సరికొత్త గెలాక్సీ S26 సిరీస్‌తో పాటు ప్రతిష్టాత్మకంగా పరిచయం చేసిన ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 స్థిరమైన అప్‌డేట్‌ను ఇప్పుడు పాత తరం ఫోన్లలోకి కూడా రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది.
Photo Credit: Samsung
Samsung’s One UI 8.5 update brings upgrades to old flagships
Samsung :ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తమ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల ప్రారంభంలో సరికొత్త గెలాక్సీ S26 సిరీస్‌తో పాటు ప్రతిష్టాత్మకంగా పరిచయం చేసిన ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 స్థిరమైన అప్‌డేట్‌ను ఇప్పుడు పాత తరం ఫోన్లలోకి కూడా రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. మొదట గెలాక్సీ S25, S24 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఈ అప్‌డేట్ ఇచ్చిన శాంసంగ్.. ఇప్పుడు భారతదేశంలోని పాత ఫోల్డబుల్ ఫోన్లయిన గెలాక్సీ Z ఫోల్డ్ 5, గెలాక్సీ Z ఫ్లిప్ 5ల కోసం కూడా ఈ అప్‌డేట్‌ను అధికారికంగా విడుదల చేసింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో టెక్ లవర్స్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ల ప్రకారం.. ఈ కొత్త అప్‌డేట్ దాదాపు 4GB భారీ సైజులో ఉంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఫీచర్లతో పాటు ఏప్రిల్ 2026 సెక్యూరిటీ ప్యాచ్‌ను కూడా కలిగి ఉంది. దీని బిల్డ్ వర్షన్లు వరుసగా F946BXXU6GZE2, F731BXXU6GZE3గా ఉన్నాయి.
శాంసంగ్ కేవలం ప్రీమియం ఫోల్డబుల్స్ మాత్రమే కాకుండా, తమ పాపులర్ బడ్జెట్ శ్రేణి A-సిరీస్‌లో కూడా ఈ అప్‌డేట్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే గెలాక్సీ A56, గెలాక్సీ A36 మోడళ్లకు ఈ అప్‌డేట్ అందగా.. తాజాగా గెలాక్సీ A26 స్మార్ట్‌ఫోన్ కోసం గ్వాటెమాలా దేశంలో వన్ యూఐ 8.5 అప్‌డేట్ (వర్షన్: A266MUBU9CZEA) లభిస్తోందని నివేదికలు వచ్చాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే భారతీయ గెలాక్సీ A26 వినియోగదారులకు కూడా ఈ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఓవర్-ది-ఎయిర్ (OTA) ద్వారా అందుబాటులోకి రానుంది.
Oppo : అఫీషియల్ ఎంట్రీ.. రూ.13,999 ధరకే ఒప్పో కొత్త 4G ఫోన్ వచ్చేసింది
వన్ యూఐ 8.5 లో వచ్చే సరికొత్త గెలాక్సీ AI ఫీచర్లు
ఈ వన్ యూఐ 8.5 అప్‌డేట్ ద్వారా పాత ఫోన్లలోకి సరికొత్త గెలాక్సీ S26 సిరీస్ ఫీచర్లు యాడ్ అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా:
* కస్టమైజబుల్ క్విక్ ప్యానెల్: నోటిఫికేషన్ బార్, క్విక్ సెట్టింగ్స్ సరికొత్త సిస్టమ్-వైడ్ గ్లాసీ లుక్, బ్లర్ ఎఫెక్ట్స్‌తో రీడిజైన్ చేయబడ్డాయి.
* కాల్ స్క్రీనింగ్ : తెలియని నంబర్ల నుండి కాల్స్ వస్తే Bixby ఏఐ అసిస్టెంట్ స్వయంగా మాట్లాడి, అవతలి వ్యక్తి ఏం చెబుతున్నారో స్క్రీన్‌పై లైవ్ టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది.
* రియల్-టైమ్ ఆడియో ఎరేజర్: వీడియోలు లేదా రికార్డింగ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను ఒకే క్లిక్‌తో సిస్టమ్-వైడ్‌గా తొలగించవచ్చు.
* అప్‌గ్రేడెడ్ బిక్స్బీ & పెర్‌ప్లెక్సిటీ AI: బిక్స్బీ అసిస్టెంట్ ఇప్పుడు సహజమైన భాషను పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకుంటుంది. దీనికి తోడు పెర్‌ప్లెక్సిటీ ఇంటిగ్రేషన్‌తో ఖచ్చితమైన వెబ్ సెర్చ్ రిజల్ట్స్ అందిస్తుంది.
మీరు కూడా మీ శాంసంగ్ ఫోన్‌లో ఈ అప్‌డేట్ వచ్చిందో లేదో చెక్ చేయడానికి Settings > Software update > Download and install ఆప్షన్‌లోకి వెళ్లి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ భారీ అప్‌డేట్‌ను వై-ఫై నెట్‌వర్క్, మొబైల్ ఛార్జింగ్ పెట్టి డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
OpenAI to Add Invisible Watermarks to ChatGPT Text in EU; Set to Test New Ad Format
Vivo Vision Discovery Edition Mixed Reality Headset Showcased at Vivo NEXT 2026 in India