX921 ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP ఆల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. దీని ద్వారా 4K క్వాలిటీతో సెకనుకు 60 ఫ్రేమ్స్ (60 fps) వేగంతో వీడియోలను రికార్డ్ చేయవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మధ్య శ్రేణి, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఇప్పుడు రాబోతున్న కొత్త X300e మోడల్ కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధిస్తుందని కంపెనీ నమ్ముతోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Bee Frontier, Bee Eclipse AI Devices Launched: Price, Specifications