షియోమి, రెడ్‌మి మోడళ్లపై ఏకంగా రూ.5,000 వరకు ధరలు పెరిగాయి.
Photo Credit: Xiaomi
Xiaomi 17T
Smartphone Price Hike : ప్రముఖ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి భారతీయ కస్టమర్లకు గట్టి షాకిచ్చింది. దేశంలో తన బ్రాండ్‌కు చెందిన పలు ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ఇటీవల పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ ఫోన్ల రేట్లను పెంచిన క్రమంలోనే షియోమి కూడా ఈ బాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ సంజూ చౌదరి ఎక్స్ వేదికగా షేర్ చేసిన సమాచారం ప్రకారం.. షియోమి, రెడ్‌మి మోడళ్లపై ఏకంగా రూ.5,000 వరకు ధరలు పెరిగాయి. కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ కొత్త ధరలు త్వరలోనే అమలులోకి రానున్నాయి.
షియోమి 17టి మోడల్‌పై రూ. 5,000 పెంపు
ఈ ధరల పెంపులో అత్యధికంగా షియోమి 17టి మోడల్‌పై భారం పడింది. ఈ ఫోన్‌లోని రెండు వేరియంట్ల ధరలు రూ.5,000 చొప్పున పెరిగాయి. 12GB+256GB వేరియంట్ లాంచ్ ధర రూ.59,999 ఉండగా, అది ఇప్పుడు రూ.64,999కి చేరింది. అలాగే 12GB+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999 నుంచి ఏకంగా రూ.69,999కి పెరిగింది. అత్యుత్తమ ఫీచర్లతో లభించే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి.
రెడ్‌మి నోట్ 15, రెడ్‌మి 15 సిరీస్‌లపై ధరల భారం
మిడ్ రేంజ్ మోడల్స్ అయిన రెడ్‌మి నోట్ 15, రెడ్‌మి 15 సిరీస్ ఫోన్లు కూడా ప్రియమయ్యాయి. రెడ్‌మి నోట్ 15 (8GB+128GB) వేరియంట్ ధర రూ. 26,999 నుంచి రూ. 28,999 కి, (8GB+256GB) వేరియంట్ రూ.29,999 నుంచి రూ.31,999 కి పెరిగింది. రెడ్‌మి 15 5జీ మోడల్ లోని అన్ని వేరియంట్లపై రూ. 1,000 వరకు ధరలు పెరిగాయి. దీనితో 6GB+128GB వేరియంట్ కొత్త ధర రూ. 21,499, 8GB+128GB ధర రూ. 23,499, 8GB+256GB వేరియంట్ ధర రూ. 25,499 కి చేరాయి.
Vivo V70 FE 5G : రూ.19 వేల భారీ డిస్కౌంట్.. 200MP కెమెరాతో Vivo V70 FE 5G ఇప్పుడు సూపర్ డీల్
బడ్జెట్ ఫోన్లు కూడా ప్రియమయ్యే ఛాన్స్
ఎంట్రీ లెవల్, బడ్జెట్ విభాగంలో ఉండే రెడ్‌మి 15సి 5జీ, రెడ్‌మి 15ఎ ఫోన్లను కూడా వదల్లేదు. రెడ్‌మి 15సి 5జీ మోడల్ ధర రూ.1,500 వరకు పెరిగి నూతన ధరలు రూ. 18,499, రూ.20,499 కి చేరాయి. దీని 8GB+128GB వేరియంట్ రూ. 500 పెరిగి రూ. 21,499కి చేరింది. మరోవైపు బడ్జెట్ ఫోన్ రెడ్‌మి 15ఎ (4GB+64GB) వేరియంట్ ధర రూ. 14,999 నుంచి రూ. 15,999కి, 4GB+128GB వేరియంట్ రూ. 17,499కి, 6GB+128GB వేరియంట్ రూ. 19,499కి పెరుగుతున్నట్లు సమాచారం.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999