Smartphone Comparison : శామ్‌సంగ్ Z ఫోల్డ్ 8 ఆల్ట్రా వర్సెస్ వివో X ఫోల్డ్ 6 వర్సెస్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్.. ఫోల్డబుల్ ఫోన్లలో ఏది కింగ్?

ప్రీమియం కేటగిరీలో వచ్చిన శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఆల్ట్రా 12GB+256GB మోడల్ ఆరంభ ధర రూ.1,99,999గా ఉంది.

Smartphone Comparison : శామ్‌సంగ్ Z ఫోల్డ్ 8 ఆల్ట్రా వర్సెస్ వివో X ఫోల్డ్ 6 వర్సెస్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్.. ఫోల్డబుల్ ఫోన్లలో ఏది కింగ్?

Photo Credit: Samsung/Vivo/Google

Samsung Galaxy Z Fold 8 Ultra vs Vivo X Fold 6 vs Google Pixel 10 Pro Fold

ముఖ్యాంశాలు
  • స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అత్యంత భారీ ఫోల్డబుల్ యుద్ధం
  • 7000mAh బ్యాటరీ, 200MP కెమెరాలతో విస్ఫోటనం
  • శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఆల్ట్రా లాంచ్
ప్రకటన

Smartphone Comparison : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పెద్ద స్క్రీన్ల ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇటీవల శామ్‌సంగ్ తమ అత్యంత ప్రీమియం ఫ్లాగ్‌షిప్ శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఆల్ట్రాను ఆవిష్కరించింది. అయితే దీనికి గట్టి సవాలు విసురుతూ వివో X ఫోల్డ్ 6, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ మోడళ్లు మార్కెట్లో నిలిచాయి. ఈ మూడు మోడళ్ల మధ్య ఉన్న ధర, డిస్‌ప్లే, ప్రాసెసింగ్ పవర్, కెమెరా, బ్యాటరీ తేడాలను వివరంగా పోల్చి చూద్దాం.

ధర, వేరియంట్ల పోలిక 
ప్రీమియం కేటగిరీలో వచ్చిన శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఆల్ట్రా 12GB+256GB మోడల్ ఆరంభ ధర రూ.1,99,999గా ఉంది. దీని 12GB+512GB వేరియంట్ ధర రూ.2,19,999 వరకు ఉంది. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ 16GB+256GB వేరియంట్ ధర రూ.1,72,999 గా ఉంది. ఇక వివో X ఫోల్డ్ 6 విషయానికి వస్తే చైనా మార్కెట్లో CNY 7,999 (సుమారు రూ.1,11,000) నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ CNY 9,999 (సుమారు రూ.1,39,000) వరకు ఉంది. ధర పరంగా వివో అత్యంత పోటీ ధరను ఆఫర్ చేస్తోంది.

అల్టిమేట్ డిస్‌ప్లేలు, బ్రైట్‌నెస్ 
మూడు ఫోన్లలోనూ కంటికి విందుగొలిపే ప్రైమరీ, కవర్ స్క్రీన్‌లు అమర్చారు. శామ్‌సంగ్ Z ఫోల్డ్ 8 ఆల్ట్రాలో 8-అంగుళాల AMOLED ప్రైమరీ, 6.5-అంగుళాల కవర్ AMOLED డిస్‌ప్లేలు ఉన్నాయి (రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తాయి). వివో X ఫోల్డ్ 6 లో 8.02-అంగుళాల ఇన్ సైడ్ AMOLED డిస్‌ప్లే, 6.51-అంగుళాల కవర్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 424 ppi పిక్సెల్ డెన్సిటీతో లభిస్తాయి. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో 8.0-అంగుళాల OLED ప్రైమరీ డిస్‌ప్లే, 6.4-అంగుళాల OLED కవర్ డిస్‌ప్లే ఉన్నాయి, ఇవి 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తాయి.

ప్రాసెసర్, RAM, ఆపరేటింగ్ సిస్టమ్ 
పర్ఫార్మెన్స్ విభాగంలో మూడు కంపెనీలు ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లను వాడాయి. శామ్‌సంగ్ Z ఫోల్డ్ 8 ఆల్ట్రాలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంది, ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9 పై పనిచేస్తుంది. వివో X ఫోల్డ్ 6 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ప్రాసెసర్‌ను అందించి ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 Fold పై రన్ అయ్యేలా చేశారు. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో గూగుల్ సొంతంగా తయారుచేసిన 3nm టెన్సార్ G5 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ లభిస్తాయి. మూడింటిలోనూ 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

OPPO Find X10 : ఒప్పో నుంచి సరికొత్త లుక్‌తో ఫైండ్ X10 సిరీస్.. కెమెరా డిజైన్ లీక్

కెమెరా పవర్, సెల్ఫీ సెన్సార్లు  
ఫోటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునేలా శామ్‌సంగ్,  వివో ఫోన్లలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలు అందించడం విశేషం. శామ్‌సంగ్ Z ఫోల్డ్ 8 ఆల్ట్రాలో 200MP + 50MP (అల్ట్రావైడ్) + 10MP (టెలీఫోటో) వెనుక కెమెరాలు, 10MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వివో X ఫోల్డ్ 6 లో 200MP + 50MP + 50MP (పెరిస్కోప్ టెలీఫోటో) వెనుక కెమెరా సెటప్‌తో పాటు రెండు స్క్రీన్‌లపై 20MP + 20MP ఫ్రంట్ కెమెరాలను ఇచ్చారు. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో 48MP ప్రైమరీ + 10.5MP అల్ట్రావైడ్ + 10.8MP టెలీఫోటో వెనుక కెమెరాలు, అలాగే లోపల వెలుపల చెరో 10MP సెల్ఫీ కెమెరాలు లభిస్తాయి.

 బ్యాటరీ, ఛార్జింగ్, కనెక్టివిటీ  
బ్యాటరీ విభాగంలో వివో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. వివో X ఫోల్డ్ 6 లో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో 5,015mAh బ్యాటరీ (30W వైర్డ్, 15W Qi2 వైర్‌లెస్) ఇచ్చారు. శామ్‌సంగ్ Z ఫోల్డ్ 8 ఆల్ట్రాలో 5,000mAh బ్యాటరీ (45W వైర్డ్, 20W వైర్‌లెస్) కలదు. కనెక్టివిటీ పరంగా మూడింటిలోనూ 5G, Wi-Fi 7, బ్లూటూత్, టైప్-సి పోర్ట్, NavIC/GPS సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »