ఈ సర్వే కోసం ఏకంగా 3.94 లక్షల మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లనున్నారు.
Photo Credit: Unsplash/ Element5 Digital
ECI SIR Phase-III
SIR : భారత ఎన్నికల సంఘం (ECI) దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, పక్కాగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఫేజ్-3ని అధికారికంగా ప్రకటించింది. ఈ మూడో విడత క్యాంపెయిన్ కింద దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాను సమగ్రంగా సమీక్షించనున్నారు. ఈ భారీ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్లను సంప్రదించాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, బూత్ స్థాయి అధికారులు ఇంటికి వచ్చినప్పుడు తమ వివరాలను సరిచూసుకుని ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేయాలని దేశ ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు 16 రాష్ట్రాలలో ముమ్మరంగా ఓటర్ల సర్వే
ఈ మూడో విడత ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. వీటితో పాటు ఢిల్లీ, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ సర్వే కోసం ఏకంగా 3.94 లక్షల మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లనున్నారు. వీరితో పాటు పారదర్శకత కోసం రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. ఇప్పటికే ఫేజ్-1, ఫేజ్-2 లలో 13 రాష్ట్రాలలోని 59 కోట్ల మంది ఓటర్ల వెరిఫికేషన్ పూర్తయింది. కాగా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ సర్వే షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు.
ఏమిటీ ఎన్యూమరేషన్ ఫామ్ ?
ఈ స్పెషల్ రివిజన్ డ్రైవ్ అనేది ఎన్యూమరేషన్ దశతో ప్రారంభమవుతుంది. మీ ఇంటికి వచ్చే బీఎల్ఓ అధికారులు మీ పేరుపై ముందే ప్రింట్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్‌ను మీకు అందిస్తారు. ఈ ఫామ్‌లో ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య, ఇంటి చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గం, పార్ట్ నంబర్, మీ ఫోటో వంటి వివరాలు ముందే నమోదై ఉంటాయి. ఓటర్లు ఆ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని.. తమ పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు కుటుంబ సభ్యుల తాజా వివరాలను అందులో రాయాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌లో గుర్తింపు నంబర్ వివరాలను నమోదు చేయడం పూర్తిగా ఆప్షనల్. ఒకవేళ ఓటరు కార్డుపై పాత ఫోటోను మార్చాలనుకుంటే కొత్త పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను జత చేయవచ్చు. ఫామ్ పూర్తి చేసి బీఎల్ఓకి ఇవ్వగానే వారు మనకు ఒక రసీదు ఇస్తారు.
ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్ లో ఓటరు ఫామ్ పూర్తి చేసే విధానం
కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇళ్లలోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీని కోసం ఓటర్లు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ఓటర్ సర్వీస్ పోర్టల్ లేదా ఈసీఐనెట్ యాప్‌ను ఉపయోగించవచ్చు. మొదటగా పోర్టల్ లేదా యాప్‌లో మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ ఓటరు కార్డు (EPIC) నంబర్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. లింక్ అయిన తర్వాత డిజిటల్ ఎన్యూమరేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన తాజా వివరాలు, సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరగా అందుబాటులో ఉన్న ఈ-సైన్ ద్వారా ఫామ్‌ను సబ్మిట్ చేయవచ్చు. అయితే, మీ అధికారిక గుర్తింపు కార్డులోని పేరుకు, ఓటరు రికార్డులలోని పేరుకు తేడాలు ఉంటే మాత్రం ఆన్‌లైన్ కుదరదు, నేరుగా ఆఫ్‌లైన్ లోనే ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది.
పాత రికార్డులలో పేరు చెక్ చేసుకోవడం ఎలా?
ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో ఓటర్లు తమ పాత రికార్డులను, అనగా 2002 నుంచి 2005 మధ్య జరిగిన మునుపటి ఓటర్ల సవరణ రికార్డులతో లింక్ చేయాల్సి రావచ్చు. మీ కుటుంబ సభ్యుల పేర్లు ఆనాటి లిస్టులో ఉంటే, ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లోకి వెళ్లి ఎపిక్ నంబర్ లేదా పేరు ద్వారా పాత రికార్డులను శోధించవచ్చు. జిల్లా, నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ ఆధారంగా కూడా వెతకవచ్చు. ఒకవేళ ఆ సమయంలో మీకు వయసు రాకపోవడం వల్లో లేదా మరేదైనా కారణం చేతనో పేరు లేకపోతే.. మీ తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పాత ఓటరు రికార్డుల ఆధారంగా మీ అర్హతను నిరూపించుకోవచ్చు. పాత రికార్డులు ఏవీ లభించని పక్షంలో, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదలయ్యాక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నుంచి నోటీసు వస్తుంది. అప్పుడు ఈసీఐ సూచించిన 12 రకాల చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డులలో దేనినైనా సమర్పించి ఓటును కాపాడుకోవచ్చు.
Super Earth : ఖగోళ శాస్త్రంలో అద్భుతం.. విశ్వంలో మరో ‘భూమి' గుర్తింపు, అక్కడ జీవం ఉండే ఛాన్స్
కొత్త ఓటు నమోదు, అడ్రస్ మార్పుల కోసం ఈ ఫామ్‌లను వాడండి
ఈ సర్వే సమయంలో ఓటర్ల లిస్టును మరింత పటిష్టంగా మార్చేందుకు అనర్హులైన వారి పేర్లను తొలగిస్తున్నారు. గతంలో ఒడిశాలోనే దాదాపు 20 లక్షల నకిలీ, మరణించిన ఓటర్ల పేర్లను తొలగించారు. ఒకవేళ మీరు 18 ఏళ్లు నిండి మొదటిసారి కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఫామ్-6ను పూరించాల్సి ఉంటుంది. అలాగే, మీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లేదా వేరే నియోజకవర్గానికి ఇల్లు మారినట్లయితే, ఓటరు కార్డులో చిరునామా మార్పుల కోసం ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ రెండు ఫామ్‌లను ఆన్‌లైన్‌లో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా లేదా ఆఫ్‌లైన్‌లో మీ ప్రాంత బూత్ స్థాయి అధికారికి సమర్పించవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999