Xiaomi 17T : ఆండ్రాయిడ్ 16.. హైపర్‌ఓఎస్ 3.. సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో షావోమి 17T

అదిరిపోయే లైకా కెమెరా సెటప్, భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీ, పవర్ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో షావోమి 17T మార్కెట్లోకి అడుగుపెట్టింది.

Xiaomi 17T : ఆండ్రాయిడ్ 16.. హైపర్‌ఓఎస్ 3.. సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో షావోమి 17T

Xiaomi 17T

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి షావోమి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్
  • లాంచ్ ఆఫర్ల కింద రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్
  • వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్‌తో అల్ట్రా డ్యూరబిలిటీ!
ప్రకటన

Xiaomi 17T : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి భారతీయ వినియోగదారుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. షావోమి 17T పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్.. అదిరిపోయే లైకా కెమెరా సెటప్, భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీ, పవర్ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రీమియం లగ్జరీ ఫీచర్లను కోరుకునే స్మార్ట్‌ఫోన్ ప్రియులను టార్గెట్ చేస్తూ షావోమి ఈ నయా మొబైల్‌ను డిజైన్ చేసింది.

భారత్‌లో షావోమి 17T ఫోన్ రెండు రకాల స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చింది. దీని 12GB రామ్ + 256GB వేరియంట్ ధర రూ.59,999 కాగా, 12GB రామ్ + 512GB టాప్ ఎండ్ మోడల్ ధర రూ.64,999 గా కంపెనీ నిర్ణయించింది. లాంచ్ ఆఫర్లలో భాగంగా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లేదా ఫుల్ స్వైప్ ట్రాన్సాక్షన్లపై రూ.5,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఈ ఫోన్ల ఎఫెక్టివ్ ప్రారంభ ధరలు వరుసగా రూ.54,999, రూ.59,999గా మారనున్నాయి. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకునేవారికి రూ.5,000 బోనస్ కూడా లభిస్తుంది (అయితే బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ రెండూ కలిపి వాడుకోలేరు). ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్, షావోమి అధికారిక వెబ్‌సైట్, గుర్తింపు పొందిన రిటైల్ స్టోర్లలో బ్లాక్, బ్లూ, వయొలెట్ కలర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

ఈ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు షావోమి అదిరిపోయే ఉచిత సేవలను అందిస్తోంది. బయ్యర్లకు 3 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో, యూట్యూబ్ ప్రీమియం, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. వీటితో పాటు ఏకంగా 5TB సామర్థ్యం గల గూగుల్ జెమిని ప్రో క్లౌడ్ స్టోరేజ్, 4 నెలల స్పాటిఫై ప్రీమియం మ్యూజిక్ సపోర్ట్ ఉచితంగా పొందవచ్చు. అలాగే ఒక ఏడాది లోపు ఫోన్ వాల్యూపై 60 శాతం వరకు బైబ్యాక్ గ్యారెంటీ ఇచ్చే అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్ కూడా లభిస్తుంది.

షావోమి 17T ఫోన్‌లో 6.59 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఎండలో కూడా అద్భుతంగా కనిపించేలా ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కళ్లకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ఈ ప్యానెల్ TÜV Rheinland ఇంటెలిజెంట్ ఐ కేర్ సర్టిఫికేషన్‌ను పొందింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 8500-ఆల్ట్రా చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ సరికొత్త షావోమి హైపర్‌ఓఎస్ 3 పై రన్ అవుతుంది.

Samsung Galaxy A57 5G : రూ.50 వేల బడ్జెట్‌లో ఆల్‌రౌండర్ ఫోన్.. ప్రీమియం ఫీచర్లతో శామ్‌సంగ్ సరికొత్త స్కెచ్



హెవీ గేమ్స్ ఆడేటప్పుడు లేదా ఎక్కువ సమయం వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు ఫోన్ అస్సలు వేడెక్కకుండా ఉండటం కోసం షావోమి ఇందులో అడ్వాన్స్‌డ్ 3D ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చింది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇందులో గూగుల్ జెమిని ఇన్-బిల్ట్‌గా వస్తుంది. అలాగే స్క్రీన్ పై దేన్నయినా రౌండ్ చుట్టి వెతికేందుకు ఉపయోగపడే గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ఈ ఫోన్‌లో ప్రొఫెషనల్ లైకా ట్రిపుల్ రీర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, సుదూరంగా ఉండే వస్తువులను స్పష్టంగా క్యాప్చర్ చేసేలా 50 మెగాపిక్సెల్ లైకా 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అమర్చారు. వీటికి అదనంగా 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ కెమెరాను ఇచ్చారు.

ఈ ఫోన్‌లోని మరో మేజర్ హైలైట్ దాని బ్యాటరీ. స్లిమ్ డిజైన్‌లోనే ఏకంగా 6,500mAh సామర్థ్యం గల సరికొత్త సిలికాన్-కార్బన్ బ్యాటరీని షావోమి అమర్చింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హెవీగా వాడినా కూడా బ్యాటరీ అయిపోదు. దీనికోసం 67W హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. ఈ ఫోన్‌కు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటం వల్ల నీళ్లలో పడినా పాడవదు. కనెక్టివిటీ కోసం 5G, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, నావిక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »