శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 మోడల్ 12GB+256GB వేరియంట్ ధర రూ.1,24,999 కాగా, 12GB+512GB వేరియంట్ ధర రూ.1,44,999 గా ఉంది.
Photo Credit: Samsung/Motorola/Infinix
Samsung Galaxy Z Flip 8 vs Motorola Razr 60 Ultra vs Infinix Zero Flip
Smartphone Comparison : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల హవా ఊపందుకుంది. ఇటీవల శామ్‌సంగ్ తన మోస్ట్ అవైటెడ్ ఫ్లాగ్‌షిప్ శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8ను దేశీయ మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. అయితే దీనికి గట్టి పోటీ ఇస్తూ మార్కెట్లో ఇప్పటికే విక్రయమవుతున్న మోటరోలా రేజర్ 60 ఆల్ట్రా, బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్లతో హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ మూడింటిలో ధర, డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ విభాగాల్లో ఏది బెస్ట్ అనేది వివరంగా తెలుసుకుందాం.
ధర, స్టోరేజ్ వేరియంట్లు
ధర విషయంలో ఈ మూడు ఫ్లిప్ ఫోన్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 మోడల్ 12GB+256GB వేరియంట్ ధర రూ.1,24,999 కాగా, 12GB+512GB వేరియంట్ ధర రూ.1,44,999 గా ఉంది. ఇక ప్రీమియం రేంజ్‌లోనే లభించే మోటరోలా రేజర్ 60 ఆల్ట్రా 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,999 గా నిర్ణయించారు. మరోవైపు అత్యంత చౌకైన ఫ్లిప్ ఫోన్‌గా పేరుగాంచిన ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 8GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌ను కేవలం రూ.44,999కే సొంతం చేసుకోవచ్చు.
డిస్‌ప్లే విశేషాలు
స్క్రీన్ క్వాలిటీ పరంగా మూడూ అధునాతన డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. శామ్‌సంగ్ Z ఫ్లిప్ 8 లో 6.9-అంగుళాల AMOLED ప్రైమరీ డిస్‌ప్లే (120Hz, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్), బయట 4.1-అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. మోటరోలా రేజర్ 60 ఆల్ట్రాలో ఏకంగా 7-అంగుళాల 1.5K pOLED LTPO ప్రైమరీ డిస్‌ప్లే (165Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్), 4-అంగుళాల కవర్ డిస్‌ప్లే లభిస్తాయి. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌లో 6.9-అంగుళాల LTPO AMOLED ప్రైమరీ డిస్‌ప్లే, బయట 3.64-అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లేలను ఇచ్చారు.
ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్
పర్ఫార్మెన్స్ విషయంలో శామ్‌సంగ్, మోటరోలా ఫోన్లు టాప్ గేర్‌లో ఉన్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 అత్యంత శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9 పై పనిచేస్తుంది. మోటరోలా రేజర్ 60 ఆల్ట్రా మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పై రన్ అవుతుంది. కాస్త బడ్జెట్ మోడల్ అయిన ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌ను అందించి ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14.5 ఆపరేటింగ్ సిస్టమ్‌ను పొందుపరిచారు.
Xiaomi Power Bank : ఒకేసారి 3 డివైజ్లు ఛార్జ్ చేసుకోవచ్చు.. షావోమి నుంచి 67W పవర్ బ్యాంక్ లాంచ్
కెమెరా పవర్
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ మూడు ఫోన్లు భిన్నమైన కెమెరా సెటప్‌లను కలిగి ఉన్నాయి. శామ్‌సంగ్ Z ఫ్లిప్ 8 వెనుక 50MP ప్రైమరీ + 12MP అల్ట్రావైడ్ డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 10MP సెల్ఫీ కెమెరాను ఇచ్చింది. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌లో వెనుక OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ + 40MP అల్ట్రావైడ్ కెమెరా ఉండగా, సెల్ఫీల కోసం ఏకంగా 50MP ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం. ఇక మోటరోలా రేజర్ 60 ఆల్ట్రా వెనుక భాగంలో 50MP ప్రైమరీ + 50MP అల్ట్రావైడ్, ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరాను అందించి కెమెరా విభాగంలో ముందంజలో నిలిచింది.
బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్
బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ స్పీడ్ విషయంలో మోటరోలా, ఇన్ఫినిక్స్ ఫోన్లు శామ్‌సంగ్‌ను దాటేస్తాయి. శామ్‌సంగ్ Z ఫ్లిప్ 8 లో 4,300mAh బ్యాటరీతో పాటు 25W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌లో 4,720mAh భారీ బ్యాటరీ, 70W రాకెట్ స్పీడ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. అలాగే మోటరోలా రేజర్ 60 ఆల్ట్రాలో 4,700mAh బ్యాటరీతో పాటు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం లభిస్తుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999