Samsung Galaxy Watch Ultra 2 Launched Globally: శామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 ఆకర్షణీయమై స్క్విసర్కిల్ షేప్ డయిల్ డిజైన్‌తో వస్తోంది.
Samsung Galaxy Watch
Samsung Galaxy Watch Ultra 2 launched Globally: సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శామ్సంగ్ లండన్‌లో నిర్వహించిన గ్రాండ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. అత్యంత శక్తివంతమైన ప్రీమియం ఫీచర్లతో శామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే ఈవెంట్లో కంపెనీ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు, గెలాక్సీ వాచ్ 9, గెలాక్సీ గ్లాసెస్‌ను కూడా విడుదల చేసింది. అడ్వాన్స్డ్ హెల్త్ ట్రాకింగ్, స్క్విసర్కిల్ డయిల్ డిజైన్‌తో వస్తున్న ఈ కొత్త స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు చూద్దాం.
డిజైన్, డిస్ప్లే ప్రత్యేకతలు
శామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 ఆకర్షణీయమై స్క్విసర్కిల్ షేప్ డయిల్ డిజైన్‌తో వస్తోంది. ఇది టైటానియం గ్రే, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మెరైన్ బ్యాండ్, పీక్ఫార్మ్ బ్యాండ్, ట్రైల్ బ్యాండ్, స్పోర్ట్స్ బ్యాండ్, మిస్టీ బ్యాండ్, ఫ్యాబ్రిక్ బ్యాండ్ వంటి రకరకాల స్ట్రాప్ ఆప్షన్లతో దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో 1.52 అంగుళాల (498 x 498 పీక్ రిజల్యూషన్) సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. స్క్రీన్ రక్షణ కోసం బలమైన సఫైర్ క్రిస్టల్ గ్లాస్ ఉంచుకోగా, ఇది ఏకంగా 5,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్, స్టోరేజ్, సాఫ్ట్వేర్
ఈ స్మార్ట్‌వాచ్ గూగుల్ వేర్ ఓఎస్ 7 ఆధారిత వన్ యూఐ 9 పై పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే తర్వాతి వెర్షన్ స్మార్ట్ఫోన్లతో సులభంగా కనెక్ట్ అవుతుంది. పెర్ఫార్మెన్స్ పరంగా ఇందులో అత్యంత వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ వేర్ ఎలీట్ చిప్సెట్ అమర్చారు. యూజర్ల సౌలభ్యం కోసం ఇందులో 2GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందించడం విశేషం.
Garmin Cirqa Smart Band : స్క్రీన్ లేని గార్మిన్ సిర్కా స్మార్ట్ బ్యాండ్ లాంచ్.. డిస్ప్లే లేకపోవడమే దీని ప్రత్యేకం
అడ్వాన్స్డ్ హెల్త్, ఫిట్నెస్ ట్రాకింగ్
ఆరోగ్య పరిరక్షణ కోసం ఇందులో అత్యాధునిక బయోయాక్టివ్ సెన్సార్ ఇచ్చారు. ఇది నిరంతరం హృదయ స్పందన రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు (SpO2), బాడీ కంపోజిషన్ వంటి బయోమెట్రిక్ డేటాను కచ్చితంగా ట్రాక్ చేస్తుంది. ప్రత్యేకంగా ఇందులో స్లీప్ అప్నియా ఫీచర్ ఉంది, ఇది నిద్రపోయే సమయంలో శ్వాసలో ఏవైనా ఆటంకాలు ఉంటే గుర్తిస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ వంటి రకరకాల సెన్సార్లు ఉన్నాయి. చుట్టూ ఉన్న శబ్దం ఎక్కువైతే ఇది ప్రత్యేక అలర్ట్‌లను కూడా ఇస్తుంది.
బ్యాటరీ, ధర వివరాలు
ఈ స్మార్ట్‌వాచ్‌లో 800 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది WPC-ఆధారిత వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం LTE, బ్లూటూత్, వై-ఫై, NFC, GPS సదుపాయాలు ఉన్నాయి. దీని డైమెన్షన్స్ 47.4 x 47.1 x 10.7 మిమీ ఉండగా, బరువు సుమారు 61.5 గ్రాములుగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఈ 47 mm బ్లూటూత్ + LTE వెర్షన్ ధరను 699.99 డాలర్లుగా (భారత కరెన్సీలో దాదాపు రూ. 67,600) నిర్ణయించారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
DoT’s SIM Binding Rules Set to Take Effect Beginning January 1 to Curb Cyber Fraud: Here’s What Changes