శాంసంగ్ తన అధికారిక కస్టమైజేషన్ సూట్ అయిన గుడ్ లాక్ యాప్‌లోని క్విక్ స్టార్ మాడ్యూల్ ద్వారా ఈ ఇంటర్నెట్ స్పీడ్ ఇండికేటర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Photo Credit: Samsung
The feature is available through the Good Lock app
Samsung : ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఐకూ, వివో, షియోమి వంటి బ్రాండ్లు ఎప్పటి నుంచో తమ ఫోన్లలో ఇంటర్నెట్ స్పీడ్ ఇండికేటర్ ఫీచర్‌ను ఇన్-బిల్ట్‌గా అందిస్తున్నాయి. దీనివల్ల యూజర్లు తమ ఫోన్ స్క్రీన్ పైభాగంలో ఉండే స్టేటస్ బార్‌లోనే రియల్ టైమ్ ఇంటర్నెట్ స్పీడ్‌ను సులభంగా చూసుకోవచ్చు. అయితే, ప్రీమియం బ్రాండ్ అయిన శాంసంగ్ గెలాక్సీ యూజర్లకు మాత్రం ఈ ఫీచర్ అధికారికంగా అందుబాటులో లేదు. ఇన్నాళ్లు ఈ ఫీచర్ కావాలనుకునే వారు ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్స్ వాడటం లేదా ఫోన్‌ను రూటింగ్ చేయడం లాంటి రిస్క్‌లు చేసేవారు. కానీ ఇకపై అలాంటి తిప్పలు పడాల్సిన అవసరం లేదు. శాంసంగ్ తన యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను అఫీషియల్ గా లాంచ్ చేసింది.
శాంసంగ్ తన అధికారిక కస్టమైజేషన్ సూట్ అయిన గుడ్ లాక్ యాప్‌లోని క్విక్ స్టార్ మాడ్యూల్ ద్వారా ఈ ఇంటర్నెట్ స్పీడ్ ఇండికేటర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను నేరుగా ఫోన్ మెయిన్ సెట్టింగ్స్‌లో కాకుండా, ఒక ప్లగిన్ సహాయంతో ఆపరేట్ చేసేలా డిజైన్ చేశారు. ఈ ఫీచర్‌ను ఒక్కసారి ఎనేబుల్ చేసుకుంటే.. స్టేటస్ బార్‌కు కుడివైపున కరెంట్ ఇంటర్నెట్ స్పీడ్ లైవ్‌గా డిస్‌ప్లే అవుతుంది. మీ నెట్‌వర్క్ వేగాన్ని బట్టి ఇది కిలోబైట్స్ (KB/s) లేదా మెగాబైట్స్ (MB/s) లలో అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్‌ను స్పష్టంగా చూపిస్తుంది.
ఈ సరికొత్త నెట్‌వర్క్ స్పీడ్ ఇండికేటర్ మొబైల్ డేటా (5G/4G), వైఫై (Wi-Fi) కనెక్షన్స్ రెండింటి పై సమానంగా పనిచేస్తుందని శాంసంగ్ స్పష్టం చేసింది. యూజర్లు ఏదైనా ఫైల్ డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు స్లోగా ఉన్నా, యూట్యూబ్ లేదా ఓటీటీల్లో వీడియోలు బఫరింగ్ అవుతున్నా.. లేదా యాప్ అప్‌డేట్స్ ఆలస్యమవుతున్నా.. దానికి కారణం నెట్‌వర్క్ స్పీడ్ తక్కువగా ఉండటమేనా అని తెలుసుకోవడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. అయితే, ఈ ఇండికేటర్ కేవలం డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్‌ను మాత్రమే చూపిస్తుంది. మీ ఫోన్‌కు వచ్చే నెట్‌వర్క్ సిగ్నల్ స్ట్రెంత్ ఎంతో తెలుసుకోవడానికి పాత పద్ధతిలోనే నెట్‌వర్క్ బార్స్ లేదా వైఫై ఐకాన్లను చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ అద్భుతమైన ఫీచర్‌ను ఉపయోగించుకోవడానికి శాంసంగ్ కొన్ని నిబంధనలను విధించింది. గెలాక్సీ యూజర్లు లేటెస్ట్ వన్ యూఐ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అయ్యే హ్యాండ్‌సెట్‌ను కలిగి ఉండాలి. ప్రస్తుతం వన్ యూఐ 9 సాఫ్ట్‌వేర్ అనేది శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్25 సిరీస్ మొబైల్స్‌లో బీటా వర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇతర గెలాక్సీ మోడల్స్ అన్నింటికీ ఈ అప్‌డేట్‌ను విస్తరించాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. వీటితో పాటు యూజర్లు తమ ఫోన్లలో క్విక్ స్టార్ మాడ్యూల్ లేటెస్ట్ వర్షన్ 11.0.03.15 లేదా అంతకంటే ఎక్కువ వర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
Lenovo Yoga Earbuds : లెనోవో నుంచి సరికొత్త యోగా ఇయర్‌బడ్స్.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్
ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసా?
మీ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ లో ఈ ఇంటర్నెట్ స్పీడ్ ఇండికేటర్‌ను ఆన్ చేసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
* మొదట మీ ఫోన్‌లోని గెలాక్సీ స్టోర్ ఓపెన్ చేసి గుడ్ లాక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
* యాప్‌ను లాంచ్ చేసిన తర్వాత, కింద ఉండే ప్లగిన్స్ సెక్షన్‌కు వెళ్లండి.
* అక్కడ మీకు కనిపించే క్విక్ స్టార్ మాడ్యూల్ లేటెస్ట్ వర్షన్ (11.0.03.15 లేదా పై వర్షన్)ను డౌన్‌లోడ్ చేసుకోండి.
* ఇప్పుడు గుడ్ లాక్ యాప్ లోపలి నుంచి క్విక్ స్టార్ మోడ్యూల్‌ను ఓపెన్ చేసి, పైన ఉండే మెయిన్ టోగుల్ బటన్‌ను ఆన్ చేయండి.
* ఆ తర్వాత కింద ఉన్న విజిబిలిటీ ఆఫ్ ఇండికేటర్ ఐకాన్స్ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
* అక్కడ మీకు నెట్‌వర్క్ స్పీడ్ అనే సరికొత్త ఆప్షన్ కనిపిస్తుంది, దాని పక్కన ఉన్న టోగుల్‌ను ఎనేబుల్ చేయండి.
ఇంతే.. ప్రైసెస్ పూర్తయిన వెంటనే మీ స్టేటస్ బార్‌లో లైవ్ ఇంటర్నెట్ స్పీడ్ మెరుస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ ఫీచర్ మీకు వద్దు అనుకుంటే, ఇదే పద్ధతిలో మళ్లీ ఆ టోగుల్ బటన్‌ను ఆఫ్ చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999