Xiaomi Mix Fold 5 : 200MP కెమెరా, 6,000mAh బ్యాటరీతో షియోమి మిక్స్ ఫోల్డ్ 5.. లీకైన అదిరిపోయే ఫీచర్లు

ఈ సర్టిఫికేషన్ ద్వారా ఈ ఫోన్ 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో రాబోతున్నట్లు స్పష్టమైంది.

Xiaomi Mix Fold 5 : 200MP కెమెరా, 6,000mAh బ్యాటరీతో షియోమి మిక్స్ ఫోల్డ్ 5.. లీకైన అదిరిపోయే ఫీచర్లు

Xiaomi Mix Fold 5

ముఖ్యాంశాలు
  • సర్టిఫికేషన్ సైట్‌లో షియోమి కొత్త ఫోల్డబుల్ ఫోన్
  • 67W ఛార్జింగ్‌తో మిక్స్ ఫోల్డ్ 5 ఎంట్రీ
  • శామ్‌సంగ్ ఫోల్డబుల్స్‌కు గట్టి పోటీ ఖాయం
ప్రకటన

Xiaomi Mix Fold 5 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి త్వరలోనే ఆటోమొబైల్, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరదీయనుంది. కంపెనీకి చెందిన ఒక కొత్త డివైజ్ ఇటీవల చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. 2608BPX34C మోడల్ నంబర్‌తో లిస్ట్ అయిన ఈ ఫోన్.. షియోమి రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Xiaomi Mix Fold 5 లేదా Xiaomi 17 Fold కావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సర్టిఫికేషన్ ద్వారా ఈ ఫోన్ 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో రాబోతున్నట్లు స్పష్టమైంది.

మోడల్ నంబర్ వెనుక అసలు రహస్యం
టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. షియోమి కేటాయించిన ఈ మోడల్ నంబర్‌లోని PX అనే అక్షరాలు కంపెనీకి చెందిన ప్రీమియం బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌లకు కేటాయించే ప్రత్యేక కోడ్. దీనిని బట్టి ఇది కచ్చితంగా కంపెనీ నుంచి రాబోతున్న నెక్స్ట్ జెనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోనే అని స్పష్టమవుతోంది. ఈ ఫోన్‌తో పాటు MDY-15-EQ మోడల్ నంబర్ గల పవర్ అడాప్టర్ రానుంది. ఇది కస్టమర్లకు అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ అనుభూతిని అందించనుంది.

 200MP కెమెరా, 6,000mAh బిగ్ బ్యాటరీ 
లీకైన ప్రొటోటైప్ వివరాల ప్రకారం.. ఈ ఫోల్డబుల్ ఫోన్ లోపలి భాగంలో 7.5 ఇంచుల భారీ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. స్క్రీన్ మడతపడే చోట కనిపించే క్రీజ్ అసలు కనిపించకుండా ఉండేలా కొత్త హింజ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇక ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం వెనుక భాగంలో ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించనున్నారు. దీనికి తోడు రోజంతా సులభంగా పనిచేసేలా 6,000 mAh కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని అమర్చనున్నారు. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Nothing : గ్లోబల్ ఎగ్జిట్ వార్తలకు చెక్.. ఫేక్ న్యూస్ అని తేల్చిచెప్పిన నథింగ్ కో-ఫౌండర్

 అడ్వాన్స్‌డ్ ఎక్స్‌రింగ్ ఓ3 చిప్‌సెట్
షియోమి మిక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌లో నెక్స్ట్-జెన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో పాటు కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ Xring O3 కో-ప్రాసెసర్ సర్క్యూట్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఫోన్ వేగం పెరగడమే కాకుండా, మల్టీ టాస్కింగ్, గేమింగ్, కెమెరా ప్రాసెసింగ్ సమర్థవంతంగా మారుతుంది. ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ బ్యాటరీ, విప్లవాత్మక కెమెరాతో రాబోతున్న ఈ ఫోన్.. మార్కెట్లోని శామ్‌సంగ్ ఫ్లిప్ అండ్ ఫోల్డ్ సిరీస్‌లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »