తక్కువ ధరలో ఎక్కువ స్క్రీన్ సైజ్, పవర్‌ఫుల్ బ్యాటరీ కోరుకునే వారి కోసం దీనిని డిజైన్ చేశారు.
Photo Credit: Redmi 17C
Redmi 17C
Redmi 17C : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మి, బడ్జెట్ కేటగిరీలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త మొబైల్‌ను మార్కెట్లో పరిచయం చేసింది. చైనాలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో రెడ్‌మి 17C స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ గతేడాది సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి వచ్చిన పాపులర్ మోడల్ రెడ్‌మి 15Cకి అప్‌గ్రేడ్ (సక్సెసర్) వెర్షన్‌గా రావడం విశేషం. తక్కువ ధరలో ఎక్కువ స్క్రీన్ సైజ్, పవర్‌ఫుల్ బ్యాటరీ కోరుకునే వారి కోసం దీనిని డిజైన్ చేశారు. ధరల విషయానికి వస్తే.. రెడ్‌మి ఈ ఫోన్‌ను కస్టమర్ల బడ్జెట్‌కు అనుగుణంగానే లాంచ్ చేసింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 4GB రామ్, 64GB స్టోరేజ్ మోడల్ ధర చైనా కరెన్సీలో CNY 799 గా ఉంది, అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.11,200 అవుతుంది. అలాగే అప్పర్ వేరియంట్ అయిన 4GB రామ్, 128GB స్టోరేజ్ మోడల్ ధర CNY 899 (సుమారు రూ.12,600)గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను బ్లూ, రెడ్, బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ ఫోన్‌ను భారత మార్కెట్ సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఎప్పుడు లాంచ్ చేస్తారనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లో ఏకంగా 6.88 ఇంచుల (720 × 1,640 పిక్సెల్స్) భారీ డిస్‌ప్లేను అమర్చారు. ఈ ప్రైస్ రేంజ్ లోనే ఎవరూ ఊహించని విధంగా 120Hz హై రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందించారు, దీనివల్ల ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. అలాగే ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌ను ఇచ్చారు. కంటి రక్షణ కోసం ఈ స్క్రీన్‌కు TÜV Rheinland Low Blue Light, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్లు కూడా లభించడం విశేషం.
Aadhaar : ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీగా ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకునే అవకాశం
ఈ డుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ లో మెరుగైన పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ హెలియో G81 ఆల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులను, సాధారణ గేమింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేయగలదు. ఇక కెమెరా విభాగం విషయానికి వస్తే.. వెనుక భాగంలో ఆకర్షణీయమైన డిజైన్ లోపల 13 మెగాపిక్సెల్ సింగిల్ రేర్ కెమెరాను అమర్చారు. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి వీలుగా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఈ స్మార్ట్‌ఫోన్ లో రోజంతా నిరంతరాయంగా పనిచేసేందుకు వీలుగా 5,160 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు. ఈ బ్యాటరీ వేగంగా చార్జ్ అవ్వడం కోసం 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు. భద్రత కోసం ఫోన్ పక్కభాగంలో పవర్ బటన్‌కే సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ను అమర్చారు. కనెక్టివిటీ ఆప్షన్లలో భాగంగా ఇందులో 4G నెట్‌వర్క్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, బైదూ, సాంగ్స్ వినడానికి 3.5 mm ఆడియో జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ లో యాక్సిలెరోమీటర్, ఈ-కంపాస్, యాంబియంట్ లైట్, ప్రాక్సిమిటీ వంటి అన్ని అవసరమైన సెన్సార్లు ఉన్నాయి. దీని బరువు దాదాపు 206 గ్రాములు ఉంటుంది. బడ్జెట్ రేంజ్ లో ఒక మంచి బ్రాండెడ్ ఫోన్ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999