ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తో పాటు వీవో అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక ల్యాండింగ్ పేజీ అందుబాటులోకి వచ్చింది.
Photo Credit: Vivo
Vivo T5 Lite 5G
Vivo : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వీవో భారతీయ వినియోగదారుల కోసం మరో పవర్‌ఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్‌ను పరిచయం చేయడానికి సర్వం సిద్ధం చేసింది. తన పాపులర్ టీ సిరీస్‌ను విస్తరిస్తూ వీవో టీ5 లైట్ 5జీ మోడల్‌ను వచ్చే వారం దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 16న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది గతేడాది మార్కెట్లోకి వచ్చిన సూపర్ హిట్ మోడల్ వీవో టీ4 లైట్ కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వస్తోంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో బ్యాటరీ, ప్రాసెసర్, డిస్‌ప్లే విభాగాల్లో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాండింగ్ పేజ్ లైవ్
ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తో పాటు వీవో అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక ల్యాండింగ్ పేజీ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు అధికారికంగా బయటకు వచ్చాయి. ఈ ఫోన్ లైట్ బ్లూ, బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ వేరియెంట్లలో లభించనుంది. భారతదేశంలో మిడ్-రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో వీవో సేల్స్ గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగాయి. ఈ కొత్త లాంచ్‌తో కంపెనీ తన పట్టును మరింత బలపరుచుకోవాలని చూస్తోంది.
ఛార్జింగ్ కష్టాలకు గుడ్ బై
ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ కెపాసిటీ అనే చెప్పాలి. వీవో టీ5 లైట్ 5జీ మోడల్‌లో ఏకంగా 6,500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. గతేడాది వచ్చిన వీవో టీ4 లైట్ మోడల్‌లో కేవలం 6,000mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్ మాత్రమే ఉండేది. అంటే పాత ఫోన్‌తో పోలిస్తే ఈ కొత్త వేరియంట్‌లో బ్యాటరీ బ్యాకప్ పెరగడమే కాకుండా, ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఫోన్‌ను వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
Tecno : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. జూలై 17న టెక్నో క్యామన్ 50 అల్ట్రా 5జీ గ్రాండ్ ఎంట్రీ
120Hz రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లే
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వీవో టీ5 లైట్ 5జీ మోడల్‌లో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది మల్టీటాస్కింగ్, 5జీ కనెక్టివిటీని చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. డిస్‌ప్లే పరంగా చూస్తే, ఇందులో 120Hz హై రీఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్ ఉన్న స్క్రీన్‌ను అందించారు. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా, ఈ మొబైల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆధారిత కంపెనీ సరికొత్త Origin OS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అంతేకాకుండా, ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కూడా జోడించారు.
50 ఎంపీ కెమెరాతో పాటు సరికొత్త ఏఐ ఫీచర్లు
ఇక పాత మోడల్ అయిన వీవో టీ4 లైట్ 5జీ ఫీచర్లను ఒకసారి గమనిస్తే.. అందులో 6.74 ఇంచుల HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లే (90Hz రీఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్) ఉండేది. అది ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పై నడిచేది. పాత ఫోన్‌లో 8GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా.. మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది. కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు f/2.4 అపెర్చర్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. కొత్తగా రాబోతున్న వీవో టీ5 లైట్ 5జీ మోడల్ కెమెరా క్వాలిటీ, ఏఐ ఫీచర్ల పరంగా పాత ఫోన్ కంటే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతోంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains