Samsung Galaxy F70 Pro 5G : 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ఆగస్టు 3న శాంసంగ్ నుంచి ఊరమాస్ 5G ఫోన్

శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది.

Samsung Galaxy F70 Pro 5G : 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ఆగస్టు 3న శాంసంగ్ నుంచి ఊరమాస్ 5G ఫోన్

Photo Credit: Samsung

Samsung Galaxy F70 Pro 5G

ముఖ్యాంశాలు
  • సామ్‌సంగ్ నుంచి ఊరమాస్ 5G ఫోన్
  • 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరాతో రచ్చ రంబోలా
  • భారత మార్కెట్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ F70 ప్రో 5G
ప్రకటన

Samsung Galaxy F70 Pro 5G : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్, భారత మార్కెట్‌లోకి తన కొత్త మోడల్ శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5Gని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 3న భారత్‌లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అద్భుతమైన లుక్స్, పవర్ఫుల్ బ్యాటరీ, క్లారిటీ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ యూజర్లను విశేషంగా ఆకట్టుకోనుంది. ఈ ఫోన్ సేల్స్ కంపెనీ అధికారిక ఈ-స్టోర్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

వివిధ వేరియంట్లు, ధరల వివరాలు 
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. కంపెనీ అందించిన వివరాల ప్రకారం.. ప్రారంభ వేరియంట్ అయిన 6 GB రామ్ + 128 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 25,999 గా నిర్ణయించారు. అలాగే 8 GB రామ్ + 128 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 29,999 గా ఉండగా, టాప్ వేరియంట్ అయిన 8 GB రామ్ + 256 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 34,999 గా ఉంది. గ్రీన్, బ్లాక్ కలర్లతో సహా మొత్తం మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ల్యాంచ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

డిస్‌ప్లే, ప్రాసెసర్ పర్ఫామెన్స్ 
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాట్ ఫుల్ HD+ సూపర్‌ ఆమోలెడ్  డిస్‌ప్లేను అందించారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల స్క్రోలింగ్,  గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. స్క్రీన్ భద్రత కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇక ప్రాసెసింగ్ పరంగా వేగవంతమైన పనితీరు కోసం ఇందులో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను అమర్చారు.

Oppo K13 Turbo Pro 5G: ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో K13 టర్బో ప్రో 5G పై ఊహించని డిస్కౌంట్.. ఏకంగా రూ. 12,000 కంటే ఎక్కువ ఆదా

కెమెరా స్పెక్స్, వీడియో రికార్డింగ్ 
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌ను ఇచ్చారు. వెనుక వైపు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందూ వైపు HDR హెచ్‌డిఆర్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ ద్వారా క్వాలిటీతో కూడిన 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.

దమ్మున్న 6,000 mAh బ్యాటరీ లైఫ్ 
ఈ ఫోన్‌లో అత్యంత ప్రధానమైన ఫీచర్ దీని బ్యాటరీ. ఇందులో భారీ 6,000 mAh బ్యాటరీని అందించారు.. ఇది 45 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 24 గంటలకు పైగా యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్, 8 గంటలకు పైగా గేమింగ్,  12 గంటల పాటు సోషల్ మీడియా స్క్రోలింగ్ చేసుకోవచ్చని శాంసంగ్ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »