గెలాక్సీ S27 ప్రో మోడల్‌లో శాంసంగ్ సంస్థ పలు కీలకమైన ఫీచర్లను తగ్గించనుంది.
Photo Credit: Samsung
Samsung Galaxy S27
Samsung : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి రాబోయే మోస్ట్ అవేటెడ్ గెలాక్సీ S27 సిరీస్ లాంచ్‌కు ఇంకా చాలా సమయం ఉంది. అయితే, ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఫోన్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న లవర్స్‌ను నిరాశపరిచే ఒక షాకింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సిరీస్‌లోని హై-ఎండ్ మోడల్‌గా భావిస్తున్న శాంసంగ్ గెలాక్సీ S27 ప్రో వేరియంట్‌లో కంపెనీ ఫీచర్ల పరంగా భారీగా కోత విధించబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ సిరీస్‌లోనైనా ప్రో, అల్ట్రా మోడల్స్ ఫీచర్ల పరంగా దాదాపు ఒకేలా ఉంటాయని, కేవలం సైజ్ మాత్రమే మారుతుందని యూజర్లు భావిస్తారు. కానీ ఈసారి శాంసంగ్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.
స్నాప్‌డ్రాగన్ ప్రొసెసర్ కేవలం అమెరికాకేనా?
దక్షిణ కొరియా నుంచి వచ్చిన తాజా నివేదికల ప్రకారం.. గెలాక్సీ S27 ప్రో మోడల్‌లో శాంసంగ్ సంస్థ పలు కీలకమైన ఫీచర్లను తగ్గించనుంది. ప్రముఖ టెక్ బ్లాగ్ Yeux1122 లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ ప్రో మోడల్‌లో యూజర్లు ఆశించినంత ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండకపోవచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లలో అత్యంత కీలకమైన స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ పవర్‌ఫుల్ చిప్‌సెట్‌ను కేవలం అమెరికా మార్కెట్‌కు మాత్రమే పరిమితం చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. మిగిలిన గ్లోబల్ మార్కెట్లలో శాంసంగ్ తన సొంత ఎక్సినోస్ ప్రొసెసర్‌తో ఈ ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.
గెలాక్సీ S27 అల్ట్రా కాంపాక్ట్ వెర్షన్ అనుకుంటే పొరపాటే
మొదట్లో వచ్చిన అంచనాల ప్రకారం.. గెలాక్సీ S27 ప్రో అనేది గెలాక్సీ S27 అల్ట్రా ఫోన్‌కు ఒక చిన్న కాంపాక్ట్ వెర్షన్ లాగా ఉంటుందని అందరూ భావించారు. అంటే అల్ట్రా మోడల్‌లో ఉండే ప్రీమియం ఫీచర్లన్నీ చిన్న సైజ్ డిస్‌ప్లేతో ప్రో మోడల్‌లో లభిస్తాయని ఆశించారు. కానీ తాజా లీక్స్ ప్రకారం సైజ్ మినహాయిస్తే ఫీచర్లలో ఈ రెండు ఫోన్ల మధ్య చాలా తేడాలు ఉండబోతున్నాయి. ఈ ఫోన్ గెలాక్సీ S27 అల్ట్రాకు చిన్న వెర్షన్ కాకుండా, గతంలో వచ్చిన గెలాక్సీ S25 ఎడ్జ్ మోడల్‌కు సక్సెసర్‌గా ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు. అంటే దీనిని ఒక ప్యూర్ అల్ట్రా రేంజ్ ఫోన్‌గా కాకుండా కాస్త తక్కువ ఫీచర్లతో తీసుకురానున్నారు.
Vivo : ఫోల్డబుల్ మార్కెట్లో వీవో సరికొత్త సంచలనం.. గ్లోబల్ మార్కెట్లోకి వీవో ఎక్స్ ఫోల్డ్ 6 గ్రాండ్ ఎంట్రీ
ఎస్-పెన్ కూడా ఉండదా? కెమెరా క్వాలిటీ తగ్గనుందా?
శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా మోడళ్లలో లభించే అత్యుత్తమ కెమెరా స్పెసిఫికేషన్లను ఇప్పుడు ఈ ప్రో వెర్షన్ నుంచి ఆశించలేమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కంపెనీ దీనిని బేస్ మోడల్ గెలాక్సీ S27, టాప్ మోడల్ గెలాక్సీ S27 అల్ట్రాకు మధ్య ఒక కనెక్టింగ్ లింక్‌గా మార్చాలని ప్లాన్ చేస్తోంది. అందుకే దీని కెమెరా సెటప్ అల్ట్రా అంత పవర్‌ఫుల్‌గా ఉండదు. అంతేకాకుండా, శాంసంగ్ అల్ట్రా ఫోన్ల ప్రత్యేకత అయిన ఎస్ పెన్ సపోర్ట్ కూడా ఈ ప్రో మోడల్‌లో లభించకపోవచ్చు. ఈ ఫోన్ సుమారు 6.47 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఫీచర్లు తగ్గినప్పటికీ మార్కెట్లో కస్టమర్లను ఇది ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే లాంచ్ వరకు వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Control Resonant Has Sold 1 Million Copies, Becoming Remedy's Fastest Selling Game Ever
Vivo Pad FE Reportedly Surfaces on TDRA, TUV Certifications; Charging Specifications Revealed