శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G (12GB RAM + 256GB స్టోరేజ్) వేరియంట్ రూ. 1,29,999 లాంచ్ ధరతో అందుబాటులోకి వచ్చింది.
Photo Credit: Samsung
Samsung Galaxy S25 Ultra 5G
Samsung Galaxy S25 Ultra 5G : మీరు రూ. 80 వేల నుంచి 90 వేల బడ్జెట్‌లో ఒక పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లు అయితే మీకు శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G బెస్ట్ ఆప్షన్ కావొచ్చు. అదిరిపోయే డిజైన్, మతిపోగొట్టే పర్ఫార్మెన్స్, 200MP కెమెరాతో వచ్చిన ఈ ఫోన్‌పై ఇప్పుడు ఆన్‌లైన్ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. ఏకంగా రూ. 47 వేలకు పైగా లభిస్తున్న ఈ బంపర్ డీల్ వివరాలు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ ధర, బ్యాంక్ ఆఫర్లు
శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G (12GB RAM + 256GB స్టోరేజ్) వేరియంట్ రూ. 1,29,999 లాంచ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తున్న ఆఫర్ల ప్రకారం ఈ ఫోన్ రూ. 86,626 రేటు వద్ద లిస్ట్ అయి ఉంది. దీనికి తోడు మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ రూ. 82,626కి తగ్గుతుంది. అంతేకాదు, మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 58,700 వరకు అదనపు తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.
కళ్ళు చెదిరే డిస్‌ప్లే.. పవర్ ఫుల్ ప్రాసెసర్
ఈ ఫోన్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ పరంగా వేరే లెవెల్ అని చెప్పాలి. ఇందులో 6.9 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 1400x3120 పిక్సెల్స్ రెసొల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. భారీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఇందులో సూపర్ ఫాస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ని ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
Voter List : ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. ఈసీఐ డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
200 మెగాపిక్సెల్ మైండ్ బ్లాకింగ్ కెమెరా
ఫోటోగ్రఫీ లవర్స్ కు ఈ ఫోన్ ఒక కలల డివైజ్. ఇందులో వెనుక వైపు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ప్రధానంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 10 మెగాపిక్సెల్ మరో టెలిఫోటో కెమెరా ఇచ్చారు. ఇక సెల్ఫీలు, స్పష్టమైన వీడియో కాల్స్ కోసం ముందు వైపు 12 మెగాపిక్సెల్ కెమెరా పొందుపరిచారు.
బిగ్ బ్యాటరీ బ్యాకప్.. కనెక్టివిటీ ఫీచర్లు
శామ్‌సంగ్ S25 అల్ట్రాలో 5000mAh కెపాసిటీ గల పర్ఫామెన్స్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వడమే కాకుండా రోజంతా హ్యాపీగా బ్యాకప్ ఇస్తుంది. ఇక ఫోన్ సైజ్ విషయానికి వస్తే 162.8 x 77.6 x 8.2 మిమీ సైజుతో, 218 గ్రాముల బరువు ఉంటుంది. అలాగే వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, UWB, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అధునాతన కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999