రెగ్యులర్ రూటర్లపై రూ.1,700 వరకు, ప్రీమియం గేమింగ్ రూటర్లపై ఏకంగా రూ.17,000 వరకు నేరుగా ప్రైస్ కట్స్ ప్రకటించారు.
Photo Credit: Amazon
Amazon Great Summer Sale is offering deals on Wi-Fi routers
Amazon Great Summer Sale 2026 : ఇంట్లో లేదా ఆఫీసులో ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదా? పాత రూటర్ వల్ల సిగ్నల్ డ్రాప్స్ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే మీకు ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక గ్రేట్ సమ్మర్ సేల్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలపైనే కాకుండా హై-స్పీడ్ వైఫై రూటర్లపై ఊహించని రేంజ్ లో తగ్గింపులు లభిస్తున్నాయి. రెగ్యులర్ రూటర్లపై రూ.1,700 వరకు, ప్రీమియం గేమింగ్ రూటర్లపై ఏకంగా రూ.17,000 వరకు నేరుగా ప్రైస్ కట్స్ ప్రకటించారు. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (గరిష్టంగా రూ.9,500 వరకు) లభిస్తుండటంతో ఈ డీల్స్ మరింత చౌకగా మారాయి.
వెయ్యి రూపాయల లోపే డీ-లింక్ వైఫై రూటర్
మీరు తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన రూటర్ కోసం చూస్తుంటే, మార్కెట్ లీడర్ డీ-లింక్ మోడళ్లపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. సాధారణంగా రూ.1,800 ధర ఉండే D-Link DIR-615 బేసిక్ రూటర్ ఈ సేల్‌లో కేవలం రూ.999లకే లభిస్తోంది. అలాగే కొంచెం ఎక్కువ కవరేజ్, డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ కావలసిన వారు D-Link DIR-825 మోడల్‌ను రూ.4,355కి బదులుగా కేవలం రూ.1,999లకే సొంతం చేసుకోవచ్చు. వైఫైతో పాటు 4G సిమ్ కార్డ్ సపోర్ట్ ఇచ్చే D-Link G403C రూటర్ అయితే రూ.8,260 అసలు ధర నుంచి ఏకంగా రూ.2,999కి పడిపోయింది.
గేమర్స్ కోసం అల్ట్రా ప్రీమియం అసూస్ రాగ్ రూటర్..
ఆన్‌లైన్ గేమ్స్ ఆడేటప్పుడు లాగ్స్ లేకుండా, సూపర్ ఫాస్ట్ పింగ్ రావాలనుకునే ప్రొఫెషనల్ గేమర్స్ కోసం యాపిల్ ఆఫ్ గేమింగ్ గా పిలవబడే అసూస్ సంస్థకు చెందిన Asus ROG Rapture GT-AX11000 Pro రూటర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర మార్కెట్లో రూ.62,000కాగా, ఈ సమ్మర్ సేల్‌లో ఏకంగా రూ.17,001 తగ్గింపుతో కేవలం రూ.44,999 లకే విక్రయిస్తున్నారు. హెవీ లోడ్‌ను తట్టుకునేలా, మల్టిపుల్ డివైజ్ కనెక్టివిటీ ఇచ్చే ఈ రూటర్ గేమింగ్ లవర్స్‌కు ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పవచ్చు.
జియో 6 మెష్ రూటర్,టెండా బడ్జెట్ మోడల్స్ పై క్రేజీ డీల్స్
ఇల్లంతా వైఫై సిగ్నల్ స్ట్రాంగ్‌గా ఉండటం కోసం మెష్ రూటర్ వాడాలనుకునే వారికి జియో అద్భుతమైన ఆప్షన్ ఇస్తోంది. Jio AX6000 WiFi 6 Mesh Router అసలు ధర రూ.14,999 కాగా, అమెజాన్ సేల్‌లో ఇది సగానికి పైగా తగ్గి రూ.5,699 లకే అందుబాటులో ఉంది. ఇది కాకుండా బడ్జెట్ రేంజ్ లో డ్యూయల్ బ్యాండ్ ఫీచర్లు ఇచ్చే Tenda AC10 రూటర్ రూ.2,349లకే, Tenda AC5 V3 మోడల్ రూ.3,500కి బదులుగా కేవలం రూ.1,799లకే లభిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఏరియా కవర్ చేయడానికి టెండా రూటర్లు బాగా ఉపయోగపడతాయి.
బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేదా?
మీ ఏరియాలో లోకల్ కేబుల్ ఇంటర్నెట్ లేదా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేకపోతే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం మొబైల్ 4G సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఇల్లంతా వైఫై జోన్ లా మార్చేసే సిమ్ బేస్డ్ రూటర్లు ఇప్పుడు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. సేల్‌లో Geonix 4G SIM-Based Router కేవలం రూ. 1,518 లకే దొరుకుతుండగా.. Lapcare 4G SIM-based router రూ.1,789కి, ప్రీమియం క్వాలిటీతో వచ్చే Fedus 4G SIM-based router రూ.3,499 అసలు ధర నుంచి తగ్గి రూ.2,609 లకే సేల్‌లో సేల్ అవుతున్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ త్వరలోనే ముగియనుండటంతో స్టాక్ అయిపోయేలోపే ఈ డీల్స్ దక్కించుకోవడం మంచిది.
| Model | List Price | Sale Price | Buy Now |
|---|---|---|---|
| D-Link DIR-615 | Rs. 1,800 | Rs. 999 | Buy Now |
| D-Link G403C | Rs. 8,260 | Rs. 2,999 | Buy Now |
| D-Link DIR-825 | Rs. 4,355 | Rs. 1,999 | Buy Now |
| Jio AX6000 WiFi 6 Mesh Router | Rs. 14,999 | Rs. 5,699 | Buy Now |
| Asus ROG Rapture GT-AX11000 Pro | Rs. 62,000 | Rs. 44,999 | Buy Now |
| Tenda AC10 | Rs. 4,900 | Rs. 2,349 | Buy Now |
| Tenda AC5 V3 | Rs. 3,500 | Rs. 1,799 | Buy Now |
| Geonix 4G SIM-Based Router | Rs. 4,500 | Rs. 1,518 | Buy Now |
| Lapcare 4G SIM-based router | Rs. 3,999 | Rs. 1,789 | Buy Now |
| Fedus 4G SIM-based router | Rs. 3,499 | Rs. 2,609 | Buy Now |
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch