Smartphone Comparison : షావోమి 17T వర్సెస్ వీవో X300 FE వర్సెస్ వన్ ప్లస్ 15.. ఫీచర్లు, ధరల పరంగా ఏది బెస్ట్?

ఇటీవల షావోమి సంస్థ తన పవర్‌ఫుల్ మోడల్ షావోమి 17Tని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే ఈ రేంజ్‌లో ఇప్పటికే మార్కెట్లో పాపులర్ అయిన వీవో X300 FE, వన్ ప్లస్ 15 మోడళ్లు గట్టి పోటీని ఇస్తున్నాయి.

Smartphone Comparison : షావోమి 17T వర్సెస్ వీవో X300 FE వర్సెస్ వన్ ప్లస్ 15.. ఫీచర్లు, ధరల పరంగా ఏది బెస్ట్?

Xiaomi 17T, Vivo X300 FE और OnePlus 15 की तुलना एक नजर में

ముఖ్యాంశాలు
  • . వన్ ప్లస్ 7300mAh బ్యాటరీ ముందు మిగతా ఫోన్లు వేస్ట్
  • మార్కెట్లోకి వచ్చిన మూడు మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు
  • షావోమి 17T లాంచ్ ఆఫర్ చూస్తే కస్టమర్లకు పూనకాలే
ప్రకటన

Smartphone Comparison : ప్రస్తుతం భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్‌కు క్రేజ్ బాగా పెరిగింది. రూ.60,000 నుంచి రూ. 70,000 బడ్జెట్ పరిధిలో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఫోన్ కొనాలనుకునే వారి కోసం కంపెనీలు సరికొత్త ఆప్షన్లను తీసుకువస్తున్నాయి. ఇటీవల షావోమి సంస్థ తన పవర్‌ఫుల్ మోడల్  షావోమి 17Tని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే ఈ రేంజ్‌లో ఇప్పటికే మార్కెట్లో పాపులర్ అయిన  వీవో X300 FE, వన్ ప్లస్ 15 మోడళ్లు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఈ మూడు ఫోన్లలో ఏది మీ బడ్జెట్‌కు, మీ అవసరాలకు కరెక్టో ఇప్పుడు క్లియర్‌గా కంపేర్ చేసి చూద్దాం.

ధరలు, ఆఫర్లు
మొదటగా ధరల విషయానికి వస్తే.. షావోమి 17T కస్టమర్లకు కాస్త అందుబాటు ధరలో దొరుకుతుందని చెప్పొచ్చు. దీని 12GB+256GB వేరియంట్ ధర రూ.59,999 కాగా.. 12GB+512GB వేరియంట్ ధర రూ.64,999గా ఉంది. లాంచ్ ఆఫర్ కింద దీనిపై రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మరోవైపు వీవో X300 FE ధరలు 12GB+256GBకి రూ.79,999, 12GB+512GB కి రూ.89,999 గా ఉన్నాయి. ఇక వన్ ప్లస్ 15 బేస్ వేరియంట్ (12GB+256GB) ధర రూ.77,999 కాగా.. టాప్ వేరియంట్ (16GB+512GB) ధర రూ.85,999 గా ఉంది. అయితే ఆన్‌లైన్ సేల్స్ సమయంలో వీవో, వన్ ప్లస్ ఫోన్లు కూడా మంచి డిస్కౌంట్లతో లభిస్తాయి.

స్క్రీన్ క్వాలిటీ, డిస్‌ప్లే ప్రొటెక్షన్
డిస్‌ప్లే విభాగంలో మూడు ఫోన్లు ఒకదానికొకటి గట్టి పోటీ ఇస్తున్నాయి. షావోమి 17T లో 6.59 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. దీనికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంది. వీవో X300 FE లో 6.31 ఇంచుల LTPO AMOLED స్క్రీన్ ఉండగా.. ఇది ఏకంగా 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి షాట్ జెన్సేషన్ రక్షణ ఉంది. ఇక వన్ ప్లస్ 15 లో అందరికంటే పెద్దదైన 6.78 ఇంచుల LTPO AMOLED స్క్రీన్, సూపర్ స్మూత్ 165Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. దీనికి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ లభిస్తుంది.

ప్రాసెసర్ పవర్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్
పర్ఫార్మెన్స్ విషయంలో వన్ ప్లస్, వీవో ఫోన్లు లేటెస్ట్ చిప్‌సెట్లతో ముందంజలో ఉన్నాయి. వన్ ప్లస్ 15 లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండగా.. వీవో X300 FE లో కూడా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్ వాడారు. షావోమి 17T లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ పరంగా షావోమి 17T ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైపర్ఓఎస్ 3 తో వస్తూ 4 ఓఎస్ అప్‌డేట్లు ఇస్తోంది. వీవో ఫోన్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆరిజిన్ఓఎస్ 6 తో నడుస్తూ 5 ఓఎస్ అప్‌డేట్లు ఇస్తామని ప్రామిస్ చేస్తోంది. వన్ ప్లస్ 15 ఫోన్ కలర్ఓఎస్ 16 (ఆండ్రాయిడ్ 15) పై పనిచేస్తూ 4 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్లను సపోర్ట్ చేస్తుంది.

కెమెరా సామర్థ్యాలు ఎలా ఉన్నాయంటే?
ఫోటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం మూడు ఫోన్లలోనూ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను అందించారు. షావోమి 17T లో OIS సపోర్ట్ ఉన్న 50MP మెయిన్ కెమెరా, 50MP 5x పెరిస్కోప్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. వీవో X300 FE లో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్, 50MP పెరిస్కోప్ కెమెరాతో పాటు అద్భుతమైన 50MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇక కెమెరా కింగ్ లాంటి వన్ ప్లస్ 15 లో వెనుక వైపు మూడు కెమెరాలు కూడా (50MP మెయిన్ + 50MP పెరిస్కోప్ + 50MP అల్ట్రా-వైడ్) 50 మెగాపిక్సెల్స్ తోనే రావడం విశేషం. దీని ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ ఉంది.

OnePlus Community Sale 2026: వన్ ప్లస్ లవర్స్‌కు పండగే.. భారీ ఆఫర్లతో కమ్యూనిటీ సేల్ 2026 షురూ


సైజ్, వెయిట్, కనెక్టివిటీ ఫీచర్లు
కనెక్టివిటీ పరంగా మూడింటిలోనూ 5G, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 6.0 (OnePlusలో 5.4) వంటి అన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ సైజ్, బరువు విషయానికి వస్తే వీవో X300 FE కేవలం 191 గ్రాముల బరువు, 7.99mm మందంతో చేతిలో పట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. షావోమి 17T బరువు 200 గ్రాములుగా ఉంటే.. పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీ ఉన్న వన్ ప్లస్ 15 ఫోన్ 211 గ్రాముల బరువుతో కాస్త బరువుగా అనిపిస్తుంది.

బ్యాటరీ.. ఛార్జింగ్ స్పీడ్
బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ విషయంలో వన్ ప్లస్ 15 మిగిలిన రెండు ఫోన్లను పూర్తిగా వెనక్కి నెట్టేసింది. వన్ ప్లస్ 15 లో ఏకంగా 7300mAh భారీ బ్యాటరీ ఉంది. దీనికి తోడు 120W సూపర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అదే సమయంలో షావోమి 17T, వీవో X300 FE ఫోన్లు 6500mAh బ్యాటరీతో వస్తున్నాయి. ఛార్జింగ్ పరంగా వీవోలో 90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండగా.. షావోమి లో కేవలం 67W వైర్డ్ ఛార్జింగ్ మాత్రమే లభిస్తుంది, ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు.

ఏ ఫోన్ కొంటే బెస్ట్?
చివరగా.. మీ బడ్జెట్ కచ్చితంగా రూ.60,000 లోపు ఉండి, మంచి కెమెరా, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఓఎస్ కావాలనుకుంటే షావోమి 17T బెస్ట్ ఛాయిస్. ఒకవేళ మీకు బడ్జెట్ సమస్య కాకపోతే.. అల్ట్రా బ్రైట్ డిస్ ప్లే, బెస్ట్ సెల్ఫీ కెమెరా, లైట్ వెయిట్ డిజైన్ కోసం వీవో X300 FE వైపు వెళ్లొచ్చు. అలా కాకుండా మీకు మార్కెట్లోనే తిరుగులేని అతిపెద్ద బ్యాటరీ లైఫ్, సూపర్ ఫాస్ట్ 120W ఛార్జింగ్, పెద్ద స్క్రీన్, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కావాలనుకుంటే  వన్ ప్లస్ 15 మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »