గతంలో వచ్చిన షావోమి 15T సిరీస్‌కు సక్సెసర్‌గా ఈ సరికొత్త సిరీస్ అడుగుపెట్టింది. ప్రపంచ ప్రసిద్ధ కెమెరా బ్రాండ్ లీకా ట్యూన్ చేసిన ట్రిపుల్ రేర్ కెమెరాలు, అత్యంత పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 వంటి నెక్స్ట్ లెవెల్ ఫీచర్లతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి.
Photo Credit: Xiaomi
The Xiaomi 17T and 17T Pro (pictured) feature identical designs
Xiaomi 17T : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి తన పవర్ ఏంటో నిరూపించింది. టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ ఫ్లాగ్‌షిప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. గురువారం జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ లో షావోమి 17T, షావోమి 17T ప్రో అనే రెండు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి దించింది. గతంలో వచ్చిన షావోమి 15T సిరీస్‌కు సక్సెసర్‌గా ఈ సరికొత్త సిరీస్ అడుగుపెట్టింది. ప్రపంచ ప్రసిద్ధ కెమెరా బ్రాండ్ లీకా ట్యూన్ చేసిన ట్రిపుల్ రేర్ కెమెరాలు, అత్యంత పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 వంటి నెక్స్ట్ లెవెల్ ఫీచర్లతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి.
షావోమి 17T సిరీస్ ఫోన్లను కంపెనీ ప్రీమియం ధరల్లో లాంచ్ చేసింది. బేసిక్ మోడల్ అయిన షావోమి 17T ప్రారంభ ధర 749 యూరోలుగా (భారత కరెన్సీలో సుమారు రూ.83,500) నిర్ణయించారు. ఇది 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. కాగా, దీని 512జీబీ మోడల్ ధర 799 యూరోలు (సుమారు రూ. 89,000)గా ఉంది. ఇది బ్లాక్, బ్లూ, ఓపల్ వైట్, వయాలెట్ రంగుల్లో లభిస్తుంది. ఇక హై-ఎండ్ మోడల్ అయిన షావోమి 17T ప్రో ప్రారంభ ధర 899 యూరోలు (దాదాపు రూ. 1,02,000) గా ఉంది. దీని 512జీబీ వేరియంట్ ధర 999 యూరోలు (సుమారు రూ. 1,11,400), టాప్ ఎండ్ 1టీబీ (1TB) వేరియంట్ ధర ఏకంగా 1,099 యూరోలు (దాదాపు రూ. 1,22,500) గా నిర్ణయించారు. ఈ ప్రో మోడల్ డీప్ బ్లూ, డీప్ వయాలెట్, బ్లాక్ షేడ్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్లు యూకే, ఎంపిక చేసిన యూరప్ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి.
డిస్ప్లే పరంగా ఈ రెండు ఫోన్లు కస్టమర్లకు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. స్టాండర్డ్ షావోమి 17T మొబైల్ 6.59-ఇంచుల సైజు గల 1.5K అమోలెడ్ (AMOLED) స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. దీనివల్ల నడి ఎండలో రోడ్డుపై నిలబడి చూసినా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు, ప్రో మోడల్ అయిన షావోమి 17T ప్రో మరికాస్త పెద్దదైన 6.83-ఇంచుల అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో గేమింగ్ లవర్స్ కోసం ఏకంగా 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను ఇవ్వడం విశేషం.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, షావోమి 17T ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500-అల్ట్రా ప్రాసెసర్‌ను అమర్చారు. దీనితో పాటు షావోమి సొంత సర్జ్ T1 ప్లస్, T1S చిప్స్, ఫోన్ వేడెక్కకుండా చూసేందుకు 3D ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్‌ను జత చేశారు. ఇక ప్రో మోడల్ లో అయితే అత్యంత పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఈ సిరీస్ లోని మరో హైలైట్ ఫీచర్ ఏంటంటే.. ఇందులో ఆస్ట్రో కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది. మొబైల్ సిగ్నల్స్ లేదా ఇంటర్నెట్ అస్సలు లేని అడవులు, కొండ ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీ ద్వారా దాదాపు 1.3 కిలోమీటర్ల దూరం వరకు ఆఫ్‌లైన్‌లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు.
Motorola : జూన్ 4న మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ గ్రాండ్ ఎంట్రీ.. లీకైన మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు!
ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఈ ఫోన్లు ఒక లగ్జరీ కెమెరా లాగా ఉపయోగపడతాయి. రెండింటిలోనూ లీకా బ్రాండెడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (5x ఆప్టికల్ జూమ్), 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు సమానంగా ఉన్నాయి. అయితే మెయిన్ కెమెరా విషయానికొస్తే.. షావోమి 17T లో 50ఎంపీ లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్‌ను వాడగా.. 17T ప్రో మోడల్‌లో అంతకంటే పవర్‌ఫుల్ అయిన 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 950 సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ల ద్వారా 60fps స్పీడ్ తో అద్భుతమైన 4K HDR10 వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
ఈ సిరీస్‌లో అందరినీ అత్యంత ఆశ్చర్యపరిచే అంశం దీని బ్యాటరీ కెపాసిటీ. సాధారణ షావోమి 17T మోడల్‌లో 6,500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చగా.. అదిరిపోయే 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఇక ప్రో మోడల్ లో అయితే ఏకంగా 7,000mAh మెగా బ్యాటరీని అమర్చడం విశేషం. దీనికి తోడు 100W వైర్డ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలను కూడా అందించారు. ఇంత పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా ఫోన్‌ను వాడుకోవచ్చు. ఇవి అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైపర్‌ఓఎస్ 3 పై రన్ అవుతాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Bee Frontier, Bee Eclipse AI Devices Launched: Price, Specifications