WhatsApp : వాట్సాప్ యూజర్లకు షాక్.. ఇకపై డబ్బులు కట్టాల్సిందేనా?

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఒక సంచలన మార్పును తీసుకువస్తోంది.

WhatsApp : వాట్సాప్ యూజర్లకు షాక్.. ఇకపై డబ్బులు కట్టాల్సిందేనా?

Photo Credit: WhatsApp

WhatsApp Plus lets users pin up to 20 chats

ముఖ్యాంశాలు
  • డబ్బులు కట్టకపోతే వాట్సాప్ బంద్ అవుతుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ
  • మొదటిసారిగా వాట్సాప్‌లో నెలకు రూ.274 వసూలు
  • ఐఫోన్ యూజర్ల అకౌంట్లు ఖాళీ చేసేలా కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్
ప్రకటన

WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఒక సంచలన మార్పును తీసుకువస్తోంది. ఇప్పటివరకు పూర్తిగా ఉచితంగా సేవలు అందించిన ఈ ప్లాట్‌ఫామ్, ఇప్పుడు వాట్సాప్ ప్లస్ పేరుతో సరికొత్త పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఐఫోన్ (iOS) వినియోగదారులలో కొంతమందికి మాత్రమే ఈ ప్రీమియం ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఈ పెయిడ్ ప్లాన్ ధర ఎంత? ఇందులో కస్టమర్లకు లభించే ఆ 6 ప్రత్యేకమైన ఫీచర్లు ఏంటో  వివరంగా తెలుసుకుందాం.

డబ్బులు కట్టకపోతే వాట్సాప్ బంద్ అవుతుందా? 
వాట్సాప్ ప్లస్ అనే పెయిడ్ ప్లాన్ వస్తోందనే వార్త వినగానే చాలా మంది సామాన్య యూజర్లు కంగారు పడుతున్నారు. అయితే, కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. అంటే, డబ్బులు కట్టి అదనపు ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే దీనిని తీసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకోని సాధారణ యూజర్లకు ఎప్పటిలాగే మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ వంటి ప్రాథమిక సేవలు పూర్తిగా ఉచితంగానే అందుబాటులో ఉంటాయి.

వాట్సాప్ ప్లస్ ధర ఎంత? 
ప్రముఖ ఫీచర్ ట్రాకర్ వాబెటాఇన్ఫో నివేదిక ప్రకారం.. వాట్సాప్ ప్లస్ ప్రస్తుతం ఐఓఎస్ వెర్షన్ 26.17.74 రన్ అవుతున్న కొంతమంది ఐఫోన్ యూజర్లకు మాత్రమే లభిస్తోంది. ఐరోపా మార్కెట్లలో దీని ధర నెలకు 2.49 యూరోలుగా (మన భారత కరెన్సీలో దాదాపు రూ.274) ఉంది. ఈ ధరలు దేశాన్ని బట్టి మారే అవకాశం ఉంది. ఇది ప్రతి నెలా ఆటోమేటిక్‌గా రెన్యూ అవుతుంది, వద్దు అనుకుంటే బిల్లింగ్ డేట్‌కు 24 గంటల ముందే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కొందరు అర్హులైన యూజర్లకు వారం లేదా నెల రోజుల పాటు ఉచిత ట్రయల్ కూడా ఇస్తున్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సేవ కేవలం సాధారణ వాట్సాప్ మెసెంజర్‌కు మాత్రమే పరిమితం, వాట్సాప్ బిజినెస్  యాప్‌కు ఇది వర్తించదు.

 

Motorola : మార్కెట్లోకి మోటోరోలా మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

18 రకాల యాక్సెంట్ కలర్స్ 
వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే యూజర్లు తమకు నచ్చినట్లు యాప్ ఇంటర్‌ఫేస్‌ను డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఏకంగా 18 రకాల యాక్సెంట్ కలర్స్‌ను కంపెనీ అందిస్తోంది. వైబ్రంట్ బ్లూ, రాయల్ పర్పుల్, ఫారెస్ట్ గ్రీన్, బర్గండి, గోల్డెన్ ఎల్లో వంటి ఆకర్షణీయమైన రంగులను యూజర్లు ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న రంగు యాప్ మొత్తం అప్లై అయి కొత్త లుక్‌ను ఇస్తుంది. దీనితో పాటు యాప్ ఐకాన్‌ను మార్చుకోవడానికి 14 విభిన్న డిజైన్ల ఆల్టర్నేటివ్ యాప్ ఐకాన్స్ కూడా లభిస్తాయి.

ఇకపై 3 కాదు.. ఏకంగా 20 చాట్‌లను పిన్ చేసుకోవచ్చు 
సాధారణ వాట్సాప్ యాప్‌లో మనం ముఖ్యమైన కాంటాక్ట్స్‌ను కేవలం మూడు మాత్రమే స్క్రీన్ పైన ఉండేలా పిన్  చేసుకోగలం. కానీ వాట్సాప్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారు ఏకంగా 20 చాట్‌ల వరకు టాప్‌లో ఉండేలా పిన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల ఆఫీస్ గ్రూపులు, ఫ్యామిలీ చాట్‌లను మేనేజ్ చేయడం మరింత సులువవుతుంది. అంతేకాకుండా, ఒక కస్టమ్ చాట్ లిస్ట్ క్రియేట్ చేసి అందులోని అన్ని చాటింగ్‌లకు ఒకే విధమైన థీమ్, నోటిఫికేషన్ టోన్, రింగ్‌టోన్‌ను ఒకేసారి సెట్ చేసుకోవచ్చు.

ప్రీమియం యానిమేటెడ్ స్టిక్కర్స్, 10 సరికొత్త రింగ్‌టోన్లు 
ఈ పెయిడ్ ప్లాన్ యూజర్ల కోసం వాట్సాప్ కొన్ని ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లను అందుబాటులో ఉంచింది. వీటిని సబ్‌స్క్రైబర్లు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలరు. అయితే, ఈ స్టిక్కర్లను సాధారణ యూజర్లకు చాటింగ్‌లో పంపినప్పుడు వారు చూడవచ్చు, కానీ వారు వాటిని సేవ్ చేసుకోలేరు. వీటితో పాటు ఫ్లట్టర్, టెంపో, రిపుల్, క్వెస్ట్, డ్రమ్ వంటి 10 రకాల సరికొత్త ఎక్స్‌క్లూజివ్ రింగ్‌టోన్ ఆప్షన్లను కూడా ఈ ప్లాన్‌లో జోడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అదిరిపోయే ప్రీమియం ఫీచర్లను వాట్సాప్ ప్లస్‌లో తీసుకురానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »