మెటా గ్లాసెస్ ప్రారంభ ధరను 299 డాలర్లుగా నిర్ణయించారు, అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.28,000గా ఉంటుంది.
Photo Credit: Meta
Meta
Meta : టెక్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు చేసే మెటా సంస్థ, ఈసారి సామాన్య వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఒక సూపర్ ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. గ్లోబల్ మార్కెట్లో అత్యంత తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు కలిగిన సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేసింది. వీటికి మెటా గ్లాసెస్ అని పేరు పెట్టారు. ప్రపంచ ప్రసిద్ధ ఐవేర్ బ్రాండ్ అయిన ఎస్సిలార్ లక్సోటికా భాగస్వామ్యంతో మెటా ఈ కళ్లద్దాలను అత్యంత స్టైలిష్‌గా, ప్రీమియంగా డిజైన్ చేసింది.
మెటా గ్లాసెస్ ప్రారంభ ధరను 299 డాలర్లుగా నిర్ణయించారు, అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.28,000గా ఉంటుంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా దీనిని మూడు రకాల ఫ్రేమ్ డిజైన్లలో తీసుకొచ్చారు. అందులో మొదటిది స్క్వేర్ ఫ్రేమ్‌తో వచ్చే స్టాండర్డ్ మోడల్ అడ్వెంచరర్. రెండవది కొంచెం లావుపాటి ఫ్రేమ్‌తో వచ్చే ఫ్యూరీ మోడల్. ఇక మూడవది ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీ కైలీ జెన్నర్‌తో కలిసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓవల్ షేప్ మోడల్ స్టార్‌ఫైర్. ఈ స్పెషల్ స్టార్‌ఫైర్ మోడల్ ధర 399 డాలర్లు (సుమారు రూ.37,800)గా ఉంది. ఇవి అనేక ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తాయి. వీటిని మెటా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, బెస్ట్ బై వంటి ప్రముఖ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్ గ్లాసెస్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో ఎలాంటి డిస్‌ప్లే స్క్రీన్ ఉండదు. చూడటానికి సాధారణ కళ్లద్దాల లాగే ఉన్నప్పటికీ, వీటి లోపల ఒక ఇన్-బిల్ట్ కెమెరాను, వినడానికి ఓపెన్ ఇయర్ స్పీకర్లను అమర్చారు. అంటే మీరు పాటలు వినాలన్నా, ఫోన్ కాల్స్ మాట్లాడాలన్నా ఎలాంటి ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి ముఖానికి చక్కగా సరిపోయేలా ఇందులో త్రీ-వే అడ్జస్టబుల్ నోస్‌ప్యాడ్‌లను అందించారు, దీనివల్ల ఈ గ్లాసెస్ పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి.
Xiaomi : 5 లీటర్ల కెపాసిటీ, 2200W పవర్.. షావోమి నుంచి మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ప్రెజర్ కుక్కర్
ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు అవతలి వారికి మన వాయిస్ చాలా స్పష్టంగా వినిపించేలా ఇందులో మల్టీ మైక్ సపోర్ట్‌ను ఇచ్చారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు గాలి వల్ల వచ్చే రొదను తగ్గించడానికి వైండ్ నోయిజ్ రిడక్షన్ టెక్నాలజీని కూడా వాడారు. అంతేకాకుండా ఇందులో వాయిస్ కమాండ్ ఫీచర్ ఉంది. కళ్లద్దాలపై ఉండే ఒక ప్రత్యేకమైన ఫిజికల్ బటన్‌ను నొక్కడం ద్వారా వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేసి, మన వాయిస్ ద్వారానే ఈ గ్లాసెస్‌ను కంట్రోల్ చేయవచ్చు.
ఈ మెటా గ్లాసెస్ మల్టీమోడల్ ఏఐ మోడల్‌తో పనిచేస్తాయి, దీనిని కంపెనీ మ్యూజ్ స్పార్క్ అని పిలుస్తోంది. దీని సహాయంతో ఈ గ్లాసెస్ కేవలం మీడియాను క్యాప్చర్ చేయడమే కాకుండా, విదేశీ భాషలను రియల్ టైమ్‌లో అనువదించగలవు (Translation). ఇందులో తాజాగా హిందీతో పాటు మరో 14 కొత్త భాషలను యాడ్ చేశారు. అలాగే చేతులు ఉపయోగించకుండానే ఫొటోలు తీసుకునేందుకు వీలుగా డైనమిక్ ఫొటో బర్స్ట్ మోడ్ ను ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇవి ఒకే చార్జ్‌పై 8 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. వీటితో పాటు వచ్చే ఫోల్డింగ్ చార్జింగ్ కేస్ సహాయంతో కలుపుకుంటే ఏకంగా 40 గంటల లాంగ్ బ్యాటరీ లైఫ్ లభిస్తుందని మెటా గ్యారెంటీ ఇస్తోంది. టెక్ లవర్స్ కి ఈ గ్లాసెస్ ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999