Xiaomi Power Bank 5i 20000 67W Launched in India: ఈ కొత్త షావోమి పవర్ బ్యాంక్ 20,000mAh కెపాసిటీని కలిగి ఉంది. ఇది 67W టర్బో అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుంది.
Photo Credit: Xiaomi
Xiaomi Power Bank 5i 20000 67W Launched in India: ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం షావోమి భారత మార్కెట్లో తన యాక్సెసరీస్ విభాగాన్ని మరింత విస్తరిస్తూ సరికొత్త షావోమి పవర్ బ్యాంక్ 5i 20000 67Wను అధికారికంగా విడుదల చేసింది. భారీ 20,000mAh బ్యాటరీ కెపాసిటీ, 67W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు, భారతదేశంలో దీని ధర, సేల్ వివరాలను వివరంగా చూద్దాం.
బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ స్పీడ్
ఈ కొత్త షావోమి పవర్ బ్యాంక్ 20,000mAh కెపాసిటీని కలిగి ఉంది. ఇది 67W టర్బో అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం స్మార్ట్ఫోన్లే కాకుండా టైప్-సి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లను కూడా చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ వివరాల ప్రకారం.. షావోమి 17 ఆల్ట్రా ఫోన్‌ను కేవలం 32 నిమిషాల్లో 20% నుంచి 80% వరకు, ఐఫోన్ 17 ప్రొ ను 35 నిమిషాల్లో, గెలాక్సీ S26 ఆల్ట్రాను కేవలం 21 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా ఈ పవర్ బ్యాంక్‌కు 65W టూ-వే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో, సరైన ఛార్జర్‌ను ఉపయోగిస్తే ఈ పవర్ బ్యాంక్ కూడా కేవలం 2.5 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.
డిజైన్, కనెక్టివిటీ
ఈ పవర్ బ్యాంక్‌లో కంపెనీ ఇన్-బిల్ట్ USB టైప్-సి కేబుల్‌ను అందించింది. దీని తయారీలో హై-ఫ్లెక్సిబిలిటీ టీపీయూ మెటీరియల్‌ను వాడటం వల్ల, ఈ కేబుల్‌ను పవర్ బ్యాంక్‌ను మోసుకెళ్లే ల్యాన్యార్డ్ లేదా క్యారీ లూప్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా ఇందులో ఇన్-బిల్ట్ టైప్-సి కేబుల్‌తో పాటు అదనంగా ఒక USB టైప్-సి పోర్ట్, మరొక USB టైప్-ఏ పోర్ట్ లభిస్తాయి. అంటే యూజర్లు ఒకేసారి మూడు డివైజ్‌లను ఎలాంటి అంతరాయం లేకుండా ఛార్జ్ చేసుకోవచ్చు.
OPPO Find X10 : ఒప్పో నుంచి సరికొత్త లుక్‌తో ఫైండ్ X10 సిరీస్.. కెమెరా డిజైన్ లీక్
డిజిటల్ డిస్ప్లే, సేఫ్టీ ఫీచర్లు
షావోమి పవర్ బ్యాంక్ 5i లో రియల్-టైమ్ డిజిటల్ డిస్ప్లే ఉంది. ఇది బ్యాటరీ శాతం, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేటస్, లో కరెంట్ మోడ్ వివరాలను చూపిస్తుంది. ఈ లో-కరెంట్ మోడ్ ద్వారా స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లు, బ్లూటూత్ ఈయర్‌బడ్స్ వంటి చిన్న డివైజ్‌లను సురక్షితంగా ఛార్జ్ చేయవచ్చు. భద్రత కోసం కంపెనీ ఇందులో 12-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్‌ను అందించింది. ఇది ఓవర్ ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్, ఓవర్ వోల్టేజ్ సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే ఛార్జింగ్ సమయాల్లో ఉష్ణోగ్రతను పర్యవేక్షించడానికి డ్యూయల్ NTC టెంపరేచర్ సెన్సార్లు ఉన్నాయి. ఇది 74.37Wh రేటింగ్‌తో రావడం వల్ల అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లడానికి పూర్తిగా సురక్షితం.
భారతదేశంలో ధర, లభ్యత
షావోమి పవర్ బ్యాంక్ 5i 20000 67W ధరను భారతదేశంలో రూ.3,299 గా నిర్ణయించారు. ఇది బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని విక్రయాలు జూలై 28 నుంచి mi.com, అమెజాన్ ఇండియా, కంపెనీ అధికారిక రిటైల్ స్టోర్ల ద్వారా ప్రారంభం కానున్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Samsung Galaxy S26 Ultra Users Report Setup Screen Freeze After One UI 9 Update