ఈ లైన్ బ్లాస్టర్ జూక్‌బాక్స్ 18 ప్రొ స్పీకర్‌లో 50W పవర్ అవుట్‌పుట్‌ను అందించారు.
Photo Credit: Lyne Originals
Blaster Series Jukebox 18 Pro
Lyne Blaster Series : మ్యూజిక్ లవర్స్ కోసం ప్రముఖ ఆడియో బ్రాండ్ లైన్ ఒరిజినల్స్ భారత మార్కెట్లోకి కొత్త వైర్‌లెస్ స్పీకర్‌ను తీసుకొచ్చింది. తన పాపులర్ బ్లాస్టర్ సిరీస్‌లో భాగంగా Jukebox 18 Pro పేరుతో ఈ పవర్ఫుల్ స్పీకర్‌ను లాంచ్ చేసింది. తక్కువ ధరలోనే మంచి సౌండ్ క్వాలిటీ, అదిరిపోయే లైటింగ్‌తో వచ్చిన ఈ స్పీకర్, యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్నపాటి ఈవెంట్లు, ఫ్రెండ్స్ పార్టీలకు ఇది సరైన ఎంపిక అని కంపెనీ చెప్తోంది.
దిమ్మతిరిగే 50W సౌండ్ అవుట్‌పుట్
ఈ లైన్ బ్లాస్టర్ జూక్‌బాక్స్ 18 ప్రొ స్పీకర్‌లో 50W పవర్ అవుట్‌పుట్‌ను అందించారు. ఇందుకోసం ఇందులో 4 ఇంచుల సైజ్ కలిగిన డ్యూయల్ స్పీకర్ డ్రైవర్లను అమర్చారు. ఇవి పాటలు వింటున్నప్పుడు క్లియర్ వాయిస్‌తో పాటు మంచి బేస్‌ను అందిస్తాయి. అంతేకాకుండా, ఈ స్పీకర్లు మ్యూజిక్ రిథమ్‌కి అనుగుణంగా మారే కలర్‌ఫుల్ RGB లైటింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల చీకట్లో పాటలు వింటుంటే ఇంట్లోనే క్లబ్ లేదా హోమ్ థియేటర్ వైబ్ వస్తుంది.
కనెక్టివిటీ కేక.. మైక్ ఉచితంగా
సాంకేతిక వివరాల్లోకి వెళ్తే.. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 5.4 వెర్షన్‌ను అందించారు. దీనివల్ల ఫోన్‌తో చాలా వేగంగా, ఎలాంటి అంతరాయం లేకుండా కనెక్ట్ అవుతుంది. TWS (ట్రూ వైర్‌లెస్ స్టీరియో) సపోర్ట్ ఉండటం వల్ల, ఒకేసారి రెండు Jukebox 18 Pro స్పీకర్లను జత చేసి ఇంకా పెద్ద సౌండ్ పొందే వెసులుబాటు ఉంది. ప్రత్యేకంగా, దీనితో పాటు టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న వైర్‌లెస్ మైక్రోఫోన్ కూడా లభిస్తుంది. దీన్ని ఉపయోగించి సరదాగా కారోకే పాటలు పాడవచ్చు లేదా ఫంక్షన్లలో ప్రకటనలు చేయడానికి వాడుకోవచ్చు.
WhatsApp : ఇక వెబ్‌లోనూ కాల్స్, ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కి విజిట్.. వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్
మల్టిపుల్ ఆప్షన్స్, మెరుగైన బ్యాటరీ
ఈ స్పీకర్ కేవలం బ్లూటూత్‌కే పరిమితం కాలేదు. వివిధ రకాల ఇన్పుట్ ఆప్షన్లను ఇందులో ఇచ్చారు. USB డ్రైవ్, TF కార్డ్ (మెమరీ కార్డ్), AUX కేబుల్ ద్వారా పాటలు ప్లే చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లేనప్పుడు వినడానికి బ్యూటిఫుల్ FM రేడియో సపోర్ట్ కూడా ఇందులో ఉంది. స్పీకర్ ముందు భాగంలో ఇచ్చిన ఎల్‌ఈడీ డిస్ప్లే చూడానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఛార్జింగ్ కోసం మోడ్రన్ టైప్-సి సపోర్ట్‌ను అందించడం వల్ల త్వరగా ఛార్జ్ అవుతుంది.
ధర ఎంత? ఎక్కడ లభిస్తుంది?
ఫీచర్లు చాలా భారీగా ఉన్నప్పటికీ, భారత్‌లో దీని ధరను చాలా అందుబాటులోనే ఉంచారు. లైన్ బ్లాస్టర్ సిరీస్ జూక్‌బాక్స్ 18 ప్రొ స్పీకర్ ధర మనదేశంలో కేవలం రూ. 1,999 గా నిర్ణయించారు. ఈ స్పీకర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మీ సమీపంలోని ప్రధాన ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్ల నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains