ఫాస్ట్‌ట్యాగ్ వినియోగం ఈ స్థాయిలో పెరగడానికి గతేడాది ప్రవేశపెట్టిన యాన్యువల్ పాస్ స్కీమ్ ప్రధాన కారణమని ప్రభుత్వం తెలిపింది.
FASTag
FASTag : గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఫాస్ట్‌ట్యాగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. లోక్‌సభలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలో ఆక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల సంఖ్య ఏకంగా 6.23 కోట్లకు చేరుకుంది. ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీతో పనిచేసే ఈ సిస్టమ్ ద్వారా టోల్ ఛార్జీలు ఆటోమేటిక్‌గా కట్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రతి వాహనదారుడి నిత్య జీవితంలో ఇది ఒక కీలక భాగమైపోయింది.
యాన్యువల్ పాస్‌లకు పెరిగిన డిమాండ్
ఫాస్ట్‌ట్యాగ్ వినియోగం ఈ స్థాయిలో పెరగడానికి గతేడాది ప్రవేశపెట్టిన యాన్యువల్ పాస్ స్కీమ్ ప్రధాన కారణమని ప్రభుత్వం తెలిపింది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాల కోసం ఈ ఎన్యువల్ పాస్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 77 లక్షలకు పైగా యాన్యువల్ పాస్‌లు జారీ కాగా, వీటి ద్వారా 63 కోట్ల టోల్ లావాదేవీలు నమోదయ్యాయి. నాన్-కమర్షియల్ వాహనాల కేటగిరీలో జరిగే మొత్తం డిజిటల్ టోల్ లావాదేవీలలో పాస్ హోల్డర్ల వాటానే 33 శాతంగా ఉంది. ఈ యాన్యువల్ పాస్ ధర రూ.3,075 గా ఉంది. తరచూ హైవేలపై ప్రయాణించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారింది.
త్వరలోనే రాబోతున్న బ్యారియర్-ఫ్రీ టోల్లింగ్ సిస్టమ్
హైవేలపై ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తర్వాతి తరం టోల్లింగ్ టెక్నాలజీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిని మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్ అని పిలుస్తారు. ఈ సిస్టమ్ అమల్లోకి వస్తే రహదారులపై ఫిజికల్ టోల్ బూత్‌లు లేదా గేట్లు ఉండవు. వాహనాలు ఎక్కడా ఆగకుండా, తమ సాధారణ స్పీడ్‌లోనే ప్రయాణిస్తూ టోల్ చెల్లించవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ఇంధనం కూడా బాగా ఆదా అవుతుంది.
Google Play Store : గూగుల్ ప్లే స్టోర్ రూల్స్ మారాయి.. ఇకపై ఏ యాప్ వాడాలన్నా ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి
ఏఐ టెక్నాలజీతో ఆటోమేటిక్ టోల్ కలెక్షన్
ఈ MLFF సిస్టమ్‌లో ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. వాహనం గేటు దాటుతున్నప్పుడు కెమెరాలు నంబర్ ప్లేట్‌ను గుర్తించి, ఖాతా నుంచి టోల్ ఛార్జీని కట్ చేస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17 టోల్ ప్లాజాలలో ఈ సిస్టమ్ ఏర్పాటుకు అనుమతులు లభించగా, ఇప్పటికే 5 ప్లాజాలలో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు. కాగా, ప్రస్తుత నిబంధనల ప్రకారం రెండు టోల్ ప్లాజాల మధ్య 60 కిలోమీటర్ల దూరం ఉండాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇందులో మార్పులు ఉండవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Samsung Gallery May Get Google Cloud Backup After OneDrive Sync Ends