Samsung Galaxy Z Fold 8 Launched Globally: ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9 పై పనిచేస్తుంది. ఇందులో క్వాల్కమ్ ప్రసిద్ధ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 చిప్‌సెట్ అమర్చారు.
Photo Credit: Samsung
Samsung Galaxy Z Fold 8
Samsung Galaxy Z Fold 8 Launched Globally: సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ లండన్‌లో నిర్వహించిన గ్రాండ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8ను ఆవిష్కరించింది. వైడ్-ఓపెన్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ చిప్‌సెట్, అడ్వాన్స్‌డ్ కెమెరా ఫీచర్లు, లైట్ వెయిట్ బాడీతో వస్తున్న ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ పూర్తి వివరాలు, ఫీచర్లు, ధరల వివరాలు చూద్దాం.
డ్యూయల్ డిస్‌ప్లే, ఫ్లెక్స్ టైటానియం డిజైన్
శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 స్మార్ట్‌ఫోన్ సరికొత్త వైడ్-ఓపెన్ శైలిలో రూపొందింది. ఇందులో లోపలి వైపు 7.6 అంగుళాల డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లే (1848x2448 పిక్సెల్స్, 4:3 ఆస్పెక్ట్ రేషియో, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్), వెలుపల 5.5 అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లే (1972x1248 పిక్సెల్స్, 10:16 ఆస్పెక్ట్ రేషియో) ఇచ్చారు. ఈ రెండూ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. కవర్ డిస్‌ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ సెరామిక్ 3, బ్యాక్ ప్యానెల్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 వాడారు. అంతేకాకుండా ఫోన్ బరువు కేవలం 201 గ్రాములకు తగ్గించేలా, స్క్రీన్ క్వాలిటీని పెంచేలా ఫ్లెక్స్ టైటానియం టెక్నాలజీని ఉపయోగించారు. ఇది IP48 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది.
ప్రొసెసర్, సాఫ్ట్‌వేర్, క్రియేటర్ ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9 పై పనిచేస్తుంది. ఇందులో క్వాల్కమ్ ప్రసిద్ధ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 చిప్‌సెట్ అమర్చారు. 16GB వరకు RAM, 1TB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్ల కోసం ఇందులో ప్రత్యేకంగా డ్యూయల్ రికార్డింగ్ ఫీచర్ ఇచ్చారు, దీని ద్వారా ఒకేసారి రెండు వైపుల కెమెరాలతో వీడియో తీస్తూ కవర్ డిస్‌ప్లేలో ప్రివ్యూ చూడవచ్చు. అలాగే వీడియోల్లో సబ్జెక్ట్‌ను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేసే మై ఫ్యాన్‌క్యామ్ ఫీచర్ కూడా ఉంది.
కెమెరా సిస్టమ్, బ్యాటరీ
కెమెరా విభాగానికి వస్తే, రియర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు మరొక 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. లోపలి డిస్‌ప్లే కింద 10 మెగాపిక్సెల్ కెమెరా, సెల్ఫీల కోసం కవర్ డిస్‌ప్లేపై మరో 10 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో 4,800mAh బ్యాటరీ అమర్చారు. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ కోసం 5G, వై-ఫై 7, బ్లూటూత్ v6, NFC సదుపాయాలు ఉన్నాయి.
Samsung Galaxy Watch : చేతికి ఈ వాచ్ ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనే లేదు.. శామ్‌సంగ్ నుంచి అల్ట్రా వాచ్ 2 లాంచ్
ధరలు, రంగులు, లాంచ్ ఆఫర్లు
భారత మార్కెట్లో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 వేరియంట్ల వారీ ధరల వివరాలు:
12GB + 256GB: రూ.1,79,999
12GB + 512GB: రూ.1,99,999
16GB + 1TB: రూ.2,39,999
ఈ ఫోన్ గ్రాఫైట్, క్రీమ్, లావెండర్ రంగుల్లో లభిస్తుంది. శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా పిస్తాషియో రంగు లభిస్తుంది. ఆఫర్ల కింద రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 5TB క్లౌడ్ స్టోరేజ్‌తో 6 నెలల ఉచిత Google AI Pro సబ్‌స్క్రిప్షన్, 3 నెలల Samsung Care+ ఉచిత కవరేజ్ పొందే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features