శాంసంగ్ గెలాక్సీ S26+ కారు 12GB రామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ భారత మార్కెట్లో రూ.1,19,999 భారీ ధరతో లాంచ్ చేయబడింది.
Photo Credit: Samsung Galaxy S26+
Samsung Galaxy S26+
Samsung Galaxy S26+ : స్మార్ట్ఫోన్ల మార్కెట్లో ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లకు శాంసంగ్ గెలాక్సీ ఎస్-సిరీస్ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుంది. మీరు కూడా ఒక అద్భుతమైన డిస్ప్లే, పవర్ఫుల్ కెమెరా, అదిరిపోయే పర్ఫార్మెన్స్ గల శాంసంగ్ టాప్-ఎండ్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే మీకు సరైన సమయం. ఈ ఏడాది ఫిబ్రవరి 2026 లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S26+ ఫోన్పై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ డీల్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులు చాలా పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S26+ కారు 12GB రామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ భారత మార్కెట్లో రూ.1,19,999 భారీ ధరతో లాంచ్ చేయబడింది. అయితే ప్రస్తుతం అమెజాన్ ఇండియా వెబ్సైట్లో ఈ ఫోన్ను ఏకంగా రూ.84,999 లకే లిస్ట్ చేశారు. దీనికి అదనంగా, మీ దగ్గర అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, దాని ద్వారా పేమెంట్ చేయడం వల్ల మరో రూ. 2,549 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ కూడా కలుపుకుంటే ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.82,450కే చేరుకుంటుంది.
బ్యాంక్ ఆఫర్లతో పాటు పాత ఫోన్లను మార్చుకోవాలనుకునే వారి కోసం అమెజాన్ ఒక భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ను కూడా అందుబాటులో ఉంచింది. మీ పాత లేదా ప్రస్తుతం వాడుతున్న వర్కింగ్ స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.34,600ల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీరు ఇచ్చే పాత మొబైల్ మోడల్, అది ఎంత మంచి కండిషన్లో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. లాంచ్ ధరతో పోల్చి చూస్తే ఈ ఫోన్పై మొత్తం మీద రూ.37,000 కంటే ఎక్కువ అదా అవుతోంది.
శాంసంగ్ గెలాక్సీ S26+ లో 6.7 ఇంచుల భారీ డైనమిక్ అమోలెడ్ 2X డిస్ప్లేను అమర్చారు. ఇది 1440x3120 పిక్సెల్స్ హై-రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీనివల్ల ఫోన్ స్క్రీన్ స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంటుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం ఇందులో సరికొత్త కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ప్రొటెక్షన్ను ఉపయోగించారు, ఇది ఫోన్ కింద పడినా గీతలు పడకుండా గట్టి రక్షణ ఇస్తుంది.
సాఫ్ట్వేర్ పరంగా ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్యూఐ 8.5 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. వేగం, అల్ట్రా పర్ఫార్మెన్స్ కోసం ఇందులో శాంసంగ్ సొంత ఇన్-హౌస్ డెకా-కోర్ ఎక్సినోస్ 2600 పవర్ఫుల్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ఈ ఫోన్ 12GB రామ్తో పాటు 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మల్టీటాస్కింగ్,హెవీ గ్రాఫిక్స్ గేమ్లను ఎలాంటి లాగ్ లేకుండా సులభంగా ఆడుకోవచ్చు.
Meta : మెటా నుంచి సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ లాంచ్.. ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో అదరగొడుతున్న మెటా గ్లాసెస్
కెమెరాల విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ S26+ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ను ఇచ్చారు. ఇందులో f/1.8 అపెర్చర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా ఉంది. దీనితో పాటు 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ గల 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాలను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 అపెర్చర్ గల 12 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరాను అందించారు. నైట్ ఫోటోగ్రఫీలో ఈ కెమెరాలు అద్భుతమైన అవుట్పుట్ ఇస్తాయి.
ఈ స్మార్ట్ఫోన్ లో 4,900mAh సామర్థ్యం గల పవర్ఫుల్ బ్యాటరీని ఇచ్చారు, ఇది రోజంతా చాలా సులభంగా బ్యాకప్ ఇస్తుంది. ఈ బ్యాటరీ వేగంగా చార్జ్ అవ్వడం కోసం 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందించారు. భద్రత కోసం స్క్రీన్పైనే ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ను అమర్చారు. కనెక్టివిటీ ఆప్షన్లలో భాగంగా ఇందులో సూపర్ ఫాస్ట్ 5G, లేటెస్ట్ వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ బరువు కేవలం 190 గ్రాములు, మందం 7.3 మిమీ మాత్రమే ఉండటం వల్ల చేతిలో పట్టుకోవడానికి చాలా ప్రీమియం లుక్ను ఇస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999