ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టంట్స్ అనేది కేవలం ఫొటోలను తక్షణమే షేర్ చేయడానికి తీసుకొచ్చిన ఒక స్మార్ట్ టూల్
Here's Everything You Need to Know About Instagram Instants
Instagram Instants : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా, తన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం ఒక అదిరిపోయే సరికొత్త ఫీచర్‌ను రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. దీనికి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టంట్స్ అని పేరు పెట్టారు. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ స్నేహితులకు క్షణాల్లో మాయమైపోయే ఫొటోలను పంపుకోవచ్చు. మీ ఫాలోవర్స్ లేదా ఫ్రెండ్స్ ఆ ఫొటోను ఒక్కసారి ఓపెన్ చేసి చూడగానే.. అది ఆటోమేటిక్‌గా వారి ఇన్‌బాక్స్ నుంచి డిలీట్ అయిపోతుంది. స్నాప్‌చాట్ యాప్‌లో ఉండే డిసప్పియరింగ్ ఫీచర్ తరహాలోనే ఇది పనిచేస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టంట్స్ అనేది కేవలం ఫొటోలను తక్షణమే షేర్ చేయడానికి తీసుకొచ్చిన ఒక స్మార్ట్ టూల్. ప్రస్తుతం ఉన్న స్టోరీలు లేదా రీల్స్ లాగా కాకుండా, ఇది పూర్తిగా మీ ఇన్‌బాక్స్ కేంద్రంగా పనిచేస్తుంది. మీరు క్లిక్ చేసిన ఫొటోలు నేరుగా అవతలి వ్యక్తి ఇన్‌బాక్స్‌లోకి వెళ్తాయి. అయితే, స్నాప్‌చాట్‌లా ఇందులో వీడియోలను షేర్ చేయడానికి ప్రస్తుతానికి వీల్లేదు, కేవలం ఫొటోలు మాత్రమే పంపగలరు. ఒకవేళ మీరు పొరపాటున ఏదైనా ఫొటోను ఇన్‌స్టంట్స్‌లో షేర్ చేస్తే.. దాన్ని వెంటనే డిలీట్ చేయడానికి అన్‌డూ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఫీచర్ కోసం మెటా ఒక సరికొత్త స్టాండ్‌అలోన్ యాప్‌ను కూడా మార్కెట్లోకి తెచ్చింది.
ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశం ఎలాంటి ఎడిటింగ్ లేకుండా రియల్ ఫొటోలను షేర్ చేయడం. అందుకే, ఈ ఫొటోలకు మీరు క్యాప్షన్లు యాడ్ చేయవచ్చు కానీ.. ఎలాంటి అదనపు ఫిల్టర్లు లేదా భారీ ఎడిటింగ్స్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ అనుమతించదు. మీరు పంపే ఫొటోలు అవతలి వారికి ఒక ఫొటోల స్టాక్ లాగా కనిపిస్తాయి. వారు ఆ ఫొటోను చూస్తూనే అక్కడికక్కడే రియాక్షన్స్ ఇవ్వవచ్చు లేదా రిప్లై ఇవ్వవచ్చు. అంతేకాదు, మీరు పంపిన ఇన్‌స్టంట్స్ అన్నీ ఒక సంవత్సరం పాటు ప్రైవేట్ ఆర్కైవ్‌లో దాగి ఉంటాయి. వాటి సహాయంతో మీరు ఏడాది చివర్లో ఇన్‌స్టంట్స్ రీక్యాప్ క్రియేట్ చేసి ఇన్‌స్టా స్టోరీగా కూడా పెట్టుకోవచ్చు.
![]()
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టంట్స్ ఫొటోను పోస్ట్ చేయడం ఎలా?
* మొదట మీ మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* స్క్రీన్‌ను కుడివైపునకు స్వైప్ చేసి లేదా కింద ఉన్న మెసేజెస్ బటన్ నొక్కి ఇన్‌బాక్స్‌లోకి వెళ్లండి.
* పేజీకి కుడివైపు కింద మూలలో కనిపించే ప్లస్ (+) గుర్తుపై క్లిక్ చేయండి.
* ఇప్పుడు న్యూ ఇన్‌స్టంట్ పేజీ ఓపెన్ అయి, మీ ఫోన్ కెమెరా కనిపిస్తుంది.
* వెంటనే ఒక ఫొటో క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ లేదా క్లోజ్ ఫ్రెండ్స్‌కు ఇన్‌స్టంట్‌గా పంపేయడమే.
* పాత ఫొటోలతో ‘రీక్యాప్' స్టోరీ క్రియేట్ చేయడం ఎలా?
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్ ఓపెన్ చేసి, కింద ఉన్న ప్లస్ (+) గుర్తును నొక్కండి (ఒకవేళ ఇన్‌బాక్స్‌లో చూడని ఇన్‌స్టంట్స్ ఉంటే ప్లస్ గుర్తు బదులు ఆ ఫొటో కనిపిస్తుంది).
* కెమెరా ఫీడ్ ఓపెన్ అయిన తర్వాత, స్క్రీన్ పైభాగంలో కుడి మూలలో ఉన్న నాలుగు చతురస్రాల (Four Boxes) గుర్తులను నొక్కండి.
* ఇప్పుడు మీ పాత ఇన్‌స్టంట్స్ అన్నీ కనిపిస్తాయి. వాటిలో మీకు కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకోండి.
* కింద కనిపించే క్రియేట్ రీక్యాప్ బటన్‌ను నొక్కి, దాన్ని నేరుగా మీ ఇన్‌స్టా స్టోరీగా షేర్ చేసుకోవచ్చు.
ఈ తలనొప్పి మాకొద్దు బాబోయ్ అనుకుంటే.. ఇలా ఆఫ్ (Turn Off) చేసుకోండి!
మీ ఇన్‌బాక్స్‌లో ఫ్రెండ్స్ పంపే ఈ మాయమైపోయే ఫొటోల గోల మీకు నచ్చకపోతే, ఈ ఫీచర్‌ను పూర్తిగా ఆఫ్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్ ఇచ్చింది.
* ముందుగా మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పేజీకి వెళ్లండి.
* పైన కుడి మూలలో ఉన్న మూడు గీతలను (Menu) క్లిక్ చేయండి.
* సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ కిందకి స్క్రోల్ చేసి 'వాట్ యూ సీ' (What you see) సెక్షన్‌కు వెళ్లండి.
* అందులో కంటెంట్ ప్రిఫరెన్సెస్ బటన్‌పై నొక్కండి.
* ఇప్పుడు హైడ్ ఇన్‌స్టంట్స్ ఇన్ ఇన్‌బాక్స్ ఆప్షన్‌ను ఆన్ చేస్తే చాలు.. ఇకపై మీ ఇన్‌బాక్స్‌లో అవి కనిపించవు. మళ్లీ కావాలనుకుంటే ఇదే పద్ధతిలో ఆన్ చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch