రియల్‌మి C100x కి చెందిన 4GB+64GB వేరియంట్ ధర రూ. 14,999 గా నిర్ణయించారు.
Photo Credit: Vivo/Realme/Samsung
Vivo T5e vs Realme C100x vs Samsung Galaxy F70e 5G
Vivo T5e vs Realme C100x vs Samsung Galaxy F70e 5G: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రూ. 15,000 లోపు బడ్జెట్ విభాగంలో తీవ్రమైన పోటీ నడుస్తోంది. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన సరికొత్త ఆఫరింగ్ వివో T5eను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పటికే మార్కెట్‌లో బాగా అమ్ముడవుతున్న రియల్‌మి C100x, శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5Gలతో గట్టి పోటీ ఏర్పడింది. తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్, పవర్‌ఫుల్ బ్యాటరీ కోరుకునే వారికి ఈ మూడు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ధర, వేరియంట్ల పోలిక
ధరల విషయానికొస్తే వివో T5e కి చెందిన 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 13,999 గా ఉంది. రియల్‌మి C100x కి చెందిన 4GB+64GB వేరియంట్ ధర రూ. 14,999 గా నిర్ణయించారు. ఇక శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G మోడల్‌లో 4GB+128GB వేరియంట్ ధర రూ. 13,999 కాగా, 6GB+128GB వేరియంట్ ధర రూ. 14,999 గా ఉంది. ఇక్కడ ఒకే ధరకు శామ్‌సంగ్‌లో ఎక్కువ స్టోరేజ్, 5G కనెక్టివిటీ లభించడం గమనార్హం.
డిస్‌ప్లే, ప్రొసెసర్ పవర్
వివో T5e: 6.74 ఇంచుల HD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో ఆక్టా-కోర్ UNISOC T7225 ప్రొసెసర్ ఇచ్చారు.
రియల్‌మి C100x: 6.8 ఇంచుల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 900 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఇందులో పవర్‌ఫుల్ Unisoc T7250 ప్రొసెసర్‌ను అందించారు.
శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G: 6.7 ఇంచుల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇందులో సూపర్ ఫాస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రొసెసర్ ఇచ్చారు.
Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.47,000 తగ్గింది
బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్
బ్యాటరీ విభాగంలో రియల్‌మి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. రియల్‌మి C100x ఫోన్‌లో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీ ఇచ్చారు, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ రాగా, వివో T5e లో 15W ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని అందించారు. ఎక్కువ రోజూ ఛార్జింగ్ లేకుండా వాడాలనుకునే వారికి రియల్‌మి, శామ్‌సంగ్ బెస్ట్ ఆప్షన్లు.
కెమెరా, ఆపరేటింగ్ సిస్టమ్
కెమెరా వివరాలు: వివో T5e వెనుక 8MP ప్రైమరీ, ముందు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. రియల్‌మి C100x లో వెనుకవైపు 50MP AI కెమెరా, ముందు 5MP కెమెరా ఉన్నాయి. శామ్‌సంగ్ F70e 5G లో వెనుక 50MP ప్రైమరీ + 2MP డెప్త్ కెమెరా డ్యూయల్ సెటప్, ముందు 8MP సెల్ఫీ కెమెరా అమర్చారు.
ఆపరేటింగ్ సిస్టమ్: మూడూ ఆండ్రాయిడ్ 16 ఆధారంగానే పనిచేస్తాయి. వివో లో OriginOS 6, రియల్‌మి లో Realme UI 7.0, శామ్‌సంగ్‌లో One UI 8 సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. 5G సపోర్ట్, మెరుగైన కెమెరా, బ్రాండ్ వాల్యూ కోరుకునే వారికి శామ్‌సంగ్, పెద్ద బ్యాటరీ కావాలనుకునే వారికి రియల్‌మి మంచి ఛాయిస్.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999