సాధారణంగా ఆధార్ యాప్ ద్వారా ఈమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవడానికి లేదా కొత్తగా లింక్ చేయడానికి వినియోగదారులు రూ.75ల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
Photo Credit: Aadhaar
Aadhaar
Aadhaar : భారతదేశంలో ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు సేవల వరకు ప్రతిదానికీ ఆధార్ కార్డు ఎంతో అవసరం. ఇందులో ఉన్న సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవడం మన బాధ్యత. ఈ క్రమంలోనే ఆధార్‌ను జారీ చేసే ప్రభుత్వ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. తమ అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు తమ ఈమెయిల్ ఐడీని పూర్తిగా ఉచితంగా అప్‌డేట్ లేదా మార్పులు చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల కార్డుదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది.
ఆరు నెలల పాటు ఫీజు పూర్తిగా మాఫీ
యూఐడీఏఐ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. సాధారణంగా ఆధార్ యాప్ ద్వారా ఈమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవడానికి లేదా కొత్తగా లింక్ చేయడానికి వినియోగదారులు రూ.75ల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ సేవల కోసం వసూలు చేసే రూ.75ల ఛార్జీని తాత్కాలికంగా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఉచిత ఆఫర్ జూలై 1, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు అంటే దాదాపు 6 నెలల పాటు అమలులో ఉంటుంది. ఈ ప్రమోషనల్ పీరియడ్ ముగిసిన తర్వాత యూఐడీఏఐ తన పాలసీని సమీక్షించి, ఈ గడువును పెంచాలా లేదా అనేది నిర్ణయిస్తుంది.
ఈమెయిల్ ఐడీ లింక్ చేయడం వల్ల లాభాలు
చాలా మంది ఆధార్ కార్డుకు కేవలం మొబైల్ నెంబర్ మాత్రమే లింక్ చేస్తుంటారు, ఈమెయిల్ ఐడీని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆధార్‌తో మీ ఈమెయిల్ ఐడీని కూడా అనుసంధానించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీ ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అలర్ట్స్, ఓటీపీలు, భద్రతాపరమైన నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్‌కు అందుతాయి. దీనివల్ల మీ ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ పాత ఈమెయిల్ ఐడీ పనిచేయకపోయినా లేదా కొత్తది మార్చాలనుకున్నా ఈ ఆరు నెలల గోల్డెన్ పీరియడ్‌లో ఉచితంగా మార్చుకోవచ్చు.
Samsung Galaxy S26+ : శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్.. అమెజాన్‌లో గెలాక్సీ S26+ పై భారీ డిస్కౌంట్
యాప్ లో ఫ్రీగా ఈమెయిల్ అప్‌డేట్ చేసుకోండిలా
ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేయడం చాలా సులభం. ఈ ఉచిత ప్రక్రియ జూలై 1 నుంచి లైవ్ లోకి వస్తుంది. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ లోని కొత్త ఆధార్ మొబైల్ యాప్‌ను ఓపెన్ చేసి వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ వెరిఫికేషన్ పేజీలో అడిగిన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. మీ అభ్యర్థనను సబ్మిట్ చేయడానికి ముందు మీ కార్డు నెంబర్, ఆధార్‌తో ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ సహాయంతో కొత్త ఈమెయిల్ ఐడీని సులభంగా వెరిఫై చేసి అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ యాప్‌లో మరిన్ని డిజిటల్ సేవలు
యూఐడీఏఐ ఇటీవల లాంచ్ చేసిన ఈ కొత్త మొబైల్ యాప్ ఎంతో సురక్షితమైనది. వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించబడింది. కేవలం ఈమెయిల్ అప్‌డేట్ మాత్రమే కాకుండా ఈ యాప్ ద్వారా ఎన్నో రకాల ఇతర సేవలను కూడా పొందవచ్చు. ఇందులో మొబైల్ నంబర్ అప్‌డేట్, హోమ్ అడ్రస్ చేంజ్, మీ బయోమెట్రిక్ డేటాను లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. వీటితో పాటు ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని తనిఖీ చేయడం, డిజిటల్ ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, మీ కాంటాక్ట్ కార్డును షేర్ చేయడం, మీరు పెట్టుకున్న రిక్వెస్ట్ ఏ స్టేటస్‌లో ఉందో ట్రాక్ చేయడం వంటి ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి లేట్ చేయకుండా ఈ ఉచిత సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోండి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999