Garmin launched CIRQA Screenless Health and Fitness Smart Band: గార్మిన్ సిర్కా స్మార్ట్ బ్యాండ్ ప్రారంభ ధరను అమెరికా మార్కెట్లో 199.99 డాలర్లుగా (భారత కరెన్సీలో దాదాపు రూ.19,000) నిర్ణయించారు.
Photo Credit: Garmin
Garmin Cirqa Smart Band
Garmin launched CIRQA Screenless health and fitness Smart Band: ప్రముఖ స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ గార్మిన్ గ్లోబల్ మార్కెట్లో ఒక వినూత్నమైన డివైజ్‌ను ఆవిష్కరించింది. గార్మిన్ సిర్కా పేరుతో సరికొత్త స్మార్ట్ బ్యాండ్‌ను లాంచ్ చేసింది. సాధారణంగా మార్కెట్లో లభించే స్మార్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్‌లకు భిన్నంగా ఇది ఎటువంటి డిస్‌ప్లే (స్క్రీన్) లేకుండా రావడం విశేషం. నోటిఫికేషన్లు, డిస్‌ప్లే వెలుగుల వల్ల దృష్టి మరల్చకుండా, యూజర్లు తమ ఫిట్‌నెస్, ఆరోగ్య లక్ష్యాలపైనే పూర్తి ఏకాగ్రత పెట్టాలనే ఉద్దేశంతో గార్మిన్ ఈ స్క్రీన్‌లెస్ డిజైన్‌ను రూపొందించింది. ఈ స్మార్ట్ బ్యాండ్ ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.
ధర, లభ్యత, కలర్స్
గార్మిన్ సిర్కా స్మార్ట్ బ్యాండ్ ప్రారంభ ధరను అమెరికా మార్కెట్లో 199.99 డాలర్లుగా (భారత కరెన్సీలో దాదాపు రూ.19,000) నిర్ణయించారు. జూలై 24 నుంచి గార్మిన్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో ఇది విక్రయానికి రానుంది. ప్రీమియం ఫ్యాబ్రిక్ స్ట్రాప్‌తో వస్తున్న ఈ డివైజ్ కాప్టెన్ బ్లూ, బ్లాక్, డార్క్ ఆలివ్, ఫ్రెంచ్ గ్రే, ఫ్రెంచ్ బ్లూ, సిట్రాన్ గ్రే, మావ్ వంటి ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. కస్టమర్ల చేతి పరిమాణానికి తగ్గట్లుగా ఇది S-M, L-XL సైజులలో అందుబాటులో ఉండనుంది.
Samsung Galaxy Z Fold 8 Ultra : ఫోన్ తెరిస్తే ట్యాబ్.. మడిచితే ఫోన్.. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో శామ్‌సంగ్ విధ్వంసం
హెల్త్, ఫిట్‌నెస్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
గార్మిన్ సిర్కాలో అధునాతన హెల్త్ ట్రాకింగ్ సెన్సార్లు ఉన్నాయి. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని కొలిచే SpO2 సెన్సార్, హృదయ స్పందనల పర్యవేక్షణ, అసాధారణ హార్ట్ రేట్ అలర్ట్‌లు, శ్వాసకోశ రేటు, మానసిక ఒత్తిడి, బాడీ బ్యాటరీ ఎనర్జీ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మహిళల ఆరోగ్య ట్రాకింగ్, ఫిట్‌నెస్ ఏజ్ లెక్కింపులతో పాటు గార్మిన్ కనెక్ట్ యాప్ ద్వారా లైవ్‌ట్రాక్ లోకేషన్ షేరింగ్‌కు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.
80కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, బ్యాటరీ లైఫ్
ఫిట్‌నెస్ ప్రియుల కోసం ఈ బ్యాండ్‌లో రన్నింగ్, వాకింగ్, యోగా మొదలైన 80 కంటే ఎక్కువ వర్కౌట్ మోడ్‌లు ఇచ్చారు. యూజర్లు కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా ముందే సెట్ చేసిన యాక్టివిటీలను ఎంచుకోవచ్చు. ట్రైనింగ్ రెడీనెస్, HRV స్టాటస్, VO2 Max, ట్రైనింగ్ స్టాటస్ వంటి స్పోర్ట్స్ సైన్స్ మెట్రిక్స్ ఇందులో ఉన్నాయి. ఈ బ్యాండ్‌ను మణికట్టుకే కాకుండా ఆర్మ్‌బ్యాండ్‌గా (భుజం దగ్గర) కూడా ధరించవచ్చు. ఇది ఆటోమేటిక్‌గా శరీర కదలికలను గుర్తించి గార్మిన్ కనెక్ట్ యాప్‌లో రికార్డ్ చేస్తుంది. నిరంతర హెల్త్ ట్రాకింగ్ రన్ అవుతున్నప్పటికీ, ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 10 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains