మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎవరెవరి పేర్లు తొలగించారో తెలుసుకోవడానికి నేషనల్ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ (NVSP)ని ఉపయోగించవచ్చు.
Deleted Voters PDF
Voter List : భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మూడో విడత కింద పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఒడిశా, మణిపూర్, మిజోరం, సిక్కిం, ఉత్తరాఖండ్, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ వంటి ప్రాంతాల ఓటర్ల జాబితా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మీ పేరు ఇంకా ఓటర్ జాబితాలో ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఎన్నికల సంఘం తొలగించిన ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.
తొలగించిన ఓటర్ల జాబితా ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి?
మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎవరెవరి పేర్లు తొలగించారో తెలుసుకోవడానికి నేషనల్ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ (NVSP)ని ఉపయోగించవచ్చు. దీనికోసం ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్ బ్రౌజర్‌లో voters.eci.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో Download Electoral Roll అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుని, మీకు కావలసిన భాషను ఎంచుకోవాలి. ఇప్పుడు మీ ఏరియాలోని పోలింగ్ స్టేషన్ల జాబితా కనిపిస్తుంది. మీ పోలింగ్ కేంద్రం ఎదురుగా ఉన్న Download PDF పై క్లిక్ చేస్తే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. ఈ పిడిఎఫ్ చివరి పేజీల్లో తొలగించిన ఓటర్ల జాబితా ఉంటుంది. అందులో మీ పేరు ఉందో లేదో సులభంగా చెక్ చేసుకోవచ్చు.
సిఈఓ వెబ్‌సైట్ ద్వారా కూడా సమాచారం
మీరు నేరుగా మీ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ వివరాలను పొందవచ్చు. సీఈఓ పోర్టల్‌లోకి వెళ్లి 'Electoral Roll', 'Draft Roll' లేదా 'E-Roll PDF' ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రాన్ని ఎంచుకుని, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ ఫైల్‌లో కూడా తొలగించబడిన ఓటర్ల పేర్లు, వారి ఓటర్ ఐడీ స్పష్టంగా కనిపిస్తాయి.
Google Pixel 11 Series Price Hike : గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు
ఒకవేళ పేరు తొలగించి ఉంటే ఏం చేయాలి?
తొలగించిన జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. పేరును తిరిగి నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పిస్తోంది. దీనికోసం ఇసిఐ పోర్టల్‌లో లాగిన్ అయి ఫారమ్ 6 నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో మీ పుట్టిన తేదీ, ప్రస్తుత చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలను నమోదు చేయాలి. వీటితో పాటు గుర్తింపు, చిరునామా ఆధారాల కోసం మీ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా ఇతర ఆమోదిత పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దీని ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains