ప్రస్తుతం ప్రపంచంలోనే డిజిటల్ చెల్లింపులు వేగంగా జరుపుతున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.
UPI
UPI: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిపే లావాదేవీలపై యూజర్లు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్‌లో చేసిన కొన్ని సవరణల వల్ల యూపీఐ యూజర్లపై చార్జీల భారం పడుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. వ్యక్తుల మధ్య జరిగే పర్సన్-టు-పర్సన్ (P2P) యూపీఐ లావాదేవీలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి చార్జీలు విధించబోమని స్పష్టం చేసింది.
మర్చంట్ డిస్కౌంట్ రేట్ నిబంధనలు
వ్యాపారుల లావాదేవీలపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ గురించి కూడా ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. ఒకవేళ ఎండీఆర్ వర్తింపజేసినా, అది కేవలం ఒక నిర్ణీత పరిమితి దాటిన కొన్ని పరిమిత వ్యాపార లావాదేవీలపై మాత్రమే చాలా స్వల్పంగా ఉంటుంది. ఇది డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లపై ఉండే ఎండీఆర్ రేట్ల కంటే చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ వినియోగదారులు చేసే ఎలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్లకు రూపాయి కూడా చార్జ్ పడదని తేల్చిచెప్పింది.
రికార్డు స్థాయిలో లావాదేవీలు
ప్రస్తుతం ప్రపంచంలోనే డిజిటల్ చెల్లింపులు వేగంగా జరుపుతున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన జులై నెలలోనే దేశంలో యూపీఐ ద్వారా సుమారు రూ. 29.9 లక్షల కోట్ల విలువైన 2,366 కోట్ల లావాదేవీలు జరగడం విశేషం. భారత్ అభివృద్ధి చేసిన ఈ యూపీఐ పేమెంట్ సర్వీస్ ఇప్పటికే పలు విదేశాల్లో కూడా విజయవంతంగా ప్రారంభమై గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందుతోంది.
Motorola G37 Power 5G: మోటోరోలా బంపర్ ఆఫర్.. 7000mAh భారీ బ్యాటరీ ఫోన్‌పై ఏకంగా 47% డిస్కౌంట్
నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్
సౌకర్యవంతమైన డిజిటల్ సేవలను మరింత మందికి చేరువ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త ఆఫ్‌లైన్ పేమెంట్స్ ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఎన్ఎఫ్‌సి (Near Field Communication) టెక్నాలజీ ఆధారంగా స్మార్ట్‌ఫోన్‌ను PoS టెర్మినల్‌పై టాప్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ప్రారంభంలో ఈ ఆఫ్‌లైన్ పేమెంట్స్ పరిమితి ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 2,000 వరకు ఉండే అవకాశం ఉంది. సిగ్నల్స్ లేని మారుమూల ప్రాంతాలు, కొండప్రాంతాలు, ప్రయాణించే విమానాల్లో కూడా ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nikon Z5IIC Full-Frame Mirrorless Camera Launched in India With 4K Video Recording: Price, Specifications