భారతదేశంలో ఇటీవలనే కంపెనీ తన పవర్‌ఫుల్ మోడల్స్ అయిన Vivo X300 Ultra, Vivo X300 FE కార్లను మార్కెట్లో విడుదల చేసి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
Vivo X300 FE
Vivo : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వీవో తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను మరింత బలోపేతం చేసే పనిలో పడింది. మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వీవో ఎక్స్300 సిరీస్‌లో భాగంగా కంపెనీ ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో సర్వం సిద్ధం చేసింది. ఈ సిరీస్‌లో రాబోతున్న ఆరో మొబైల్ అయిన వీవో ఎక్స్300ఇ పై ప్రస్తుతం టెక్ ప్రపంచంలో సరికొత్త లీకులు హల్చల్ చేస్తున్నాయి. భారతదేశంలో ఇటీవలనే కంపెనీ తన పవర్‌ఫుల్ మోడల్స్ అయిన Vivo X300 Ultra, Vivo X300 FE కార్లను మార్కెట్లో విడుదల చేసి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
3C సర్టిఫికేషన్ సైట్‌లో వీవో కొత్త ఫోన్ లీక్
ప్రముఖ చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వెయిబోలో ఒక పాపులర్ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు ఈ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని లీక్ చేశారు. చైనా కంపల్సరీ సర్టిఫికేషన్ (3C) వెబ్‌సైట్‌లో వీవో బ్రాండ్‌కు చెందిన ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్ V2612A అనే మోడల్ నెంబర్‌తో లిస్టింగ్ అయింది. ఈ మోడల్ నెంబర్ మరేదో కాదు, త్వరలో రాబోతున్న Vivo X300e ఫోనేనని టెక్ నిపుణులు గట్టిగా చెప్తున్నారు. ఈ సర్టిఫికేషన్ వివరాల ప్రకారం.. ఈ ఫోన్ చైనా మార్కెట్లో అతి త్వరలోనే అధికారికంగా లాంచ్ కాబోతోంది.
7,100 mAh పవర్‌ఫుల్ బ్యాటరీ
ఈ వీవో ఎక్స్300ఇ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. ఇందులో వినియోగదారుల కోసం ఏకంగా 7,015 mAh లేదా 7,100 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చబోతున్నారు. ఇంత పెద్ద బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా ఈ ఫోన్‌తో పాటు 90W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇస్తున్నారు. ఈ ఫోన్ బాక్స్‌లో వచ్చే బండిల్డ్ ఛార్జర్ మోడల్ నెంబర్ V9082L0E1-Cగా ఈ లిస్టింగ్‌లో స్పష్టంగా కనిపించింది. హెవీ యూజర్లకు సైతం ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ దాదాపు రెండు రోజుల పాటు నాన్‌స్టాప్‌గా వస్తుందని కంపెనీ భావిస్తోంది.
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రొసెసర్
ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ యొక్క ఫీచర్లు చాలా వరకు రీసెంట్‌గా వచ్చిన Vivo X300 FE మోడల్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. Vivo X300e లో 6.59 ఇంచుల సైజ్ గల OLED ఫ్లాట్ డిస్‌ప్లేను ఇవ్వబోతున్నారు. ఇది అద్భుతమైన విజువల్స్ కోసం 1.5K స్క్రీన్ రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ప్రీమియం లుక్ కోసం ఈ ఫోన్ చుట్టూ స్ట్రాంగ్ మెటల్ ఫ్రేమ్‌ను అమర్చారు, అలాగే దీని మందం కేవలం 7.9 mm మాత్రమే ఉంటుంది.
5G Network : ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా లేదా? మీ ఏరియాలో 5G నెట్‌వర్క్ కవరేజ్ ఎలా ఉందో ఈజీగా చెక్ చేసుకోండి
జైస్ బ్రాండెడ్ 50MP ట్రిపుల్ కెమెరా
వీవో ఫోన్లు అంటేనే కెమెరాలకు పెట్టింది పేరు. ఈ కొత్త Vivo X300e లో కూడా జర్మన్ లెన్స్ మేకర్ జైస్ బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇస్తున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ ప్రైమరీ కెమెరాతో పాటు, అదిరిపోయే జూమింగ్ షాట్స్ కోసం 50 మెగాపిక్సెల్ సామర్థ్యం గల Sony IMX8 సిరీస్ పెరిస్కోప్ కెమెరాను, అలాగే 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ను అమర్చనున్నారు. అంతేకాకుండా, అద్భుతమైన సెల్ఫీలు, హై-క్వాలిటీ వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో కూడా ఏకంగా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కేటాయించడం విశేషం.
మే నెలలో విడుదలైన Vivo X300 FE ప్రత్యేకతలు ఇవే
భారత మార్కెట్లో గత మే నెలలో విడుదలైన Vivo X300 FE ఫీచర్లను ఒకసారి గుర్తుచేసుకుంటే.. ఈ ఫోన్‌లో 6.31 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రొసెసర్‌ను ఇచ్చారు. ఇందులో 6,500 mAh బ్యాటరీతో పాటు 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ హీట్ అవ్వకుండా ఉండేందుకు వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. కెమెరా పరంగా.. ఆటోఫోకస్ సపోర్ట్ ఉన్న 50MP Sony IMX921 మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP ఆల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరా ఉండగా.. దీని ద్వారా 4K/60 fps వేగంతో అల్ట్రా హెచ్‌డీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాబోయే X300e మోడల్ అంతకంటే పెద్ద డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీతో వస్తుండటంతో మార్కెట్లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch