Vivo S60 : ఐఫోన్ల కంటే పవర్‌ఫుల్ ఫీచర్లు.. ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీతో వివో S60 సిరీస్ లాంచ్

వివో సంస్థ ఈ సరికొత్త సిరీస్ ఫోన్లను ఫీచర్లకు తగ్గట్టుగా లగ్జరీ, మిడ్-రేంజ్ ధరల్లో తీసుకొచ్చింది.

Vivo S60 : ఐఫోన్ల కంటే పవర్‌ఫుల్ ఫీచర్లు.. ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీతో వివో S60 సిరీస్ లాంచ్

Photo Credit: Vivo

Vivo S60 features a unibody glass design

ముఖ్యాంశాలు
  • ఏకంగా 7200mAh బ్యాటరీ, 100x జూమ్ కెమెరాతో వివో S60 సిరీస్
  • ఇక మూడు రోజుల పాటు ఛార్జర్తో పనేలేదు
  • 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా
ప్రకటన

 Vivo S60 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో గ్లోబల్ మార్కెట్లో తన సరికొత్త సంచలనానికి తెరలేపింది. టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ సరికొత్త మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. శుక్రవారం జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ లో వివో S60, వివో S60 వైటాలిటీ ఎడిషన్ అనే రెండు అల్ట్రా-పవర్‌ఫుల్ మోడళ్లను మార్కెట్లోకి దించింది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 7,200mAh కొండలాంటి భారీ బ్యాటరీ, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ మరియు 100x జూమ్ కెమెరాల వంటి నెక్స్ట్ లెవెల్ ఫీచర్లతో ఈ ఫోన్లు అడుగుపెట్టాయి. 

మధ్యతరగతి బడ్జెట్ లో వివో S60 సిరీస్ ధరలు 
వివో సంస్థ ఈ సరికొత్త సిరీస్ ఫోన్లను ఫీచర్లకు తగ్గట్టుగా లగ్జరీ, మిడ్-రేంజ్ ధరల్లో తీసుకొచ్చింది. స్టాండర్డ్ మోడల్ అయిన వివో S60 ప్రారంభ ధర CNY 3,599 (భారత కరెన్సీలో సుమారు రూ.50,000)గా నిర్ణయించారు. ఇది 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. కాగా, దీని 16జీబీ + 512జీబీ టాప్ ఎండ్ మోడల్ ధర CNY 4,399 (సుమారు రూ.62,000)గా ఉంది. మరోవైపు, కాస్త తక్కువ బడ్జెట్ లో వచ్చే వివో S60 వైటాలిటీ ఎడిషన్ బేస్ వేరియంట్ (8GB + 256GB) ధర CNY 2,899 (దాదాపు రూ.41,000) గా నిర్ణయించారు. ఇవి ఎర్లీ సమ్మర్ గ్రీన్, మిడ్‌సమ్మర్ నైట్స్ డ్రీమ్, సీ ఆఫ్ స్టార్స్ వంటి బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. జూన్ 3, 2026 నుండి ఇవి వివో అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి రానున్నాయి.

కంటికి విందు ఇచ్చే 144Hz అమోలెడ్ డిస్ప్లే 
లుక్, డిజైన్ పరంగా వివో S60 సిరీస్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్లు ఒకే ముక్క గ్లాస్ తో చెక్కిన వినూత్నమైన కోల్డ్-కార్వ్డ్ గ్లాస్ యూనిబాడీ డిజైన్ తో వస్తాయి. రెండింటిలోనూ 6.59-ఇంచుల సైజు గల 1.5K అమోలెడ్ డిస్ప్లేను అమర్చారు. గేమింగ్, స్క్రోలింగ్ స్మూత్‌గా ఉండటం కోసం ఇందులో 144Hz హై రిఫ్రెష్ రేట్,300Hz టచ్ సాంప్లింగ్ రేట్ సపోర్ట్ ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఫోన్లకు ఏకంగా IP69 రేటింగ్ ఇచ్చారు. అంటే విపరీతమైన దుమ్ము, ధూళి మాత్రమే కాదు.. అత్యంత వేడి నీటి ప్రవాహం తగిలినా లేదా ఫోన్ నీళ్లలో పూర్తిగా మునిగినా సరే దీనికి అస్సలు ఏమీ కాదు.

స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ 
స్పీడ్ మరియు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. వివో S60 మొబైల్ లేటెస్ట్ 4nm స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీనికి తోడు Adreno 735 జీపీయూ, 16జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ జత చేశారు. ఇక వైటాలిటీ ఎడిషన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 ఫుల్ పవర్ చిప్‌సెట్‌ను వాడారు. ఇవి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఒరిజినల్ ఓఎస్ 6 పై పనిచేస్తాయి. సెక్యూరిటీ కోసం సాధారణ ఆప్టికల్ స్కానర్ కాకుండా.. ప్రీమియం ఫోన్లలో మాత్రమే ఉండే అత్యంత వేగవంతమైన 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను డిస్ప్లే లోపల అమర్చారు. దీనివల్ల వేళ్లు తడిగా ఉన్నా సరే ఫోన్ క్షణంలో అన్‌లాక్ అవుతుంది.
 

vivo s60 weibo vivo main

లీకా రేంజ్ లో 100x డిజిటల్ జూమ్ కెమెరా 
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వివో S60 లో అద్భుతమైన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ గల 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు.. ఎంతటి దూరంలో ఉన్న వస్తువునైనా కళ్ల ముందుకు తెచ్చే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అమర్చారు. ఇది ఏకంగా 100x డిజిటల్ జూమ్ సామర్థ్యంతో వస్తుంది. అయితే, వైటాలిటీ ఎడిషన్‌లో ఈ పెరిస్కోప్ కెమెరా ఉండదు. ఇక సెల్ఫీల కోసం ఈ రెండు ఫోన్లలోనూ అత్యంత స్పష్టత గల 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వడం విశేషం. దీని ద్వారా క్రియేటర్లు 4K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.
 

Motorola Edge 70 Pro+ : రిలీజ్ కాకముందే సెన్సేషన్.. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ అఫీషియల్ ఫీచర్లు ఇవే

7,200mAh కొండలాంటి భారీ బ్యాటరీ 
ఈ సిరీస్ లో అందరినీ స్టన్ చేసే అతిపెద్ద హైలైట్ ఫీచర్ దీని బ్యాటరీ కెపాసిటీ. వివో రెండు మోడళ్లలోనూ ఏకంగా 7,200mAh మెగా బ్యాటరీని ప్యాక్ చేసింది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ కేవలం 7.92mm మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. దీనికి తోడు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 90W వైర్డ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు. దీనివల్ల ఇంత పెద్ద బ్యాటరీ కూడా చాలా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎలాంటి హెవీ యూసేజ్ లోనైనా రెండు మూడు రోజుల పాటు బ్యాటరీ టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »