Samsung Galaxy Z Fold 6 5G : శామ్‌సంగ్ ఫోన్‌పై భారీ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో Z ఫోల్డ్ 6 పై ఏకంగా రూ. 19,000 తగ్గింపు

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G మోడల్ 12GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ గతంలో రూ. 1,64,999 కి లాంచ్ అయింది.

Samsung Galaxy Z Fold 6 5G : శామ్‌సంగ్  ఫోన్‌పై భారీ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో Z ఫోల్డ్ 6 పై ఏకంగా రూ. 19,000 తగ్గింపు

Photo Credit: Samsung

Samsung Galaxy Z Fold 6 5G

ముఖ్యాంశాలు
  • శామ్‌సంగ్ లగ్జరీ ఫోల్డబుల్ ఫోన్ రేటును భారీగా తగ్గించేసిన ఫ్లిప్‌కార్ట్
  • Z ఫోల్డ్ 6 5G పై ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 19,000 వరకు తగ్గింపు
  • కొత్త ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్
ప్రకటన

Samsung Galaxy Z Fold 6 5G : టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ఇటీవల మార్కెట్లోకి కొత్తగా శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 5Gని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. అలాంటి వారి కోసం ఒక బెస్ట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. గతేడాది లాంచ్ అయిన ప్రీమియం ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ఇప్పుడు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. లేటెస్ట్ ఫోన్‌తో పోలిస్తే దాదాపు అదే తరహా ప్రీమియం అనుభూతిని ఇచ్చే ఈ ఫోన్‌ను ఇప్పుడు చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ వివరాలు 
ధర తగ్గింపు విషయానికి వస్తే.. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G మోడల్ 12GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ గతంలో రూ. 1,64,999 కి లాంచ్ అయింది. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ. 1,49,999 కి లిస్ట్ అయి ఉంది. అంటే నేరుగానే దీనిపై రూ. 15,000 తగ్గింపు లభిస్తోంది. దీనికి తోడు అదనపు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేస్తే తక్షణమే రూ. 4,000 ఆఫర్ లభిస్తుంది. దీనితో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ఆఫర్ ధర కేవలం రూ. 1,45,999 కి తగ్గుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ డీల్ ద్వారా కొనుగోలుదారులు రూ. 19,000 వరకు నేరుగా ఆదా చేసుకోవచ్చు.

అదిరిపోయే డిస్‌ప్లే, ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ 
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. లోపలి వైపు 7.6 ఇంచుల QXGA+ డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ప్రైమరీ డిస్‌ప్లే (1856x2160 పిక్సెల్స్) అందించారు. బయటి వైపు ఫోన్ మడిచి ఉన్నప్పుడు వాడటానికి 6.3 ఇంచుల HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే (968x2376 పిక్సెల్స్) ఇచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇక గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం క్వాల్కమ్ టాప్-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అమర్చారు.

Lyne Blaster Series  : మైక్ ఉచితం, లైటింగ్ అదుర్స్..రూ. 1,999 లకే లైన్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్పీకర్

కెమెరా క్వాలిటీ, బ్యాటరీ ఫీచర్లు 
ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఇందులో వెనుక వైపు త్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌ ఉన్న 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా,  10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం కవర్ డిస్‌ప్లేపై 10 మెగాపిక్సెల్ కెమెరా, లోపలి స్క్రీన్ కింద 4 మెగాపిక్సెల్ అండర్-డిస్‌ప్లే కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో 4,400mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం IP48 రేటింగ్‌ను కూడా ఇచ్చారు.

కనెక్టివిటీ, సేఫ్టీ ఫీచర్లు 
ఇందులో సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వై-ఫై 6E, బ్లూటూత్ 5.3, NFC సపోర్ట్‌లు ఉన్నాయి. ప్రీమియం లుక్‌తో పాటు గట్టి బిల్డ్ క్వాలిటీ కోరుకునే వారికి, ఫోల్డబుల్ ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదించాలనుకునే వారికి ఈ ఆఫర్ ధరలో గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »