Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G : ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ ఆప్షన్?

వివో T5x 5G బేస్ వేరియంట్ (6GB+128GB) ధర రూ. 24,999 కాగా, 8GB+128GB ధర రూ. 27,999, 8GB+256GB ధర రూ. 30,999 గా ఉంది.

Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G : ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ ఆప్షన్?

Photo Credit: Vivo/OnePlus/Poco M8 5G

Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G

ముఖ్యాంశాలు
  • 7200mAh భారీ బ్యాటరీతో రికార్డులు తిరగరాస్తున్న వివో T5x 5G
  • అమోలెడ్ డిస్‌ప్లేతో దడ పుట్టిస్తున్న పోకో M8 5G
  • అదిరిపోయే ఫీచర్లు, ఊహించని ధరలతో కస్టమర్లకు పండగే
ప్రకటన

Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G : వివో కంపెనీ భారత్‌లో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వివో T5x 5Gని లాంచ్ చేయడంతో మిడ్-రేంజ్ విభాగంలో పోటీ మరింత వేడెక్కింది. ఈ నయా ఫోన్ నేరుగా మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్, పోకో M8 5G ఫోన్లకు గట్టి సవాల్ విసురుతోంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు శక్తివంతమైన ప్రాసెసర్లు, మెరుగైన డిస్‌ప్లేలు, భారీ బ్యాటరీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూడింటిలో ఫీచర్లు, ధరల పరంగా ఏ ఫోన్ బెస్ట్ ఆప్షనో వివరంగా తెలుసుకుందాం.

ధరలు, వేరియంట్ల వివరాలు
ధర విషయానికి వస్తే.. వివో T5x 5G,  వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ దాదాపు ఒకే ధరకు లభిస్తున్నాయి. వివో T5x 5G బేస్ వేరియంట్ (6GB+128GB) ధర రూ. 24,999 కాగా, 8GB+128GB ధర రూ. 27,999,  8GB+256GB ధర రూ. 30,999 గా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ (6GB+128GB) ధర రూ. 25,999 కాగా, మిగిలిన 8GB+128GB, 8GB+256GB వేరియంట్ల ధరలు వివో లాగే వరుసగా రూ. 27,999, రూ. 30,999 గా ఉన్నాయి. అయితే పోకో M8 5G వీటన్నింటి కంటే తక్కువ ధరలోనే లభిస్తోంది. దీని 6GB+128GB వేరియంట్ ధర రూ. 20,999, 8GB+128GB ధర రూ. 22,999, 8GB+256GB ధర రూ. 24,999 గా నిర్ణయించారు.

డిస్‌ప్లే, ప్రాసెసర్ సామర్థ్యం
డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ పరంగా పోకో ముందంజలో ఉంది. పోకో M8 5G లో 6.77-ఇంచుల 3D కర్వ్‌డ్ అమోలెడ్  డిస్‌ప్లే ఇచ్చారు, ఇది 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ అమర్చారు. మరోవైపు వివో T5x 5G లో 6.76-ఇంచుల FHD+ LCD డిస్‌ప్లే (120Hz, 1200 నిట్స్) ఉండి, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ లో 6.72-ఇంచుల FHD+ LCD డిస్‌ప్లే (144Hz, 680 నిట్స్), మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఏపెక్స్ ప్రాసెసర్ ఇచ్చారు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే వివో, వన్‌ప్లస్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత సిస్టమ్‌తో వస్తుండగా, పోకో ఆండ్రాయిడ్ 15 (HyperOS 2)తో పనిచేస్తుంది.

Redmi K100 Series : 185Hz డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీ.. త్వరలోనే రెడ్‌మి K100 సిరీస్ రాక

కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీల పోలిక
కెమెరా విభాగంలో మూడింటిలోనూ వెనుకవైపు 50MP ప్రైమరీ + 2MP సెకండరీ కెమెరా సెటప్ అందించారు. కానీ సెల్ఫీల విషయానికి వస్తే వివో T5x 5G ఏకంగా 32MP ఫ్రంట్ కెమెరాతో అగ్రస్థానంలో నిలవగా, పోకో 20MP, వన్‌ప్లస్ 8MP ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉన్నాయి. బ్యాటరీ విభాగంలో వివో ఊహించని రీతిలో ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీని (44W ఛార్జింగ్) అందించింది. వన్‌ప్లస్ 7,000mAh బ్యాటరీ (45W SUPERVOOC) తో రెండో స్థానంలో నిలిచింది. పోకో M8 5G లో 5,520mAh బ్యాటరీ (45W ఛార్జింగ్) మాత్రమే ఉంది. పెద్ద బ్యాటరీ, మంచి సెల్ఫీ కెమెరా కావాలనుకునే వారికి వివో, తక్కువ ధరలో అమోలెడ్ స్క్రీన్ కావాలనుకునే వారికి పోకో సరైన ఎంపిక.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »