శాంసంగ్ గెలాక్సీ S25+ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 99,999 కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 69,999కి లభిస్తోంది.
Photo Credit: Samsung
Samsung Galaxy S25+ 5G
Flipkart Freedom Sale: మీరు పెద్ద డిస్ప్లే, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెస్ కలిగిన శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ ఛాన్స్. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న ఫ్రీడమ్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S25+ 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. నేరుగా లభిస్తున్న ప్రైస్ కట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లను ఉపయోగించి ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25+ ధర, ఆఫర్ల వివరాలు
శాంసంగ్ గెలాక్సీ S25+ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 99,999 కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 69,999కి లభిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే ఫ్లాట్ రూ. 3,975 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ వర్తించిన తర్వాత దీని ఎఫెక్టివ్ ధర రూ. 66,024కి తగ్గుతుంది. అంతేకాకుండా పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 63,100 వరకు అదనపు ఆదా పొందే అవకాశం ఉంది. అయితే ఎక్స్చేంజ్ బోనస్ అనేది మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
డిస్ప్లే, ప్రాసెసర్ ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ S25+ 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ Dynamic AMOLED 2X డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 1440x3120 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. బ్యాటరీ విభాగంలో 4,900mAh కెపాసిటీ గల బ్యాటరీ అందించబడింది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా రూ. 2,000 బడ్జెట్లోనే బెస్ట్ ఇయర్ బడ్స్
కెమెరా, కనెక్టివిటీ ఆప్షన్లు
కెమెరా సెటప్ గురించి పరిశీలిస్తే.. గెలాక్సీ S25+ వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, OIS సపోర్ట్‌తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు,వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 4G, 5G, వై-ఫై 6E, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే దుమ్ము, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో రావడం విశేషం.
ప్రకటన
ప్రకటన
Amazon Great Freedom Sale 2026: Best Deals on Premium Headphones