శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా 5G కి చెందిన 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్ సైట్‌లో రూ. 94,999 కి లిస్ట్ అయి ఉంది.
Photo Credit: Samsung
Samsung Galaxy S25 Ultra 5G
Amazon Freedom Day Sale : ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అమెజాన్ ఫ్రీడమ్ డే సేల్ ప్రారంభమైంది. కొత్త స్మార్ట్‌ఫోన్, అందులోనూ ముఖ్యంగా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సేల్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ కంపెనీకి చెందిన మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా 5G పై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటీంచింది.
శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా 5G ధర, ఆఫర్ల వివరాలు
శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా 5G కి చెందిన 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్ సైట్‌లో రూ. 94,999 కి లిస్ట్ అయి ఉంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే... అన్ని ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే నేరుగా రూ. 5,000 ఫ్లాట్ ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ. 89,999 కే చేరుకుంటుంది. గతేడాది జనవరి 2025లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 1,29,999 గా లాంచ్ అయింది. లాంచ్ ధరతో పోలిస్తే ప్రస్తుతం ఈ ఫోన్ దాదాపు రూ. 40,000 తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం.
డిస్‌ప్లే, ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్
ఈ స్మార్ట్‌ఫోన్ అత్యుత్తమ టెక్నాలజీతో కూడిన 6.9-అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1400x3120 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
Redmi 17 5G : 6300mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ 17 5G వచ్చేసింది.. ధర ఎంతంటే?
200MP కెమెరా, బ్యాటరీ, ఇతర ఫీచర్లు
ఫొటోగ్రఫీ, వీడియోల కోసం గెలాక్సీ S25 ఆల్ట్రా వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఉంది. 218 గ్రాముల బరువున్న ఈ డివైజ్‌లో వై-ఫై 7, బ్లూటూత్ 5.4, NFC, UWB, GPS, USB టైప్-సి పోర్ట్ వంటి అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Googlebook Render Leaked Again Ahead of Launch; Reveals Slim Profile