శాంసంగ్ గెలాక్సీ A18 స్మార్ట్‌ఫోన్ డిజైన్ పరంగా పాత మోడల్ తరహాలోనే ఉన్నప్పటికీ కొన్ని ఆకర్షణీయమైన మార్పులు చేశారు. ఈ ఫోన్ కేవలం 7.84 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉండబోతోంది.
Photo Credit: Samsung
Samsung Galaxy A18
Samsung : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన వినియోగదారుల కోసం తక్కువ ధరలోనే సరికొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. శాంసంగ్ గెలాక్సీ A18 పేరుతో రాబోతున్న ఈ సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఈ నెలలో లేదా వచ్చే నెలలోపు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టులో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న గెలాక్సీ A17 5జీ మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ కొత్త ఫోన్ రాబోతోంది. కాగా, ఈ ఫోన్ అధికారికంగా విడుదల కాకముందే దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ రెండర్స్ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ ఆన్‌లీక్స్ ఈ స్మార్ట్‌ఫోన్ సీఏడీ రెండర్లను నెట్టింట పంచుకోవడంతో ఫోన్ డిజైన్ ఎలా ఉండబోతుందో క్లియర్ గా తెలిసిపోయింది.
పిల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్‌తో క్లాసిక్ డిజైన్
లీకైన రెండర్స్, వివరాల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ A18 స్మార్ట్‌ఫోన్ డిజైన్ పరంగా పాత మోడల్ తరహాలోనే ఉన్నప్పటికీ కొన్ని ఆకర్షణీయమైన మార్పులు చేశారు. ఈ ఫోన్ కేవలం 7.84 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉండబోతోంది. దీని మొత్తం కొలతలు 164.4 x 77.8 x 7.84 మిమీగా ఉన్నాయి. డిస్‌ప్లే విషయానికి వస్తే, శాంసంగ్ తన సాంప్రదాయ ఇన్‌ఫినిటీ-యు నాచ్ డిస్‌ప్లే డిజైన్‌తోనే ముందుకు వెళ్తోంది. ఫోన్ వెనుక వైపు క్యాప్సూల్ లేదా పిల్-షేప్ లో ఉండే కెమెరా మాడ్యూల్‌ను ఇచ్చారు. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ మనకు కనిపిస్తుంది. ఎంట్రీ లెవెల్ బడ్జెట్ ఫోన్ కావడంతో డిజైన్‌లో పెద్దగా ప్రయోగాలు చేయనప్పటికీ, స్క్రీన్ చుట్టూ ఉండే బెజెల్స్ పరిమాణాన్ని కంపెనీ కొద్దిగా తగ్గించినట్లు తెలుస్తోంది.
6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
ఈ అప్‌కమింగ్ శాంసంగ్ ఫోన్ ఫీచర్ల పరంగా రోజువారీ అవసరాలకు చాలా అద్భుతంగా సరిపోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోన్లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన 6 నానోమీటర్ ప్రాసెసింగ్‌పై తయారైన స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్‌ను ఉపయోగించబోతున్నట్లు సమాచారం. దీనివల్ల మల్టీటాస్కింగ్, బ్రౌజింగ్ వంటి రోజువారీ పనులు చాలా స్మూత్‌గా సాగుతాయి. అలాగే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే పెద్ద 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ రేంజ్ లో సూపర్ అమోలెడ్ స్క్రీన్ ఇవ్వడం కస్టమర్లకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.
SIR : ఓటర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్ట్ స్పెషల్ రివిజన్ ఫేజ్-3 షెడ్యూల్ విడుదల చేసిన ఈసీఐ
50 మెగాపిక్సెల్ కెమెరా, 5000mAh బ్యాటరీ
ఇక కెమెరాల విషయానికి వస్తే.. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను వెనుక వైపు అమర్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండటం కోసం 5000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇందులో ఇస్తున్నారు. అయితే, ధరల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ఉన్న సెమీకండక్టర్ చిప్‌ల కొరత ప్రభావం ఈ ఫోన్‌పై కూడా పడనుంది. దీనివల్ల పాత మోడల్ గెలాక్సీ A17 తో పోలిస్తే ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ A18 ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Samsung Galaxy SmartTag 3 India Launch Timeline Confirmed by Company Executive
Microsoft Announces $50 Xbox Nano Controller, Launch Set for Next Month