ప్రముఖ బ్రాండ్లు అయిన TCL, Samsung, Xiaomi, Motorola, Haier టీవీలపై బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ సేల్‌లో లభించే టాప్ టీవీల వివరాలు, ఆఫర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Freedom Sale 2026: మీరు ఇంటి కోసం 55 ఇంచుల పెద్ద స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తమ ఫ్రీడమ్ సేల్ 2026 సందర్భంగా రూ. 40,000 బడ్జెట్ పరిధిలోని స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. ప్రముఖ బ్రాండ్లు అయిన TCL, Samsung, Xiaomi, Motorola, Haier టీవీలపై బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ సేల్‌లో లభించే టాప్ టీవీల వివరాలు, ఆఫర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1. TCL P6L 55-ఇంచ్ స్మార్ట్ గూగుల్ టీవీ (2026 ఎడిషన్):
TCL కంపెనీకి చెందిన ఈ 55-ఇంచ్ ఆల్ట్రా హెచ్‌డీ (4K) LED గూగుల్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 40,990 కి లిస్ట్ అయింది. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 10,250 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో దీని ఎఫెక్టివ్ ప్రైస్ రూ. 30,740కి తగ్గుతుంది. ఈ టీవీలో MEMC, డాల్బీ విజన్-అట్మాస్, AipQ ప్రాసెసర్ సపోర్ట్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.
2. శామ్‌సంగ్ క్రిస్టల్ 4K విజన్ AI 55-ఇంచ్ స్మార్ట్ టైజెన్ టీవీ (2026):
ప్రముఖ శామ్‌సంగ్ బ్రాండ్‌కు చెందిన ఈ 55-ఇంచ్ క్రిస్టల్ 4K టైజెన్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 42,990 ధరకు అందుబాటులో ఉంది. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డుపై రూ. 7,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందితే, దీనిని కేవలం రూ. 35,990 కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీలో 30 వాట్స్ పవర్‌ఫుల్ స్పీకర్లు, 4K అప్‌స్కేలింగ్, HDR 10+, వాయిస్ అసిస్టెంట్ రిమోట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
3. షియోమి F ప్రొ 55-ఇంచ్ స్మార్ట్ ఫైర్ టీవీ:
షామీ F Pro 55-ఇంచ్ స్మార్ట్ ఫైర్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,999 ధరకు లభిస్తోంది. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ద్వారా రూ. 6,000 తగ్గింపు లభించడంతో, దీని ఎఫెక్టివ్ ధర రూ. 31,999 గా మారుతుంది. ఈ టీవీ డాల్బీ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో కూడిన 34W స్పీకర్లను కలిగి ఉంది. అలాగే ఇందులో 32GB స్టోరేజ్, ఫిల్మ్‌మేకర్ మోడ్, అలెక్సా సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి.
UPI: యూపీఐ వాడితే చార్జీలు పడతాయా? గందరగోళానికి తెరదించిన ఆర్థిక మంత్రి
4. మోటోరోలా 55-ఇంచ్ స్మార్ట్ గూగుల్ టీవీ (2025):
మోటోరోలా కంపెనీకి చెందిన 55-ఇంచ్ QLED ఆల్ట్రా హెచ్‌డీ (4K) స్మార్ట్ టీవీ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో రూ. 35,999 కి లభిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 2,988 తగ్గింపు లభించి, నెట్ ధర రూ. 33,011 కి అందుతుంది. ఇది 120Hz గేమ్ యాక్సిలరేటర్, డాల్బీ అట్మాస్, 5.0 OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
5. హయర్ 55-ఇంచ్ స్మార్ట్ గూగుల్ టీవీ:
హయర్ బ్రాండ్‌కు చెందిన 55-ఇంచ్ ఆల్ట్రా హెచ్‌డీ (4K) LED స్మార్ట్ గూగుల్ టీవీ అమెజాన్ సేల్‌లో రూ. 41,590 ధరకు లిస్ట్ అయ్యింది. దీనిపై ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో రూ. 11,000 భారీ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. తగ్గింపు తర్వాత ఈ టీవీని కేవలం రూ. 30,590 కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో వాయిస్ అసిస్టెంట్ రిమోట్, HDR10, MEMC టెక్నాలజీ, డాల్బీ ఆడియో, ఇన్-బిల్ట్ క్రోమ్‌కాస్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999