ఈ కొత్త గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్ 3 డిజైన్ విషయంలో పాత మోడల్ కంటే చాలా వ్యత్యాసం ఉండబోతోంది.
Photo Credit: Samsung
Samsung Galaxy
Samsung Galaxy : ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన నెక్స్ట్ జనరేషన్ ట్రాకింగ్ డివైజ్ గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్ 3ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన కీలక వివరాలు ఆన్‌లైన్ లీక్స్‌లో వెల్లడయ్యాయి. ప్రసిద్ధ టెక్ పోర్టల్ శామ్‌మొబైల్ నివేదిక ప్రకారం, శాంసంగ్ ఒన్ యుఐ కోడ్‌లో ఈ కొత్త స్మార్ట్‌ట్యాగ్ ఐకాన్ కనిపించింది. శాంసంగ్ రాబోయే గెలాక్సీ S26 FE లేదా గెలాక్సీ వాచ్ 9 మోడళ్లతో పాటుగా ఈ స్మార్ట్‌ట్యాగ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
సరికొత్త కాంపాక్ట్ డిజైన్, ఎల్‌ఈడీ రింగ్
ఈ కొత్త గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్ 3 డిజైన్ విషయంలో పాత మోడల్ కంటే చాలా వ్యత్యాసం ఉండబోతోంది. ఇది రౌండ్ స్క్వేర్ డిజైన్‌తో మునుపటి కంటే చాలా చిన్నగా, కాంపాక్ట్‌గా రానుంది. అయితే ఈ కొత్త డిజైన్‌లో ఒక చిన్న మార్పు ఉంది. ఇందులో కీచైన్ తగిలించుకోవడానికి ఎలాంటి ఓపెనింగ్ లేదా హోల్ ఉండదు. కీచైన్‌కు తగిలించాలంటే యూజర్లు ప్రత్యేకంగా ఒక కేస్ కొనాల్సి ఉంటుంది. ఈ ట్రాకర్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏంటంటే.. దీనిపై ఒక గ్రీన్ కలర్ ఎల్‌ఈడీ రింగ్ లభించనుంది. ఈ ఎల్‌ఈడీ లైట్ సహాయంతో స్మార్ట్‌ఫోన్ పెయిరింగ్ ఫీడ్‌బ్యాక్ తెలియడమే కాకుండా, రాత్రి వేళల్లో లేదా చీకటిగా ఉన్న ప్రదేశాలలో వస్తువులను చాలా సులభంగా వెతికి పట్టుకోవచ్చు.
FASTag : ఇక టోల్ గేట్ల దగ్గర ఆగక్కర్లేదు.. ఫాస్ట్‌ట్యాగ్‌లో కొత్త టెక్నాలజీ.. కేంద్రం బిగ్ ప్లాన్
అప్‌గ్రేడెడ్ బ్లూటూత్ 6.0, వాటర్ రెసిస్టెన్స్
సాంకేతిక పరంగా ఈ స్మార్ట్‌ట్యాగ్‌ను శాంసంగ్ భారీగా అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇది లేటెస్ట్ బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ సపోర్ట్‌తో రాబోతోంది. ఇది పాత మోడల్ కంటే వేగవంతమైన, మరింత ఖచ్చితమైన ట్రాకింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీనితో పాటు నీరు, ధూళి నుంచి రక్షణ పొందేందుకు IP67 లేదా IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను అందించే అవకాశం ఉంది.
ఏకంగా 500 రోజుల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్
బ్యాటరీ పరంగా ఈ డివైజ్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్ 3 కనీసం 500 రోజుల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుందని నివేదికలు చెబుతున్నాయి. అంటే ఒక్కసారి బ్యాటరీ సెట్ చేస్తే దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఛార్జింగ్ భయం లేకుండా వాడుకోవచ్చు. కంపెనీ ఇప్పటివరకు ఈ స్మార్ట్‌ట్యాగ్ 3 పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, త్వరలోనే శాంసంగ్ వైపు నుండి ల్యాంచ్ డేట్ మరియు పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999