Discount on Samsung Galaxy Z Flip 5: అమెజాన్ వెబ్‌సైట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్ 8GB రామ్ + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ కేవలం రూ.59,999లకే లిస్ట్ చేయబడింది
Photo Credit: Samsung
Samsung Galaxy Z Flip 5 5G
Discount on Samsung Galaxy Z flip 5: మీరు మంచి బ్రాండెడ్ ప్రీమియం లుక్ ఉన్న ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని విధంగా భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. జూలై 2023లో ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని అసలు ధర ఏకంగా రూ.99,999 రూపాయలుగా ఉండేది. కానీ ప్రస్తుతం అమెజాన్ కస్టమర్లకు నేరుగా ధర తగ్గింపుతో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తూ సరికొత్త ప్రైస్ కట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ధరల వివరాల్లోకి వెళ్తే.. అమెజాన్ వెబ్‌సైట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్ 8GB రామ్ + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ కేవలం రూ.59,999లకే లిస్ట్ చేయబడింది. అంటే నేరుగా రూ.40,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనికి తోడు కస్టమర్లు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేస్తే.. అదనంగా రూ.1,799ల వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్ కూడా వర్తింపజేస్తే.. ఈ ప్రీమియం ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.58,200లకే తగ్గుతుంది.
బ్యాంక్ ఆఫర్లతో పాటు అమెజాన్ ఈ ఫ్లిప్ ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.39,000ల వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది మీరు ఇచ్చే పాత మొబైల్ మోడల్, అది ఎంత వర్కింగ్ కండిషన్‌లో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పాత ఫోన్‌కు మంచి ఎక్స్ఛేంజ్ వాల్యూ వస్తే.. ఈ లగ్జరీ ఫ్లిప్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.
ఫీచర్ల విషయానికి వస్తే.. శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్ లో డ్యూయల్ డిస్‌ప్లే సెటప్ ఉంటుంది. ఇందులో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ఇన్నర్ మెయిన్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక ఫోన్ మడతబెట్టినప్పుడు పైన కనిపించేలా.. 3.4 ఇంచుల Super AMOLED ఫోల్డర్ షేప్ కవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని సహాయంతో ఫోన్ విప్పకుండానే నోటిఫికేషన్లు చూడటం, సెల్ఫీలు తీయడం వంటి పనులు ఈజీగా చేయవచ్చు.
ఈ ఫ్లిప్ ఫోన్ కింగ్ సైజ్ పర్ఫార్మెన్స్ అందించడానికి ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత వన్ యూఐ సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. ఇక కెమెరా విభాగం విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 12 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు, మరో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం కవర్ స్క్రీన్ పై భాగంలో 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
Samsung : ఫోల్డబుల్ మొబైల్స్ లో శామ్‌సంగ్ సరికొత్త విప్లవం.. స్క్రీన్‌పై క్రీజ్ సమస్యకు శాశ్వతంగా చెక్
ఈ ఫోన్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్8 రేటింగ్‌తో వస్తుంది.. అంటే ప్రమాదవశాత్తు నీటిలో పడినా ఈ ఫోన్‌కు ఏమీ కాదు. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ లో సూపర్ ఫాస్ట్ 5G, 4G LTE, వై-ఫై 6e, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అన్ని రకాల ఆధునిక ఫీచర్లను అందించారు. రూ.60 వేల బడ్జెట్‌లో ఆపిల్ ఐఫోన్ లేదా ఇతర నార్మల్ ఫోన్లు కొనే బదులు.. సరికొత్త ట్రెండ్‌గా నిలిచే ఈ శామ్‌సంగ్ ఫ్లిప్ ఫోన్ కొనడం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్ అవుతుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 స్పెసిఫికేషన్ల పూర్తి జాబితా..
* మెయిన్ డిస్‌ప్లే: 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ స్క్రీన్ (120Hz రిఫ్రెష్ రేట్)
* కవర్ డిస్‌ప్లే: 3.4 ఇంచుల సూపర్ అమోలెడ్ ఫోల్డర్ షేప్ స్క్రీన్ (60Hz రిఫ్రెష్ రేట్)
* ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2
* ర్యామ్ & స్టోరేజ్: 8GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్
* వెనుక కెమెరా: 12MP (వైడ్, OIS సపోర్ట్) + 12MP (అల్ట్రా-వైడ్) డ్యూయల్ కెమెరా సెటప్
* ఫ్రంట్ కెమెరా: 10 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్
* సాఫ్ట్‌వేర్: వన్ యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ ఓఎస్
* కనెక్టివిటీ: 5G, 4G LTE, వై-ఫై 6e, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సీ, టైప్-సి పోర్ట్
* ప్రొటెక్షన్ రేటింగ్: ఐపీఎక్స్8 వాటర్ రెసిస్టెన్స్ బాడీ
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo ColorOS 17 India Launch Set for October 13; Enco X4 Earbuds, Pad Mini Teased
Amazon Great Indian Festival 2026: Best Refrigerator Deals